Skip to main content

చిరంజీవి పెద్ద అల్లుడు ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ || Chiranjeevi Daughter in Law Family Back Ground

చిరంజీవి పెద్ద అల్లుడు విష్ణు ప్రసాద్ ఫ్యామిలి బ్యాగ్ రౌండ్.. ఎంత కుబేరుడో తెలుసా ?

  టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టిన చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అభిమానం.. వారిలో తెరపై అతడి హీరోయిజాన్ని చూసి అభిమానించేవాళ్ళు కొందరైతే ఎక్కువ మంది మాత్రం అతడి మంచి మనసు.. సేవా గుణం చూసి అభిమానిస్తారు.. అందుకు పెద్ద ఉదాహారనే అతడి స్థాపించిన “చిరంజీవి హై అండ్ బ్లడ్ బ్యాంగ్”... ఈసంస్థ ఇప్పటివరకు సరైన సమయానికి రక్తం అందించి ఎంతోమంది తమ ప్రాణాలు కాపాడడమే కాక.. ఇంకెంతో మందికి చూపును కుడా ఇచ్చింది.. అతడు ఒక్క మాట చెప్పగానే అతడి అభిమానులు ఎంతో మంది రక్తదానం, నేత్ర దానం చేసారు.. ఇప్పటికి చేస్తున్నారు..

  ఇది నిరంతరం యుగయుగాలు జరిగే ప్రక్రియ.. అంత మంచి పనికి పునాది వేసినా చిరంజీవి ప్రజల కష్టాలు తీరుద్దాం అని రాజకీయాల్లోకి వెళ్ళాడు... కాని అక్కడ ప్రజల అసలు మనసు తెలిసింది.. మెగాస్టార్ గా తనని అందరు అభిమానిస్తారు... కాని అదే ఒక రాజకీయ నాయకుడిగా అతడిని రిసీవ్ చేసుకోవాలి అంటే ప్రజలకు డబ్బులు పంచాలి.. కాని మెగాస్టార్ అలా చేయలేదు.. అందుకే రాజకీయాల్లో ఎవ్వరు ఊహించని పరాజయం అందుకున్నాడు.. అప్పుడే అతడికి ఈ వ్యవస్థమీద విసుకోచ్చిందో ఏమో ఆవేశంలో తన “ప్రజారాజ్యం పార్టీ”ని కాంగ్రెస్ లో కలిపాడు.. అంతే అప్పటివరకు అభిమానించే చాలామంది ఆయనను విమర్శించడం మొదలు పెట్టారు.. అయినా అవేవి పట్టించుకోని మెగాస్టార్ తనకు ఎంతో ఇష్టం అయిన తన ప్రాణం అయినా సినిమాలే తనకు ముఖ్యం అని రాజకీయాలు పక్కన బెట్టి మల్లి తెరపైకి వచ్చాడు..

  వచ్చి రావడంతోనే “ఖైది నంబర్ 150” సిమాతో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మరోసారి టాలీవుడ్ కి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనే మెగాస్టార్ అనిపించుకున్నాడు.. ఇప్పుడు “సైరా” సినిమాతో టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించాలని ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్.. ఇలాంటి టైములోనే అతడి గురించి మరో న్యూస్ బయటకు వస్తుంది.. చిరంజీవి తన తమ్ముడు స్థాపించిన “జనసేన పార్టీ” MP అభ్యర్థిగా పోటి చేయనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్తల్లో ఎంత నిజముందో ఎంత అబద్దముందో అన్నది పక్కన పెడితే.. ఈమధ్య ట్వీట్టర్ లో పవన్ కళ్యాణ్ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు మెగా కుటుంబం వైపు మళ్ళించింది.. మీరు చూస్తున్న ఈ ఫోటోలో మెగా బ్రదర్స్ తో పాటు వారి ఇద్దరు సిస్టర్స్ కుడా ఉన్నారు..

 ఈ ఫోటోను చూసినా చాలామంది మెగా బ్రదర్స్ ఏం చేస్తున్నారో తెలుసు.. కాని మెగా సిస్టర్స్ ఏం చేస్తున్నారు ? వారి కుటుంబ నేపథ్యం ఏంటి అని గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు... ఈ సర్చ్ లో విచిత్రంగా మెగాస్టార్ పెద్దల్లుడు “విష్ణు ప్రసాద్” టాప్ ప్లేస్ లో నిలిచాడు.. దానికి కుడా ఒక కారణం ఉంది.. అదేంటంటే ఈమద్యే మెగా కుటుంబానికి అల్లుడైనా రెండో అల్లుడు కళ్యాణ్.. పెళ్లై ఏడాది కుడా కాకుండానే హీరో అయిపోయాడు.. కాని మొదటి అల్లుడి పెళ్లై దాదాపు 12 ఏళ్ళు అవుతుంది.. అయినా కుడా చాలామందికి అతడు ఎవరు ? అతడి కుటుంబ నేపథ్యం ఏంటి ? అతడు ఏం చేస్తాడు అనేది చాలామందికి తెలియదు.. అందుకే మెగాస్టార్ మొదటి అల్లుడు ఎవరు ? అంటూ ఈమధ్య గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...

 చిరంజీవి పెద్దకూతురు సుస్మితకు ,“LV విష్ణు ప్రసాద్” 2006లో చెన్నై లో వివాహం జరిగింది.. ఈ వివాహ వేడుకకు సిని ప్రముఖులే కాక ప్రముఖ రాజకీయనాయకులు కుడా హాజరయ్యారు.. ఇక “విష్ణు ప్రసాద్” కుటుంబం విషయానికి వస్తే వీరి కుటుంబం రాయలసీమ నుండి చెన్నై వలసవెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.. విష్ణు ప్రసాద్ తాతగారు “LV రామయ్య” అంటే అప్పటి మద్రాసు రాష్ట్రంలో పేరు మోసిన “బిజినెస్ మెన్”.. అయన అప్పట్లోనే జపాన్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, అమెరిక వంటి దేశాల్లో అనేక వ్యాపారాలు చేసాడు.. అయన కుమారుడు “LR శివ ప్రసాద్” కోడికే మన “విష్ణు ప్రసాద్”.. బిజినెస్ అడ్మినిస్టేషణ్ లో మాస్టర్ డిగ్రీ చేసినా “విష్ణు ప్రసాద్”.. విదేశాల్లో చదువూ పుర్తయ్యకా చెన్నై వచ్చిన ఆయనా తన తాతగారి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు.. తాత “LV రామయ్య” మొదలు పెట్టిన ఫామయిల్ వ్యాపారాన్ని విష్ణు తండ్రి బాగానే డెవలప్ చేసాడు.. తండ్రి తరువాత ఆ బాధ్యతలు తీసుకున్న “విష్ణు ప్రసాద్” తన తెలివి తేటలతో ఆ వ్యాపారాన్ని రెండింతలు చేసాడు..

  ఈ సంస్థ ఏడాదికి కొన్ని వందల కోట్ల టర్నోవర్ రాబడుతుంది.. కొన్ని వందల కోట్లకు వారసుడైనా “విష్ణు ప్రసాద్” పెళ్లి సంబంధం కొందరు తెలిసిన వారినుండి మెగా కుటుంబానికి వచ్చింది.. అతడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న మెగాస్టార్ అతడి టాలెంట్ ని మంచితనం తెలుసుకొని “విష్ణు ప్రసాద్” దే తన కూతురికి సరైనా జోడి అని ఇద్దరికీ 2006 పెళ్లి చేసాడు.. ఈజంటకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు.. ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు ఆనందంగా ఉండే వీరి కుటుంబం ఇంకా చెన్నైలోనే ఉంటుంది.. పైగా సుస్మిత, “విష్ణు ప్రసాద్” జంట మీడియాకు చాల దూరంగా ఉంటారు.. అందుకే వీరి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.. ఇవి మెగాస్టార్ మొదటి అల్లుడు “విష్ణు ప్రసాద్” అసలు వివరాలు.. మరీ మెగాస్టార్ పెద్దల్లుడు “విష్ణు ప్రసాద్” పై మీ అభిప్రాయం ఏంటి ?

Comments

చిరంజీవి పెద్ద అల్లుడు ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ || Chiranjeevi Daughter in Law Family Back Ground

posted onJuly 12, 2018
by sumantv

Tags

chiranjeevi daughter sushmita megastar chiranjeevi chiranjeevi daughter sushmita husband