నూతన్ నాయుడు మళ్లీ బిగ్ బాస్ హౌస్ కి రాగానే అందరు ఏంచేసారో తెలుసా|Nutan Naidu Re Entry In Bigg Boss

           నూతన్ నాయుడు మళ్లీ బిగ్ బాస్ హౌస్ కి రాగానే అందరు ఏంచేసారో తెలుసా

     నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2పై మొదట చప్పగా సాగుతోందనే కామెంట్స్ వచ్చినా..  మెల్లగా ఆసక్తికరంగా మారుతోంది. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్లే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి ఎలిమినేట్ అయ్యారు. తేజస్వి ఉన్నంత వరకు ఏదో ఒక వివాదం చోటు చేసుకుంది. ఆమె వెళ్లిన తరువాత హౌస్ కొంచెం చల్లబడటంతో తేజస్విని హౌస్ లోకి తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ వ్యక్తిని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన సభ్యులలో ఎవరు తిరిగి హౌస్ లోకి చేరుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.ఆడియన్స్ లో ఎక్కువగా నూతన నాయుడు పేరు వినిపిస్తోంది. సామాన్యుడిగా అతడివైపు ఆడియన్స్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

     గలగలా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే శ్యామల ఎలిమినేషన్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. కౌశల్, తేజస్వి.. దీప్తి, నందినిని సేవ్ చేయడంతో శ్యామల ఎలిమినేట్ అయింది. ఆన్ లైన్ పోల్ లో శ్యామలకు ఎక్కువ ఓట్లు వస్తుండడంతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అనుకుంటున్నారు.కానీ ఇప్పుడు ఊహించని విధంగా నూతన్ నాయుడు హౌస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. హౌస్ లోకి వచ్చిన రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ కు సోషల్ మీడియాలో అభిమానులు బాగా పెరిగారు. దీంతో ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. తేజస్వి, సంజన, కిరీటి, భానుశ్రీ కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్లలో ఒకరు హౌస్ లోకి తిరిగి ప్రవేశించే అవకాశాలు మొదట్లో కనిపించాయి ..

      అయితే ఎవరు ఊహించని విధంగా నూతన నాయుడు ,శ్యామల ఇద్దరినీ హౌస్ లోకి వస్తారు అని అనౌన్స్ చేసాడు నాని ..ఇందులో భాగం గా ఈ రోజు విడుదల చేసిన ప్రోమో లో నూతన నాయుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది ..అందరికి గిఫ్ట్స్ పంపిన బిగ్ బాస్ స్టోర్ రోమ్ లో వున్నా గిఫ్ట్ ను గణేష్ ఓపెన్ చేసి చూడగా అందులో నూతన నాయుడు ప్రత్యక్షమవుతాడు ..అందరిని సుర్ప్రిసె చేస్తూ హౌస్ లోకి తిరి మళ్ళీ ఎంటర్ అయినా నూతన నాయుడిని చూసి అందరు ఒక్కసారి గా షాక్ కి గురవుతారు ...ఇక కౌశల్ కి మాత్రం కొండంత అండ దొరికినంత ఆనందం గా ఉన్నట్టు అర్ధం అవుతుంది ...ఇక వీరు ఇద్దరు కలిసి ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో చూడాలి ...
 

Comments