రామ స్టేజ్ పైకి వెళ్తుంటే అనుష్క ఏంచేస్తుందో చూడండి ? | SS Rajamouli At Behindwoods Gold Medals 2018

     తమిళనాడులో అరుదైన గౌరవం అందకున్న దర్శకధీరుడు.. అక్కడే ఉన్న అనుష్క ఏం చేసిందో చూడండి..?

      దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బాహుబలిసినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. బాహుబలి సినిమాను ఓ దీక్షలా, యజ్ఞంలా పూర్తి చేశారు. ఈ సినిమా కోసం రాజమౌళితో పాటు ఆయన భార్య రమా కూడా ఎంతో శ్రమించారు. కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, మేకప్‌ తదితర విషయాల్లో ఆమె ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలిసినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఎంత కష్టపడ్డారో.. ఆయన వెన్నంటే ఉండి రమా కూడా అంతే సాయపడ్డారు అని చెప్పక తప్పదు.. ఇక ఈ సినిమాకు గానూ ఇప్పటివరకు రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఇదిలాఉంటే ఇటీవలే బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతాకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను బిహైండ్‌వుడ్స్‌ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.

     ఆ వీడియోలో రాజమౌళి మెడల్‌ అందుకుంటున్న సందర్భంగా కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్న యాంకర్స్ అతడి సతీమణి “రమా” గారిని కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు. వాళ్లు తమిళ భాషలో స్టేజ్‌పైకి రమ్మని చెప్పడంతో వాళ్లు ఏమంటున్నారో ఆమెకు అర్థంకాలేదు. అప్పుడే మైక్‌ తీసుకున్న రాజమౌళి ప్రేమగా “చిన్నీ.. స్టేజ్‌పైకి రమ్మంటున్నారు” అని పిలిచాడు... అంతే ఒక్కసారిగా ఆ ఆడిటోరియం దద్దరిల్లింది.. అలా చప్పట్లు, అరుపుల మద్య “రమ గారు” లేచి స్టేజ్‌పైకి వెళుతుండగా అక్కడే ఉన్న అనుష్క.. రమా, రాజమౌళిల ఫొటోలు తీశారు. పైగా ఆజంటను అభినందించాల్సిందిగా అక్కడున్న అందరిని కోరుతూ అల్లరి అల్లరి చేసింది అనుష్క.. ఈ అపురూపమైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది... ఈ వీడియో చూసినా జక్కన్నఅభిమానులు అతడిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.. “మీరు ఎన్ని బహుమతులైనా తీసుకోవడానికి అర్హులు... తమిళ ప్రజలకు కుడా తెలుగోడి గొప్పతనాన్ని నిరూపించారు.. ఐ లవ్ యు సార్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు సిని అభిమానులు..

Comments