రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా.? | Shocking Facts about Cooked Rice in Electric Cooker

  మీరు కుక్కర్ లొ వండిన అన్నం తింటున్నారా...? 

  నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకొనే తీరిక కూడా లేనివారు ఎక్కడ చూసినా ఎక్కువమందే కనిపిస్తూ ఉంటారు. అలాంటివారు బియ్యం కడిగి స్టవ్ పై పెట్టుకొనే అవసరంలేకుండా ఆ బియ్యాన్ని కుక్కర్లో వండడానికే ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉన్నారు.   ఎక్కువశాతం మంది  రైస్ కుక్కర్లో రైస్ ఒకసారి కడిగి పెట్టేస్తే, కర్రీ పాయింట్ నుండి కర్రీ తెచ్చేసుకొని తింటే పని అయిపోతుంది అనుకొంటూ,ఆ పద్ధతినే ఫాలో అవుతూ ఉన్నారు. అదే  వీకెండ్స్ లో అయితే ఫ్యామిలి ఫ్యామిలి మొత్తం ఏ రెస్టారెంట్లోనో వాలి పోతుంటారు..   రైస్ కుక్కర్ లో వండిన భోజనం మంచిది కాదని తెలిసినా, చాలామంది దానికే మొగ్గు చూపుతున్నారు.. అలా ఎక్కువరోజులపాటు  రైస్ కుక్కర్  లేదా ఎలక్ట్రిక్  కుక్కర్  లో వండిన భోజనాన్ని తినడంవల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయో తెలుసుకుందాం....

   రైస్ కుక్కర్లలో లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నం  వండటం వలన ఆ ఆహారం విషంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.దానికి కారణం ఏమిటంటే,రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లన్నీ అల్యూమినియం కుక్కర్లే ఉంటాయి.ఆ పాత్రల్లో భోజనం వండటం మరియు ఆహారాన్ని  నిలవచేయడం ఎంతమాత్రం  శ్రేయస్కరం కాదని వారు చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, సాధారణంగా ఆహారాన్ని  వండేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. అలా  సూర్య రశ్మి, గాలి తగలని ఆహారము విషంతో సమానం. ఈ విషం రెండు రకాలుగా ఉంటుంది.

   ఇందులో ఒకటి తక్షణమే పని చేస్తుంది. దానినే ఫుడ్ పాయిజన్ అంటాం. రెండవది శరీరంలో ఉండిపోయి మెల్లమెల్లగా కొన్ని నెలలకు, లేదా కొన్ని సంవత్సరాలకు దాని ప్రభావాన్ని  చూపుతుంది. ప్రెషర్ కుక్కర్ లో లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఆహారం వండేటప్పుడు దానిలోకి ఏ మాత్రము గాలి వెళ్లే అవకాశంగానీ  సూర్య రశ్మి తగిలే అవకాశంగానీ ఉండదు.అందువల్ల ఆ ఆహారం  పూర్తిగా విషతుల్యం అయిపోతుంది. మరొక   ప్రమాదమేమిటంటే    కుక్కర్ లని  అల్యూమినియంతో తయారుచేస్తారు. ఇది మరింత ప్రమాదకరము.ఈ అల్యూ మినియం  వాడకము బ్రిటీష్ కాలంలో ప్రవేశపెట్టబడింది. 

     ఆ రోజుల్లో జైళ్లలో ఖైదీలుగా ఉన్న భారతీయ ఉద్యమకారులను నిర్వీర్యం చేయటానికి ఈ అల్యూ మినియం పాత్రల్ని  మనదేశానికి తీసుకొచ్చి,ఈ పాత్ర లలో  అన్నం వండి   ఖైదీలకు పెట్టేవారు. దాంతో ఆ ఖైదీల్లో  నిస్సత్తువ అలుముకొని,వారు నిర్వీర్యులైపోయేవారు. దీన్ని బట్టి  మనం ఎంత ప్రమాదకరమైన విషపాత్రలలో తింటున్నామో అర్థంచేసుకోవచ్చు.   మరో విషయం ఏమిటంటే ,'ప్రెషర్' అంటే ఒత్తిడి అని అర్థం. మనము 'ప్రెషర్ కుక్కర్' లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది.  కానీ ఆ ఆహారం ఉడకదు. నిజానికి పదార్ధం ఉడకటం వేరు, మెత్తబడటం వేరు.  వరి పంట పండటానికి కనీసం 5,6 నెలలు పడుతుంది. అన్ని పోషకాలు వరి మొక్కలోకి చేరి క్రమంగా ధాన్యం పంట పండుతుంది.

    వరి గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే ఆ పదార్ధం వండబడాలి.అప్పుడే అది మనశరీరానికి మంచి శక్తినిస్తుంది.అదే  మెత్తబడితే దానివల్ల పోషకాలు అందడం అటుంచి,ఆ ఆహారం తినడంవల్ల అనర్థాలే ఎక్కువగా ఉంటాయి. నిజానికి చాలాకాలం క్రితమే భోజనం వండటానికి యోగ్యమైన పాత్రలగురించీ,ఏ పాత్రల్లో వండితే ఎలాంటి   పోషకాలు శరీరానికి అందుతాయి అనే విషయమై  మన రుషులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది.సాధారణంగా వంటకి  మట్టి కుండ వాడితే పోషక విలువలు 100శాతం అలాగే ఉంటాయి. ఇక కంచు పాత్రలో వంట వండితే, 97 శాతం పోషకాలు ఉంటాయి. ఇక  ఇత్తడి పాత్రలలో వంట చేస్తే 93 శాతం ఉంటాయి..

   అదే సమయంలో  అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ లో వండితే కేవలం 7 నుంచి 13 శాతమే పోషకాలు ఉండి,అవి తక్కువశాతంలో మన శరీరానికి అందుతాయని  తాజాగా  జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇంకా ఈ  అల్యూమినియం పాత్రల్లో  వండిన  ఆహారం తినటంవల్ల మధుమేహం, కీళ్ళవాతం, అకాల వృద్ధాప్యం, ఉదర సంబంధితవ్యాధులు,గ్యాస్ స్టిక్ సమస్యలు,నడుమునొప్పి,గుండె సంబంధిత వ్యాధులు,స్థూలకాయం వంటి అనేక  వ్యాధులు సంభవిస్తాయని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు.కాబట్టి సాధ్యమైనంతవరకూ కుక్కర్ లో గానీ ఎలక్ట్రిక్ కుక్కర్ లోగానీ వండిన ఆహారాన్ని తినడం పూర్తిగా మానివేసి, మట్తిపాత్రల్లోగానీ,కంచు, ఇత్తడిపాత్రల్లోగానీ వండుకొని తింటే అనారోగ్య సమస్యల్ని దూరంగా తరిమికొట్టొచ్చని ఆ నిపుణులు చెబుతున్నారు.కాబట్తి ఇకనుంచైనా కుక్కర్ లో వండడాన్ని పూర్తిగా మానెయ్యండి.  

Comments