మీరు ఇవి తింటున్నారా..? ఐతే మీ కాలేయం పాడైనట్టే..! | Bad Food For Liver - Liver Disease |

        మీ లివర్ చెడిపోయేందుకు ముఖ్య కారణాలేమిటో తెలుసా..? 

      మానవుల శరీరంలో లివర్ అత్యంత పెద్దదైన అవయవం.దీన్ని  తెలుగులో కాలేయం అని  పిలుస్తారు.ఇది మన ఉదరంలో కుడిభాగానికి కింద ఉంటుంది. ఇది చేసే మేలు అంతా యింతాకాదు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరానికి తగినంత శక్తిని   అందించడం, మన శరీరంలో ఉన్న విష పదార్థాల్ని  బయటికి పంపించడం  లివర్  చేసే ముఖ్యమైన పనుల్లో కొన్ని.  అయితే నేటి కాలంలో మానవుల ఆహారపు అలవాట్లు  మూలంగా అనేక వ్యాధులబారినపడ్డంతోపాటు  లివర్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది. ఈ క్రమంలో  ఏఏ ఆహారపు అలవాట్లు, కాలేయాన్ని అంటే లివర్ ని డ్యామేజ్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం....

      మనలో చాలా మందికి కూల్‌ డ్రింక్స్ తాగడమంటే ఎక్కువ యిష్టం. నిజానికి ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల   కాలేయం త్వరగా చెడి పోతుందని ఒక అధ్యయనంలో తేలింది. జనరల్ గా  కూల్‌ డ్రింక్స్ లో రసాయన  పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి  కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. అలాగే  ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగి,లివర్ డ్యామేజ్ అవుతుందని ఆ అధ్యయనంలో తేలింది. ఉప్పు కలిసిన పదార్థాలు అధికంగా  తీసుకోవడంవల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఉప్పువల్ల రక్తపోటు కూడా అధికమై,దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కొన్ని  ఆహార పదార్థాలు  రుచిగా ఉండడంకోసం,  వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ అనే రసాయన పదార్థాన్ని ఎక్కువగా కలుపుతూ ఉన్నారు.  ఈ పదార్థంకలిసిన  ఆహారాన్ని తినడంవల్ల ఆ పదార్థాలతోపాటు, ఈ మోనోసోడియం గ్లుటమేట్ అనే రసాయనం కూడా  మన శరీరంలోకి ఎక్కువశాతంలో చేరుకోవడంవల్ల అది  లివర్ ని డ్యామేజ్ చేస్తుంది.అంటే చెడిపోయేలా చేస్తుంది.కాబట్టి సాధ్యమైనంతవరకూ ఈ మోనోసోడియం గ్లుటమేట్ కలిపిన ఆహారపదార్థాల్ని తినకుండా ఉండడం మంచిది.

     మనలో చాలామందికి స్వీట్స్ గానీ,తీపి పదార్థాలుగానీ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. స్వీట్స్ గానీ ఈ  చక్కెర ఎక్కువశాతం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన కాలేయం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులైన వైద్యులు చెబుతున్నారు. తీపి పదార్థాల్నీ లేదా స్వీట్స్ ని  అతిగా తింటే అది శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు సరికదా, మనం తిన్న ఆ తీపి మొత్తం  లివర్‌లోనే పేరుకుపోయి క్రమేపీ అది కొవ్వుగా మారిపోతుంది. దీంతో కొంత కాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుందని ఆ నిపుణులు చెబుతున్నారు.

   జనరల్ గా మనం కంటి సంబంధ సమస్యలు పరిస్కరించుకోవడానికి విటమిన్ ఎ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొంటూ ఉంటాం...   అయితే ఈ విటమిన్ ఏ ని గనుక ఎక్కువ  మోతాదులో తీసుకున్నట్లైతే, దాని ప్రభావం లివర్‌పై పడి.లివర్ డ్యామేజి అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి, అధిక బరువు మరియు స్థూల కాయం,బెల్లీ ఫ్యాట్  ఉన్నవారు కూడా లివర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినట్లైతే ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధివల్ల లివర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. చాలామందిలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఈ సమస్యతో  బాధపడే వారికి లివర్ వ్యాధులు వచ్చే అవకాశం 50 శాతం వరకు ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. 

 సాధారణంగా పిల్లలతోపాటు పెద్దల్ల్లో కొందరు    చిప్స్‌ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వాటిలో  విషపూరితమైన పదార్థాలు ఎక్కువగా ఉండడంవల్ల అవి లివర్ యొక్క ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.అంటే లివర్ ని దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి అలాంటి వాటికి ఎంత   దూరంగా ఉంటే అంత  మంచిది. కొందరికి హెపటైటిస్ ఎ,హెపటైటిస్ బి,హెపటైటిస్ సి వంటి వ్యాధులు వస్తుంటాయి.అలా వచ్చినప్పుడు సరైన సమయంలో స్పందించి చికిత్స చేయించుకోకపోయినట్లైతే,వారి  లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుందట.

క్యాన్సర్ ఉన్నవారు,  క్యాన్సర్ చికిత్స కోసం   కీమోథెరపీ చేయించుకొంటూ ఉంటారు.దీనివల్ల కూడా లివర్ చెడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలాచోట్ల  క్రిమి సంహారక మందులను వాడి, కూరగాయలు, పండ్లను పండిస్తుంటారు.అలాంటి వాటిని తిన్నట్లైతే, ఆ క్రిమిసంహారక మందులు   మన శరీరంలోకి వెళ్లి,అవి లివర్ ని డ్యామేజ్ చేస్తాయి.కొందరు  యాంటీ డిప్రెస్సెంట్స్‌, మూడ్ స్టెబిలైజర్స్‌, కార్టికోస్టెరాయిడ్స్‌, పెయిన్ రిలీవర్స్ వంటి పలు రకాల మెడిసిన్‌లను దీర్ఘ కాలం వాడినట్లైతే, లివర్   దెబ్బ తింటుంది. అంతేకాదు  డాక్టర్ల సిఫారసు లేకుండా సొంతంగా మందులను వాడేవారికి కూడా  లివర్ ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే  పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడి అవి తీవ్రతరమైనా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదిబడితే అది తినకుండా జాగ్రత్తగా డైట్ ని పాటిస్తే మీ లివర్ చెడిపోకుండా పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటుంది.  

Comments