పిల్లాడితో ఆడుకుంటున్నది బొమ్మ అనుకున్నారు.. CCTVలో చూసి వణికిపోయారు || Real Story In England

  బొమ్మ అనుకున్నారు..కానీ సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యం చూసి ఒణికిపోయారు...

 నిజానికది బొమ్మ...కానీ ఆ పిల్లాడు ఎక్కడ పడుకుంటే క్షణాల్లో అక్కడ  వాలిపోతుంది.దగ్గరికెళ్లి చూస్తే బొమ్మగానే కనిపిస్తుంది..సీసీ ఫుటేజ్ లో చూస్తే మాత్రం వెన్నులో ఒణుకుపుడుతుంది.అది బొమ్మ కాదు దెయ్యం.. అది తెలుసుకున్న ఆ పిల్లాడి తల్లిదండ్రులు భయంతో ఒణికిపోయారు. ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంగా మారి ఆ కుర్రాడి దగ్గరికే ఎందుకు వెళ్తుందో,అతను పడుకున్నప్పుడు అతన్నే ఎందుకు అంటిపెట్తుకొని ఉంటుందో,అది బొమ్మకాదు దెయ్యం అని తెలిసిన ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసుకుందాం....  

ఇంగ్లాండులోని దేవాన్ లో నివశిస్తోన్న లారా హేక్ మరియు డీనెవాన్స్ అనే దంపతులకి నలుగురు పిల్లలు.వారిలో ఆఖరి పిల్లవాడికి 18 నెలలు ఉంటాయి.ఆ పిల్లవాడిని అతని తల్లి అయిన లారాహేక్ ,ఒక్కోసారి మంచంపైనా,ఒక్కోసారి ఉయ్యాలలోనూ పదుకొబెట్టేది.ఆమె వంటింట్లో పనిచేసుకొనేటప్పుడు ఊయల్లో పడుకోబెట్టేది.అలా పడుకోబెట్టినతర్వాత అతను ఏంచేస్తున్నాడో చూసుకొనే ఉద్ధేశ్యంతో ఆ ఉయ్యాల ఉన్న గదిలోనూ, మంచం ఉన్న గదిలోనూ ,  సీసీ కెమేరాని అమర్చి, ఆ ఫుటేజ్ ని చూడడం కోసం వంటగదిలో ఒక మానిటర్ ని  అమర్చారు.ఆ 18నెలల పిల్లాడు నిద్రిస్తున్నప్పుడు ఎక్కడనుంచి వచ్చేదో తెలియదుగానీ అతని పక్కనే ఒక టెడ్డీబేర్  బొమ్మ ఆ పిల్లాడిని అంటిపెట్టుకొని ఉండేది.నిజానికి ఆ బొమ్మని అతనికోసమే కొని తెచ్చారు.కానీ అతను నిద్రపోతున్నప్పుడు అతనికి గుచ్చుకుంటుందేమోననే ఉద్ధేశ్యంతో దాన్ని లారా కప్ బోర్డులో ఉంచేది. అతను మంచము మీద పడుకున్నా, ఉయ్యాల్లో పడుకున్నా,అలాగే చేసేది. కానీ అతను నిద్రిస్తున్నప్పుడు  ఎలా వెళ్లేదో తెలియదు గానీ  ఆ బొమ్మని ఎవరూ తీసుకెళ్లి పెట్తకుండా దానంతట అదే ఆ పిల్లాడి దగ్గరకివెళ్లి అతన్నే అంటిపెట్టుకొని   ఉంటూ ఉండేది.ఇలా చాలా సార్లు ఆకుర్రాడి,దగ్గర ఆ బొమ్మ ఉండడం,దాన్ని తెచ్చి,లారా కప్ బోర్డులో పెట్టడం,ఆ బొమ్మ షరా మామూలుగానే  

  ఆ కుర్రాడు దగ్గరికి వెళ్లిపోతుండడం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.అయితే ఒకరోజు వంటగదిలో వంటచేసుకుంటూ ఉన్న లారా,సీసీటీవీ మానిటర్ లో కనిపించిన  దృశ్యం చూసి,షాక్ కి గురి అయ్యింది.ప్రతి సారీ ఆ కుర్రాడి దగ్గర బొమ్మ ఉండేది.కానీ ఈ సారి ఆ బొమ్మకి బదులుగా అతని దగ్గర ఒక వింత ఆకారం అంటే దెయ్యంలాంటి ఆకారం ఉండడంతో ఉలిక్కిపడి, బిగ్గర్గా కేకలువేస్తూ ఆ కుర్రాడిదగ్గరికి పరుగెత్తికెళ్లిందిలారా.వెళ్లి చూస్తే ఆ కుర్రాడి దగ్గర ఒక బొమ్మ ఉంది.కానీ తనకళ్లని తానే నమ్మలేక పోయింది.యిది ఎలా జరిగింది.వంటగది మానిటర్ నుంచి చూస్తే,దెయ్యంలా కనిపించింది.ఇక్కడికొచ్చి చూస్తే,బొమ్మ,ఒక్కసారిగా  ఏంజరుగుతుందో లారాకి అర్థంకాలేదు.వెంటనే తన భర్తకి ఫోన్ చేసి అర్జ్జంటుగా రమ్మని చెప్పింది.దాంతో అతను ఆఫీసునుంచి  హుటాహుటీన యింటికొచ్చేశాడు. జరిగిన విషయం అతనికి చెప్పగా అతను కూడా షాక్ అయ్యాడు.వెంటనే అతను వంటగదిలోకి వెళ్లి చూసి,అతను కూడా షాక్ కి గురి అయ్యాడుకారణం అతనికి కూడా ఆ పిల్లాడి  పక్కనున్నది బొమ్మలా కాకుండా దెయ్యంలా కనిపించడంతో అతనికి వెన్నులో ఒణుకుమొదలైంది. దాంతో వారిద్దరూ సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాల్ని చూడాలనుకొని ఫుటేజ్ ని పరిశీలించగా, దానిలో కూడా దెయ్యం ఉన్న దృశ్యమే రికార్డు అయి ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

  ఆ బొమ్మని ఆ పిల్లాడు  నిద్రపోతున్నప్పుడు తానూ కప్ బోర్డులో పెట్తినా,అది ఆ పిల్లాడి దగ్గరికి ప్రతిరోజూ వెళ్తున్న విషయాన్ని కూడా అప్పుడే  లారా తన భర్తకి చెప్పడంతో డీనెవాన్స్ కి  దిమ్మదిరిగిపోయింది. ఆ భార్యాభర్తలకి ఏంచేయాలో అర్థంకాలేదు.వెంటనె ఈ విషయాన్ని లారా,తన అక్కకి వీడియో కాలింగ్  చేసి,ఆ విషయాన్ని చెప్పి,సీసీటీవీలో మానిటర్ లో ఉన్న ఫుటేజ్ నీ,ఉయ్యాల్లో ఉన్న టెడ్డీబేర్ బొమ్మనీ చూపించగా,ఆమెకి ఆ వీడియోలో ఏమీకనిపించలేదు.అదే విషయాన్ని ఆమె లారాకి చెప్పగా ఆమె ఖంగుతింది. తమకే ఎందుకు ఆ బొమ్మ ఉయ్యాల్లో ఉన్నప్పుడు బొమ్మగానూ,సీసీటీవీ మానిటర్ లో దెయ్యంగానూ ఎందుకు రెండువిధాలుగా కనిపిస్తుందో అర్థంకాక ఆ దంపతులు తలలు పట్తుకొని కూర్చున్నారు.నిజానికి అది దెయ్యమో,టెడ్దీబేర్ బొమ్మో తేల్చుకోలెక సతమతమవుతుండగా,సరిగ్గా అదే సమయంలో అతని పక్కింటి ఫిలిప్పు వచ్చాడు.

  అతను ఆఫీసులో డీనెవాన్స్ కి కొలీగ్ మరియు,స్నేహితుడు.ఆ యింటికొచ్చిన అతను,తన స్నేహితుడు మరియు అతని భార్యా విచారంగా ఉండడాన్ని గమనించి, కారణమడిగాడు.దాంతో ఆ దంపతులు ఇంట్లో జరుగుతున్న భయానక సంఘటనల్ని అతనికి చెప్పారు. అతనికి కూడా ఉయ్యాల ఉన్నగదినీ, వంటగదిలోని సీసీటీవీ మానిటర్ నీ చూపించగా ఆ రెండుచోట్లా ఆ బొమ్మ ఒకచోట బొమ్మగానూ,మరోచొట దెయ్యంగానూ కనిపించడం చూసి,షాక్  కి గురి అయ్యాడు.దాంతో లారా దంపతులకంటే ముందు ఆ యింటిలో నివశించి హఠాత్తుగా ఖాళీ చేసి వెళ్లిపోయిన జేంస్ కి ఫోన్ చేశాడు ఫిలిప్. అతను అలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి కారణమడగ్గా అతను చెప్పిన విషయాలు విని ఫిలిప్పు భయంతో ఒణికిపోయాడు.ఇంతకీ అతను ఏంచేప్పాడంటే, జేంస్ దంపతులకంటే ముందు ఆ యింట్లో ఒక ఫ్యామిలీ నివశిస్తూ ఉండేది.

  ఆ దంపతులకి రెండేళ్ల పిల్లవాడు ఉండేవాడు.అతను ఒకసారి ఆటలు ఆడుతూ ప్రమాదవశాత్తూ మెట్లపైనుండి పడిపోయి చనిపోయాడు.ఆ పిల్లాడు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆ  యిల్లు  ఖాళీచేసి వెళ్లిపోయారు. తర్వాత మేము  ఆ యింట్లోకి వచ్చాము. చనిపోయిన ఆ కుర్రాడికి టెడ్డీపేర్ అంటే చాలా యిష్టం. అందుకే అతని ఆత్మ ఆ టెడ్డీబేర్ లో ప్రవేశించింది.మాకు కూడా రెండేళ్ల పిల్లాడు  ఉన్నాడు. అతని దగ్గరికి ఆ యింట్లో ఉన్న టెడ్డీబేర్ నడచుకుంటూ రావడం,అతన్ని కౌగిలించుకొని పడుకోవడం వంటి పనులుచేసేది.ఒకసారి అలా టెడ్డీబేర్ నడచుకుంటూ రావడం చూసిన మా అబ్బాయి భయంతో కేకలుపెట్టాడు.దాంతో ఆ టెడ్దీ బేర్ అక్కడ్నుంచి మాయం అయిపోయింది. అతని దగ్గరికెళ్లి కేకలువెయ్యడానికి కారణం అడగ్గా వచ్చీరాని మాటలతో అతను చెప్పిన విషయాన్ని విని షాక్ కి గురి అయ్యాం..నా దగ్గరికి ప్రతిరోజూ ఓక టెడ్డీబేర్ నడచుకొంటూ వచ్చేదనీ,నాతో ఆటలాడేదనీ,కాని ఆ రోజు టెడ్డీబేర్ కాస్తా ఏదో భయంకర ఆకారంగా  మారిపోయిమడని చెప్పాడు.అందుకే ఆ ఆకారాన్ని    చూసిన ఆ కుర్రాడు  భయంతో కేకలువేశాడు.అది జరిగిన వెంటనే ఆ యింట్లో ఏదో శక్తి ఉన్నట్టుగా   భావించి,తాము ఖాళీచేసి వచ్చేశామనీ జేంస్  ఫోనులో చెప్పాడు.అసలు విషయం తెలుసుకున్న లారా దంపతులు కూడా ఆ యింటిని ఖాళీచేసి,అక్కడ్నుంచి వేరేచోటుకి వెళ్లిపోయారు.

Comments