వండిన క్యాబేజీలోపల పాముఉందని తెలియక తినేసిన కుటుంబం|

 వండిన క్యాబేజీలోపల పాముఉందని తెలియక తినేసిన కుటుంబం|

  ఇటీవల రైల్ లో ప్రయాణికుడికి బిర్యానీ ప్యాకెట్ లో బల్లి వున్న ప్యాకెట్ ని అందజేసిన వైనం మనకు తెలిసిందే ..అయితే బయట హోటల్స్ లో తింటూ వున్నప్పుడు అందులో బొద్దింక ,బల్లి ,ఈగ లాంటివి అందులో రావడం మనం వినే ఉంటాం ..ఇవి వచ్చిన వంటలు తిన్న వారికి కొంచం అస్వస్తత జరిగినా ,ప్రాణానికి ముప్పు ఉండదు ..ఇలాంటి ఘటనలు మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది ..కానీ ఈ సారి వచ్చింది అవేమి కావు ..ఒక ఇంట్లో వండిన క్యాబేజి వంటకం లో పాము పిల్ల వచ్చింది ..అయితే ఆ వంటకాన్ని వారు అప్పటికే తినేశారు ..

  ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతుళ్లు ఇద్దరు వాంతులు చేసుకున్నారు ..పాము కలిసిన క్యాబేజీ కూరను తిన్న తల్లీ కూతుళ్లు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఇండోర్లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన అఫ్జాన్ ఇమామ్ (36) రాత్రి క్యాబేజీ కూర వండింది. అనంతరం కుమార్తె ఆమ్నా (15)తో కలిసి భోజనం చేసింది. ఆ కూర తిన్న కాసేపటికే వికారంగా అనిపించింది. ఆ వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన ఇమామ్ వెంటనే కూరను పరిశీలించగా అందులో పాము ముక్కలు కనిపించాయి. దీంతో ఇద్దరూ బెంబేలెత్తిపోయారు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత తల్లీకూతుళ్లు పలుమార్లు వాంతులు చేసుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. మరో రెండు రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నట్టు తెలిపారు.

 రెండు రోజుల అబ్జర్వేషన్ అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వారి శరీర కణజాలానికి ఎలాంటి హాని జరిగిందో గుర్తించాలని వారు తెలిపారు. క్యాబేజీ కూరలో పాము పొరబాటున పడి ఉడికిపోయి ఉంటుందని భావిస్తున్నారు. డాక్టర్ లు ఆమెను ప్రశ్నించగా ..గురువారం రోజున ఆమె మార్కెట్ నుంచి క్యాబేజి ,కాళీ ఫ్లవర్ ను తీసుకు వచ్చింది ..ఆ రోజు కాళీ ఫ్లవర్ ను వండింది ..అయితే ఆమెకు తెలియని విషయం ఏమిటంటే అందులో కనబడకుండా పాము పిల్ల దాగి వుంది ..అయితే అది చూసుకొని ఆమె అందులో వున్న పాము పిల్లను కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసింది ..శుబ్రా పరుద్దాము అనే ఆలోచన కూడా లేకుండా అలాగే వండేసింది .అయితే తినడానికి కూర్చున్న వారు మధ్యలో ఆ పాము యొక్క శరీరాన్ని గమనించారు ..అప్పటికే ఆ పాము లో వుండే విషం మొత్తం వాళ్ళ ఇద్దరి శరీరం లోకి ఎక్కేసింది అట ,దాంతో వారికి వాంతులు అయ్యి కళ్ళు తిరగడం లాంటివి అయ్యాయి ..అయితే వారిని పరీక్షించిన డాక్టర్ లు వారు తిన్నది పాము పిల్ల కావడం వలన అందులో తక్కువ శాతం విషం ఉండడం వలన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ..కాకపోతే ఆ విషం వారి శరీరం లోకి పూర్తిగా ఎక్కేసింది ..వారి శరీరాన్ని క్లీన్ చేసిన వైద్యులు వారి ప్రాణాలను కాపాడారు ..చూసారుగా మార్కెట్ నుంచి తెచ్చినా ఎలాంటి వస్తువు నైనా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు ..
 

Comments