బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాప్ హీరోయిన్| Tollywood Star Heroine Entry Into Bigg Boss Telugu 2

  బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాప్ హీరోయిన్|

  కుమారి 21 ఎఫ్ తో తెలుగు యువతరం మనసు దోచిన నటి హెబా పటేల్. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఒక్కసారిగా వరుస కట్టిన అవకాశాలని అందిపుచ్చుకొని ఈ అమ్మడు నిఖిల్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ్ లతో వరుస సినిమాలు చేసి హడావిడి చేసింది. అయితే కుమారి తర్వాత ఓ మూడు సినిమాలు వరకు ఈ అమ్మడు అందానికి, గ్లామర్ కి ఒకే చెప్పిన ఆడియన్స్, దర్శకులు తరువాత కనెక్ట్ కాలేకపోయారు. కుమారి 21 ఎఫ్ ప్రభావం హెబా మీద విపరీతంగా పడటంతో ఆ పాత్ర స్వభావం నుంచి బయటకి రాలేకపోయింది. దాంతో ఆమె నటన కూడా అందరికి బోర్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అయోధ్య కుమార్ దర్శకత్వంలో వస్తున్న 24 కిస్సెస్ సినిమా మాత్రమే ఉంది.

  ఈ సినిమా కూడా ఎంత వరకు హెబాకి మరల పూర్వపు ఫామ్ అందిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ బోల్డ్ బ్యూటీ గురించి ఇండస్ట్రీలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 నడుస్తుంది. ఇందులో పార్టిసిపెంట్స్ అందరూ వారి సామర్ధ్యం మేరకు మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత సీజన్ తో పోల్చుకుంటే ప్రస్తుతం బిగ్ బాస్ లోయెస్ట్ రేటింగ్స్ తో నడుస్తున్నట్లు తెలుస్తుంది. షోలో ఎంటర్టైన్మెంట్ మిస్ కావడంతో పాటు, అంతకు మించి అంటూ మొదటి నుంచి చెబుతున్న విధంగా గ్లామర్ హడావిడి పెద్దగా లేకపోవడంతో షో మీద ఆడియన్స్ ఆసక్తి తగ్గిపోతుంది అనే చెప్పాలి. దీంతో బిగ్ బాస్ సీజన్ ని ఎలా అయినా గట్టిగా నిలబెట్టాలని ప్రయత్నంలో ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించిన నిర్వాహకులు హెబా పటేల్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది.

  ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆమెకి భారీ మొత్తంలో ఆఫర్ కూడా చేసినట్లు తెలుస్తుంది. ఆమెని హౌస్ లోకి పంపిస్తే కాస్తా గ్లామర్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీపై ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటా అని హెబా కాస్తా టైం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడం, భారీ అమౌంట్ ఆఫర్ చేయడంతో ఆమె కూడా రెడీగానే ఉన్న, కొంత టైం తీసుకొని చెబితే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరి అన్ని అనుకూలిస్తే త్వరలో వైల్డ్ ఎంట్రీగా హెబా పటేల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇవి ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
 

Comments