అంబానీ నిక్ నేమ్ ఏంటో తెలిస్తే నవ్వుకోవడం పక్కా | Unknown Facts Mukesh Ambani lifestyle And Nickname

ముకేష్ అంబానీ ముద్దుపేరు “నిక్ నేమ్” ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.

   ప్రపంచ ధనవంతుల్లో ఒకరైనా “ముకేష్ అంబానీ” పేరు తెలియని భారతీయుడు ఉండడేమో.. మనం అభిమానించే హీరోలు మనకు మాత్రమే హీరోలయితే.. ముకేష్ అంబానీ మాత్రం ఈ ప్రపంచానికే ఒక రియల్ హీరో.. ఎంతో మందికి రోల్ మోడల్.. వ్యాపారం చేయాలి అనుకునే ప్రతి “బిజినెస్ మెన్” అంబానీ స్థాయికి రావాలని కోరుకుంటాడు.. కానీ అతడు సాదించిన విజయాలను చేరుకోవడం అంత సులభం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటివరకు ఎన్నో విజయాలు అందుకున్న “ముకేష్ అంబానీ” ప్రపంచం చూపు తనవైపు తిప్పుకున్నాడు.. అలాంటి అంబానీ ఈమధ్య కేవలం రెండంటే రెండే రోజుల్లో స్టాక్ మార్కెట్ లో అద్బుతమైన ఫలితాలను చూపించి వరల్డ్ లో ఉన్న ప్రతి బిజినేస్ మెన్ కి చెమటలు పట్టించాడు.. అతడు సాదించిన ఈ ఘనత చూసి మహా మహా వ్యపారవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు.. అది చూసి మరోసారి భారతదేశం గర్విస్తుంది.. అంబానీ సంపాదించిన డబ్బులు వారి ఇంట్లోకి వెళ్లకపోయినా.. ప్రపంచ దేశాలకి “ఇండియా” సత్త ఏంటో చూపిస్తున్నాడు అంబానీ.. అందుకే ప్రతిఒక్కరు ముకేష్ కి అభినందనలు తెలుపుతున్నారు..

 అంబానీ సంపద కేవలం రెండు రోజుల్లోనే 9300 కోట్లు పెరిగింది.. దీంతో అతడి మొత్తం సంపదన విలువ 2.84 లక్షల కోట్లకు చేరింది. ఈ దెబ్బతో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నారు. ఈమద్య “బ్లూమ్ బర్గ్” అనే  సంస్థ తెలిపిన వివరాల ప్రకారం స్టాక్ మార్కెట్ లో వరుసగా రెండురోజులు రిలియన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ముఖేష్ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుత ముకేష్ సంపదను బట్టి చూస్తే.. చైనా రిటైల్ మార్కెట్ దిగ్గజం అలీబాబా  చైర్మన్ “జాక్ మా”తో సరిసమానంగా నిలిచి విదేశీ వ్యాపారస్తులకు చెమటలు పట్టించాడు.. అంబానీ సాదిస్తున్న విజయాలను.. ఆయన దూకుడు చూస్తుంటే రేపు ప్రపంచాన్నే షేక్ చేసేలా ఉన్నడే అంటూ కొందరు “బిజినెస్ మెన్” లు భయిరంగంగానే “స్టేట్ మేట్స్” ఇస్తున్నారు. ఇలా షేర్ మార్కెట్ ని షేక్ చేస్తున్న “అంబానీ” గురించి ఈమధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అందులో అతడి ఇష్టాలు, లైఫ్ స్టైల్ తో పాటు.. అతడి ముద్దుపేరు.. “నిక్ నేమ్” ఏంటో కుడా తెలిసిపోయింది.. దాంతో ఈమధ్య “ముకేష్ అంబానీ” ని ఎక్కువగా అభిమానించే చాలామంది నేటిజన్స్ అతడిని “సోషల్ మీడియా”లో అదే పేరుతో పిలుస్తున్నారు.. మరీ ముకేష్ “నిక్ నేమ్” ఏంటో తెలుసుకుందామా ?      

 ముందుగా “ముకేష్ అంబానీ” ఇష్టాల విషయానికి వస్తే.. స్పోర్ట్స్ లో క్రికెట్, హాకీ అంటే అంబానీకి చాలఇష్టం.. అందుకే ముంబై ఇండియన్స్ ఫ్రాంచేజీని కూడా తీసుకున్నారు. ఇక తన స్కూల్ డేస్ లో అయితే ముకేష్ అంబానికి హాకి అంటే అమితమైన ఆసక్తి ఉండేదట.. ఎంతలా అంటే హాకి ఆడడంకోసం తన చదువుకును కూడా నిర్లక్ష్యం చేశారట.. ఇక అంబానీకి ఇష్టమైన వెకేషన్ ప్లేస్ “దక్షిణ ఆఫ్రికా”... జంతువులంటే అతనికి చాలా ఇష్టం అందుకే దక్షిణాఫ్రికాలో "క్రుగర్ నేషనల్ పార్క్" వద్ద కుటుంబంతో సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు.

 ఈ పార్కు ఆఫ్రికాలోనే అతి పెద్ద పార్క్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాపర్టీ కూడా ముకేష్ అంబానీదే... “ఆంటిల్లా” అనే పేరుతో సౌత్ ముంబైలో ఇది ఉంది. ఇందులో దాదాపు 600 మంది పనివాళ్ళు పని చేస్తుంటారు. అంబానీకి కార్లంటే చాలా ఇష్టం. అంబానీ ఇప్పటివరకు దాదాపు 168 కార్లు కొన్నాడని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి. వీటిల్లో BMW 760LI ప్రధానమైనది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూప్ కార్. బాంబులతో పేల్చినా చెక్కు చెదరదు... దీనిని ప్రస్తుతం మన దేశ ప్రధాని “నరేంద్ర మోధీ” వాడుతున్నారు... కార్లంటే అమితమైన పిచ్చి ఉన్న అంబానీ రూ.25 కోట్లతో సొంతంగా “కస్టమైజ్డ్ వ్యాన్” నే తయారు చేయించుకున్నారు... అలాగే “Maybach 62 కార్ ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు కుడా మన ముకేశ్ అంబానీ గారే. ఈ కారును ఏకంగా 500 డాలర్లతో కొనుగోలు చేశాడు.

 ముకేష్ అంబానీ తన జీవితంలో ఒక్కసారి కూడా ఆల్కాహాల్ ను రుచి చూడలేదు... అదంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదట. ఇక తిండి విషయానికొస్తే ప్యూర్ వెజిటేరియన్... ఒక్కసారి కూడా మాంసాహారాన్ని ముట్టలేదట. అలాగే భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న “ముకేశ్ అంబానీ” మొదటిసారి తన భార్య అయిన నీతూ అంబానీ గారికి కార్ లో ప్రొపోజ్ చేశాడంట.. భార్య మీదున్న అమితమైన ప్రేమతో తన పుట్టిన రోజున 62,000,000 డాలర్లతో ఏకంగా “జెట్” ను కొనుగోలు చేసి భార్య కు గిఫ్ట్ గా ఇచ్చారు ముకేష్... అలాగే ఎవ్వరికీ తెలియని మరోవిషయం ఏంటంటే.. ఎప్పుడు బిజీబిజీ గా ఉండే “ముకేశ్ అంబానీ” కి సినిమాలంటే చాలా ఇష్టమట.. అందుకే వారంలో కనీసం 3 సినిమాలైనా కచ్చితంగా చూస్తారట.. ఎన్ని కోట్లు సంపాదించినా ముకేశ్ మాత్రం చాలా సింపుల్ లుక్ తో కనిపిస్తారు.

  నిజానికి దుస్తుల విషయంలో అతడు ఏ బ్రాండ్ ని ఫాలో అవ్వరు. ఎక్కువగా వైట్ షర్ట్... బ్లాక్ ప్యాంటులో కనిపిస్తూ ఉంటారు. అంబానీ గురించి ఎవ్వరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతడికి చిన్నప్పటి నుంచి “టీచర్” కావాలనే కోరిక బలంగా ఉండేదట... కాని తండ్రి ధీరుభాయ్ అంబానీ వారసుడిగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టాడు... ఇంతకీ ముకేష్ అంబానీ ముద్దుపేరు నిక్ నేమ్ ఏంటో తెలుసా ?"ముకు".... అవును చిన్నతనంలో తన స్నేహితులు కుడా ముకేష్ ని "ముకు" అనే పిలిచేవారట.. అది తెలుసుకున్న అతడి భార్య నీత అంబానీ కుడా “ముకేష్” ని "ముకు" అనే పిలుస్తుందట.. ముకేష్ అంబానీ నిక్ నేమ్ ఎంత పన్ని గా ఉందో కదా ? ఈన్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో అంబానీ టాపిక్ ఎక్కడా వచ్చినా.... అతడి అభిమానులు "ముకు సార్ మీ నిక్ నేమ్ సూపర్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 

 

 

 

Comments