ఒకే ఒక స్పూన్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందొ ఇలా తెలుసుకోండి || Spoon Test Reveals Hidden Health Problems

     డబ్బుతో పనిలేకుండా ఒకే ఒక్క  స్పూన్ తో టెస్ట్ చేసుకుని మీ అనారోగ్యాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు 

     ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మన పెద్దలు చెప్పినమాట.ఒక మనిషి ఎలాంటి రోగాలూ లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలుగుతాడు.చక్కగా పనిచెయ్యగలుగుతాడు.ఒక్కోసారి మనకి మన శరీరం మనకి  కొన్ని సంకేతాలను సూచిస్తుంది.అలా  శరీరం సూచించే సంకేతాలను గనుక అశ్రద్ధ చేస్తే   తీవ్ర అనారోగ్య సమస్యకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మనకు అనారోగ్యంగా అనిపించినప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా  ప్రాథమిక దశలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనారోగ్యాల్ని  ప్రాధమిక దశలోనే దూరంగా తరిమికొట్టవచ్చు.ఈ రోజుల్లో కొద్దిగా అనారోగ్యంగా ఉందని డాక్టర్ దగ్గరికెళ్తే చాలు ఆ టెస్టులు,ఈ టెస్టులు అంటూ మనజేబుకి చిల్లు పెట్టేస్తూ ఉన్నారు.ఇలా జరక్కుండా ఉండాలంటే,మీ అనారోగ్యాన్ని మీరే తెలుసుకోవాలనుకుంటే స్పూన్ తో ఈ రకంగా చేస్తే మీ శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చు.ఆ స్పూన్ టెస్ట్ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం....

    మీ ఒంట్లోని అనారోగ్యాల్ని తెలుసుకోవాలంటే మీరు ఉదయాన్నే నిద్రలేచి,కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా, ఒక స్పూన్ తీసుకుని, దానితో నాలుకపై రుద్దాలి. ఇలా స్పూనుతో రుద్దినట్లైతే  నాలుకమీద ఉండే లాలాజలం ఆ స్పూనుకి  అంటుకుంటుంది. తర్వాత ఆ స్పూన్‌ను తీసుకొని,దాన్ని నాలుకపై అంటించిన భాగాన్ని తాకకుండా  ఒక  ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి,కొద్దిసేపు అంటే నిమిషంపాటు  ఎండలో పెట్టాలి. నిమిషం పూర్తి అయిన తర్వాత కవరులోని స్పూన్‌ ను నాలుకపై అంటించిన భాగం తాకకుండా బయటకు తీయాలి. ఆ చెంచాలో ఎలాంటి మచ్చలు లేనట్లైతే మీ అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా  ఉన్నట్లే లెక్క.అలా కాకుండా ఆ స్పూనుపై    కొన్ని రకాల  రంగుల మచ్చలు ఏర్పడినట్లైతే, అలా ఏర్పడిన రంగునిబట్టి మీకు ఒక్కో అనారోగ్య సమస్య ఉన్నట్టు అర్థంచేసుకోవాలి.దీన్నే స్పూన్ టెస్ట్ అనిపిలుస్తారు.ఇప్పుడు స్పూన్ పై ఏ రంగు ఏర్పడితే ఏ అనారోగ్య సమస్య ఉన్నట్టో తెలుసుకుందాం....

   మీరు స్పూనుని  ఎండలో పెట్టి తీసిన తర్వాత ఆ స్పూన్ పై ఏవైనా మచ్చలు ఏర్పడితే మీకు ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు భావించాలి. అది నిజమోకాదో తెలుసుకోవడానికి ఆ స్పూన్ ని ముక్కు దగ్గరపెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఆ స్పూన్  వాసన  భరించలేనట్టుగా ఉంటే మీకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ఉన్నట్టుగా అర్థంచేసుకోవాలి. ఒకవేళ ఈ చెంచా నుంచి అమ్మోనియా వాసన గనుక వచ్చినట్లైతే మూత్రపిండాల్లో సమస్య ఉన్నట్టుగా భావించాలి.  అదే స్పూన్ గనుక  పండ్ల వాసన వస్తున్నట్లైతే,మీకు  చక్కెర వ్యాధి అంటే డయాబెటిస్ ఉన్నట్టుగా అర్థంచేసుకోవాలి. ఎందుకంటే  లాలజలంలోని కీటోన్లు తియ్యటి వాసన వచ్చేలా చేస్తాయి.అప్పుడు మీరు డయాబెట్స్ ఉన్నట్టుగా నిర్థారించుకోవాలి.

    స్పూనుకి తెల్ల మచ్చలు ఉంటే మీకు శ్వాసకోశ వ్యాధులు ఉన్నట్టు లెక్క.. అంతేకాదు,ఈ తెల్ల మచ్చలు ఏర్పడితే అది మీ   శరీరానికి   అనేక అంటు వ్యాధులు వచ్చే అవాకాశం ఉన్నట్టుగా అర్థంచేసుకోవాలి.ఎందుకంటే మీశరీరంలోని  వైరస్‌ లు మీకు అంటువ్యాధుల్ని కలగజేసే అవకాశం ఉంది.

      చెంచాపై మచ్చలు ఊదా రంగులో ఉంటే మీశరీరంలో తక్కువ రక్త ప్రసరణ జరుగుతూ మీరు  బ్రాంకైటీస్ వ్యాధి అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నట్టుగా  భావించాలి.ఎందుకంటే బ్రాంకైటీస్ వల్ల ఆక్సిజన్ ప్రసరణ సరిగ్గా జరగక తద్వారా శ్వాసకోశ సంబంధితవ్యాధులు సంభవిస్తాయి... అంతేకాదు ఈ  ఊదా రంగు మచ్చలవల్ల   మీకు కొవ్వు అధిక పరిమాణంలో ఉన్నట్లుగా అర్థంచేసుకోవాలి.       

     స్పూనుపై పసుపు మచ్చలు ఏర్పడితే అది థైరాయిడ్‌కు సూచన. థైరాయిడ్ సమస్య ఉంటే ఈ మచ్చలు మందంగా ఏర్పడతాయి. ఎందుకంటే బీటా కెరోటిన్,  విటమిన్ ఎ గా మారడం అనేది థైరాయిడ్ గ్రంథిపైనే  ఆధారపడి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంధి సక్రమంగా లేనప్పుడే అలా స్పూనుపై  పసుపుపచ్చ రంగులో మందమైన మచ్చలు ఏర్పడతాయి.

చెంచాపై  నారింజ రంగులో మచ్చలు ఏర్పడితే మీరు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నట్టు అర్థంచేసుకోవాలి. దీర్ఘకాలికమైన ఈ కిడ్నీ వ్యాధి నోటి కణజాలాల వల్లే  కలుగుతుంది. ఇది క్రమేపీ రక్తహీనతకు దారితీస్తుంది.

ఈ స్పూన్ టెస్ట్ తో హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరంలేకుండా మీకు ఉన్న అనారోగ్య సమస్య ఏమిటో తెలుసుకొని, వ్యాధిని బట్టి ట్రీట్ మెంట్ చేయించుకుంటే మీరు పదికాలాలపాటు ఆనందంగా జీవించవచ్చు.కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పిన విధంగా మీ ఇంటి దగ్గరే స్పూన్ టెస్ట్ చేసుకొని వ్యాధులని గుర్తించి వాటి పట్ల అప్రమత్తంగా మెలగండి..

Comments