అదా శర్మ రెజినాలకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు | Police Gives Shock To Regina And Adah Sharma

           అదా శర్మ రెజినాలకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు 

     సోషల్ మీడియా వచ్చాకా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్స్ కు ఎవరు ఎక్కడినుండైనా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీస్ టార్గెట్ అందరిని అలరిస్తుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి లేటెస్ట్ కికి ఛాలెంజ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. కికి ఛాలెంజ్ విషయానికొస్తే.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘కికి ఛాలెంజ్’ జనాల్ని ఊపేస్తోంది. పాప్ సింగర్ డార్క్ రూపొందించిన తాజా ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు స్టెప్పులేయడమే ఈ ‘కికి ఛాలెంజ్’. కారులో నుంచి బయటికి వచ్చి కదులుతున్న కారుతో పాటు స్టెప్పులేసుకుంటూ వెళ్లడమే ఈ ‘కికి ఛాలెంజ్’. ఇప్పటికే చాలా మంది ఈ ‘కికి ఛాలెంజ్’ను తీసుకొని స్టెప్పులేశారు. అయితే దీన్ని కికి ఛాలెంజ్ గా ప్రమోట్ చేయడం దానికి బాలీవుడ్ నుండి టాలీవుడ్ హీరోయిన్స్ ఫాలో అవడం జరుగుతుంది. కానీ అంతా పార్క్ చేసిన కారు వద్ద మాత్రమే డ్యాన్స్ చేయగలిగారు.

     అయితే హీరోయిన్ రెజీనా కాసండ్రా మాత్రం తన ప్రత్యేకత చూపించుకుంది. కారు కదులుతుండగా దానితో పాటు వెళ్తూ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ హావభావాలు పలికించింది. అది కూడా నడిరోడ్డుపై. లంగా ఓణీలో అచ్చతెలుగమ్మాయిలా తయారై మరీ ఈ కికి ఛాలెంజ్‌ను చేసి చూపించింది. రెజీనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంప్రదాయ ఓణీలో ఇంగ్లిష్ పాటకు స్టెప్పులేస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది. వాస్తవానికి ఈ ఛాలెంజ్‌ను ఇంతకు ముందే హీరోయిన్ అదా శర్మ పూర్తిచేసింది. అయితే కదులుతున్న కారుతో కాకుండా ఆగి ఉన్న కారు వద్ద చేసింది.

    మరోవైపు, ఈ వైరల్ ట్రెండ్‌పై ఇప్పటికే పోలీసులు ఓ కన్నేశారు. కదులుతున్న కారుతో ఇలాంటి డ్యాన్సులు చేయడం వల్ల చాలా మందికి గాయాలయ్యాయట. అందుకే ఈ ట్రెండ్‌కు వెంటనే అడ్డుకట్ట వేయాలని ముంబై పోలీసులు కార్యచరణ రచిస్తున్నారు. అయితే దీని ప్రభావంతో హైదరాబాద్ లో కూడా  ఎవరైనా ఇలా కికి ఛాలెంజ్ అని రోడ్ల మీద కారు దిగి వీడియో చేస్తే జైలుకి వెళ్తారని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ ట్రాఫిక్ కు ఇది సమస్యగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇలా కార్ దిగి స్టెప్ లు వేసి ఎవరైనా పోస్ట్ చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తాము అని పోలీసులు హెచ్చరించారు ..ఇక ఇప్పటికే ఈ వీడియో లు పోస్ట్ చేసిన ఆదా శర్మ ,రెజీనా లపై హైదరాబాద్ పోలీసులు మంది పడ్డారు ..జనానికి ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలాంటివి చేస్తే ఇక మాములు జనం మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటారు అని గట్టిగా చురకలు అంటించారు ..
 

Comments