హెల్మెట్ పెట్టుకోని వీరులకు చేదువార్త - ఆగస్ట్1 డెడ్ లైన్

     ఆగస్ట్ 1 నుండి హెల్మెట్ పట్టుకోకుండా బయటకు వస్తే మీకు సేక్యురుటిగా ఓ కానిస్టేబుల్..!

      మన యూత్ మాత్రం ఇంగ్లీష్ భాషలో మాకు నచ్చని పదం “హెల్మెట్” అని సరదాగా పంచులు వేసుకుంటున్నారు. వచ్చేనెల నుండి ఈరోజు మీవెంటా ఒక కానిస్టేబుల్ ని తోడుగా ఉండనున్నాడు.. ఆ కానిస్టేబుల్ ఎవరు అతడు చేసే పని ఏంటో తెలుసా ?ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఎవరో తెలుసా ? మీ గోరంత సైజ్ లో ఉండే ఒక చిప్... అవును ఈమధ్య మన హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్స్ తో కలసి ఒక అద్బుతమైన ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు సైబరాబాద్ ట్రాపిక్ పోలీసులు.. నగరంలోని సీసీటీవీల్లో ఈ స్మార్ట్ చిప్ అటాచ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక రోబోలా పనిచేస్తుంది.

      మనం హెల్మెట్ పెట్టుకోకపోయినా, జిగ్ జాగ్ రైడింగ్ చేసినా, ఇతర పనికిమాలిన పనులు ఏం చేసినా వెంటనే గుర్తించి పోలీస్ కంట్రోల్ రూములకు, ఆర్టీఐ ఆఫీసులకు అలర్ట్ మెసేజీలు పంపుతుంది. దీంతో సదరు వీరులకు చలానాలు ఎస్సెమ్మెస్‌ల రూపంలో వచ్చేస్తాయి. అలాని ఆరోజులో ఒక్కసారే అనుకుంటే పొరపాటే నువ్వు ఎన్ని సిగ్నల్లు క్రాస్ చేస్తావో అన్ని సార్లు చెలాన్ పడుతుంది... అంటే ఒక్కరోజులోనే 100 నుండి వెయ్యి నుండి 5 వేలవరకూ ఫైన్ పడే అవకాశం ఉంది...పైనే కదా పడితే పడనిలే అని రెండు రోజులు లైట్ తీసుకుంటే మూడవరోజు నువ్వు ఒక సిగ్నల్ దగ్గర నుండి మరో సిగ్నల్ దగ్గరకు వెళ్తున్నావ్ అని ఇమ్పార్ మేషన్ రాగానే అక్కడే నిన్ను క్యాచ్ పట్టేస్తారు.. అదేగానక జరిగితే బడ్డి అక్కడే వదిలేసి అవసరమైతే నేరుగా జైలుకే వెళ్ళాల్సి ఉంటుందట..

       ఈ మెకానిజం అంతా ఆటోమేటిగ్గా పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న రీసెర్చ్ స్కార్ “దినేశ్ సింగ్” పూసగుచ్చినట్లు వివరించాడు... అంటే ఆగస్ట్ 1 నుండి ఏ తప్పు చేసినా రెండు రోజులే.. తరువాత మిమ్మల్ని దేవుడు కుడా కాపడలేడు కాబట్టి.. ఈరోజు నుండే రూల్స్ ఎలా పాటించాలో ప్రాక్టిస్ చేయండి.. అయినా ఇదంతా మన ప్రాణాల కోసమే కదా భయ్యా ఒక్కసారి ఆలోచించండి... కిక్ ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది.. ప్రాణం పోతే రాదుకదా ? చివరిగా ఒక్కమాట.. మన ప్రాణాలు కేవలం మన సొంతం కాదు.. అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, పిల్లలు ఇలా అందరి సొంతం.. కాబట్టి డ్రైవింగ్ లో రిస్క్ తీసుకోకండి..    

Comments