Skip to main content

Jabardasth టీమ్ సభ్యులు షాకింగ్ వేతనం OMG:Jabardasth Team Members Shocking Remuneration | Hyper Aadi | Anasuya | Sudigali Sudheer | Rashmi

              Jabardasth టీమ్ సభ్యులు షాకింగ్ వేతనం

     జబర్దస్త్….ఈ బుల్లి తెర కామెడీ షో గురించి తెలియని వారు ఉండరు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా వీక్షించే షో జబర్దస్త్.ప్రతీ గురు,శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది.కాగా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ కలిగిన షో గా జబర్దస్త్ రికార్డు లను సృష్టించింది.ఈ షో కి వారం వారానికి అభిమానులు ఒక రేంజ్ లో పెరుగుతున్నారు.వాస్తవానికి ఈ షో మొదలయ్యి 5 సవంత్సరాలు దాటుతున్న కొంచెం కూడా ప్రజల్లో ఈ షో పట్ల క్రేజ్ తగ్గలేదు అంటే..దాని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం ఎంతటి ఘన విజయం తో ముందుకు దూసుకుపోతుందో.చిన్నపిల్లలనుండి పెద్దవాళ్లవరుకు అందరూ ఈ షో కి అభిమానులే. ఈ షో లో అనసూయ, రేష్మీలు వాళ్ళ అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.

     ఇంతలా పాపులర్ అయిన జబర్దస్త్ షో లో పార్టిసిపేట్స్  ఎంత పారితోషికం సంపాదిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది.రేష్మి విషయానికి వస్తే…ఆమె సినిమాల్లో నటిస్తూ జబర్దస్త్,ఢీ 10 కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. . అడిగినన్ని డేట్స్ కూడా ఇచ్చేస్తోందట. ప్రస్తుతం రేష్మి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే రీతిలో వ్యవహరిస్తోంది.రేష్మి జబర్దస్త్ ఒక్కో ఎపిసోడ్ కి ఏభై వేలు తీసుకుంటుందట. అంటే నెలకు దాదాపుగా రెండు లక్షల వరకు జీతం వస్తుంది. ఢీ 10 కార్యక్రమానికి కూడా ఒక్కో ఎపిసోడ్ కి ఏభై వేలు తీసుకుంటుంది రేష్మి. అంటే కేవలం ఒక్క  ఈ టివి ద్వారానే  నెలకు నాలుగు లక్షల వరకు సంపాదిస్తుంది.ఇక అనసూయ విషయానికి వస్తే ఒక్కో ఎపిసోడ్ కి ఏభై వేలు పారితోషికాన్ని తీసుకుంటుందట.

       అంటే  అనసూయకు కూడా నెలకు రెండు లక్షల రూపాయిలు జబర్దస్త్ ద్వార అందుతున్నాయి అన్న మాట.అడ వేషాలు వేసే చమక్ చంద్రకి ఒక్కో ఎపిసోడ్ కి లక్ష నుంచి లక్షన్నర రూపాయిలు,సుధీర్  కి లక్షన్నర,సాఫ్ట్ వెర్ రంగం నుండి జబర్దస్త్ కి వచ్చిన అభికి ఎనభై వేల పారితోషికాన్ని జబర్దస్త్ టీమ్ ఇస్తుందట.రామ్ ప్రసాద్ కి ఒక్కో ఎపిసోడ్ కి నలభై వేల రూపాయిలు, గెటప్ శ్రీనుకి ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు, రాకెట్ రాఘవకు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు,సుధాకర్,భాస్కర్ ఇద్దరికి కలిపి ఎనభై వేలు,అవినాష్ టీం కి కూడా ఒక్కో ఎపిసోడ్ కి ఎనభై వేలు ఇస్తారట.ఇక తన పంచ్ డైలాగ్స్ తో ,కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ ను ఒక ఊపు వూపేస్తున్న సంచలన కమెడియన్ ఆది జబర్దస్త్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటాడు. ఆది స్కిట్స్ లలో పంచ్ డైలాగ్ లు అందరిని ఆకట్టుకోవటమే కాకూండా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రప్పిస్తారు. అందువల్ల ఆదికి ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షల రూపాయిలను ఇస్తారట. ఇక జడ్జీలు అయినా రోజా,నాగబాబులకు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు ఇస్తారట జబర్దస్త్ నిర్వాహకులు.
 

Comments

Jabardasth టీమ్ సభ్యులు షాకింగ్ వేతనం OMG:Jabardasth Team Members Shocking Remuneration | Hyper Aadi | Anasuya | Sudigali Sudheer | Rashmi

posted onAugust 4, 2018
by sumantv

Tags

jabardasth remuneration per episode extra jabardasth etv comedy show telugu comedy tracks comedy skits in telugu