ఎవరిని వదలకుండా అందరి మీద పంచులు వెస్తున హైపర్ అది Jabardasth HYPER AADI Powerful Punches | Hyper Aadi Live | Jabardasth Latest Promo | Telugu World

 ఎవరిని వదలకుండా అందరి మీద పంచులు వెస్తున హైపర్ అది 

 పంచ్ లు అనే పదానికి పర్యాయ పదంగా నిలుస్తున్నాడు హైపర్ ఆది. కరెంట్ అఫైర్స్ తీసుకుని కరెంటు పుట్టించే జోకులు పేలుస్తుంటాడు. మరీ ముఖ్యంగా తనకు, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ కు, తమ షో జడ్జి నాగబాబుకి అంటే గిట్టని వారిని ఏదో ఒక సెటైర్ లో దారుణంగా ఇరికించేస్తుంటాడు హైపర్ ఆది. సాధారణంగానే జబర్దస్త్ అంటే ఎన్నో వివాదాలు, విమర్శలు ఉండగా… ఇప్పుడు కొత్తగా ఈ ఆది తెచ్చిపెట్టే వివాదాలు మరీ శృతిమించి ఉంటున్నాయి. ఏది ఏమయినా తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రజాదరణ మరే ఇతర వినోదాత్మక కార్యక్రమానికి లేదంటే అతిశయోక్తి కాదు. అటువంటి షోలో ఇంకా ఎక్కువ ఆదరణ పొందిన హైపర్ ఆది డైలాగులో ఓ చిన్న మాట ఉచ్చరించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అది పుట్టించే మంట అంతా ఇంతా కాదు.తాజాగా ప్రసారం అయిన జబర్దస్త్ షోలో ఇది కాస్త స్పష్టంగా కన్పించింది.

  ఈ కార్యక్రమంలో హైపర్ ఆది స్కిట్లో రైజింగ్ రాజు.. ఓ సందర్భంలో సైకిల్ ను తన్ని, శివ సినిమాలో నాగార్జునలా సైకిల్ చైన్ లాగాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆది అందుకుని ‘ఒరే ఒరే.. ఇప్పుడెందుకు రా అదంతా.. ప్రస్తుతం ఆ సైకిల్ పరిస్థితి బాగా లేదు.. ఆ చైన్ తో సినిమా తీసిన డైరెక్టర్ పరిస్థితీ బాగా లేదు.’ అని అంటాడు. ఇంతలో ఇంకొక కంటెస్టెంట్ అందుకొని ఆయన ఇంక మారరా? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో ఆది ఫ్యాన్స్ కి ఎంత కోపం వచ్చి. ఒంటినిండా గాయాలు చేసినా.. దానిని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని గాయం 3 సినిమా తీస్తారు తప్ప.. ఎలాంటి మార్పు రాదు.. అంటూ సెటైర్ పేల్చారు.ఈ రెండు సెటైర్లతో ఏపీలో సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని, ఇటు ఎంత తిట్టినా పౌరుషం లేదంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒకేసారి కౌంటర్ వేసినట్లైంది. దీంతో జడ్జిలుగా ఉన్న రోజా, నాగేంద్రబాబు పడిపడి నువ్వుకోవడం కామన్ గానే జరిగిపోయింది. ఇప్పుడే కాదు.. గతంలో హీరో శివాజీ ఆపరేషన్ గరుడ గురించి వివరించిన క్రమంలో.. ఆది స్కిట్ లో ఈ ఘటనను చొప్పించి.. ఆ పిట్ట కథ ఇప్పుడెందుకులే అంటూ.. ఆపరేషన్ గరుడను.. పిట్ట కథతో కొట్టి పడేసారు. అలాగే క్రిటిక్ కత్తి మహేష్, నటి శ్రీరెడ్డిని కూడా హైపర్ ఆది వదల్లేదు. వాళ్లను తన పంచ్ లతో ఒక ఆట ఆడేసుకున్నాడు. ఇది గతంలో వివాదాస్పదమై.. గంటల కొద్ది న్యూస్ ఛానల్స్ డిబేట్లకు దారితీసిన సంగతి తెలిసిందే.

Comments