ప్రతి రోజు అమ్మవారి హారతి కోసం వస్తున్న ఎలుగుబంట్లు..! || Bears Visit Chandi Mata Temple Chattisgarh

  ఆ ఆలయంలో ప్రతిరాత్రీ హారతి సమయానికి జరిగే మహాద్భుతం ఏమిటో తెలుసా...?

 సాధారణంగా దేవాలయాల్ని పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించి,వాటిని చాలా మంది  సందర్శించడం కామన్ గా జరుగూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఆవు,కుక్క,పంది,మేక వంటి  జంతువులు కూడా దేవాలయాల్ని సందర్శించి,విగ్రహాల చుట్టూ భక్తితో ప్రదక్షిణాలు చేసినట్తుగా వార్తలు వస్తే అది తెలుసుకొని,ఆ మూగ జీవాలకు దేవుడిపై ఉండే భక్తి ఎంతగొప్పదో కదా అని అనుకున్నాం.అయితే రీసెంటుగా ఛత్తిస్ ఘఢ్ లో నాలుగు ఎలుగుబంట్లు,ప్రతిరోజూ హారతి సమయానికి గుడికొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నాయట.

 అసలు వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మహా సమూన్ ప్రాంతంలో గుచ్చాపాలీ చండీమాత ఆలయం ఒకటి  ఉంది.ఉత్తర భారతదేశంలో  ప్రసిద్ధికెక్కిన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మహా సామూన్ ప్రాంతానికి 40కిలోమీటర్ల దూరంలో ఉన్నదట్టమైన అడవిలో ఈ చండీమాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది.  ఈ ఆలయంలో ప్రతిరోజూ ఒక అద్భుతము చోటుచేసుకుంటూ ఉంటుంది.అదేమిటంటే ఈ అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రంవేళ  హారతి యిస్తూ ఉంటారు.

  ఈ హారతి సమయంలో  నాలుగు ఎలుగుబంట్లు కలిసి అక్కడికి వచ్చి,ఆ హారతి తీసుకొని,అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్లిపోతాయి.యిలా గతకొన్నేళ్లుగా ప్రతిరోజూ జరుగుతూ ఉంది. నిజానికి ఎలుగుబంట్లు కౄరజంతువులు.అవి మనుషుల్ని చూస్తే వారిపై దాడి చేసి,వారిని చంపేస్తాయి.కానీ విచిత్రం ఏమిటంటే,ఆ ఎలుగుబంట్లు అన్నేళ్లనుంచీ ఆ ఆలయానికి వస్తున్నా,అవి ఎవరికీ ఏ హానీ చెయ్యలేదు.ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారికి హారతి యిస్తూ ఉంటారు.ఈ హారతి సమయానికి ఆ ఎలుగుబంట్లు ఎక్కడ ఉన్నా,సరిగ్గా హారతి యిచ్చే సమయానికి ఖచ్చితంగా అక్కడికి వస్తాయి.పూజారి అమ్మవారికిచ్చే ఆ హారతిని స్వయంగా చూసి,భక్తితో నమస్కరించుకొని,ప్రసాదంకోసం  ఎదురు చూస్తుంటాయి.హారతి అవ్వగానే ఆ ఆలయ పూజరి ముందుగా ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆ నాలుగు ఎలుగుబంట్లకీ యిచ్చిన తర్వాత,ఆ ఎలుగుబంట్లు ఆ ప్రసాదాన్ని తింటాయి.తర్వాత అక్కడికొచ్చిన భక్తులు ఏమైనా ప్రసాదం లేదా ఇతర తినుబండారాల్ని ఏవైనా పెట్తినా అవి తింటాయి.కానీ ఎవ్వరినీఏమీ చెయ్యవు.మౌనంగా ఆ ప్రసాదాన్ని వారి దగ్గరనుంచి తీసుకొని,తింటాయి.

 ఈ నాలుగు ఎలుగుబంట్లూ చండీ అమ్మవారికి నమ్మినబంట్లు అనీ,అవి ఈ జన్మలో అమ్మవారికి కాపలాగా ఉండడానికే జన్మించాయనీ,అవి ఈ చండీమాత ఆలయం చుట్తుపక్కలే ఉండి,అమ్మవారినికంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయని కొందరు పండితులు చెబుతుంటారు.,కొందరు మాత్రం ఆ ఎలుగుబంట్లు అమ్మవారి స్వరూపమనీ,అవి ఎక్కడనుంచి వస్తాయో,ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ కనిపించవనీ,రాత్రి  హారతి సమయానికి మాంత్రం అవి ఠంఛనుగా వచ్చేస్తూ ఉంటాయనీ,ఎవరు ఏది పెట్టినా,ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా తింటాయనీ,యిలాంటి మంచి ఎలుగుబంట్లని మేమెక్కడా చూడలేదనీ అంటున్నారు.ఇక మహాసమూన్ ప్రాంత ప్రజలైతే ఈ ఎలుగుబంట్లని దైవస్వరూపాలుగా భావిస్తూ ఉంటారు.వాటికి ఎలాంటి హానీ తలపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆ నాలుగు దేవతా ఎలుగుబంట్లనీ కొన్నేళ్లుగా సంరక్షిస్తూ వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎలుగుబంట్లు ఉదయమంతా ఎక్కడా కనిపించవు.ఎల్లప్పుడూ అడవుల్లో సంచరించే గిరిజనులకి కూడా ఎప్పూడూ ఎక్కడా ఈ ఎలుగుబంట్లు కనిపించవు.

 ఒక్క రాత్రివేళ  అదీ చండీమాత హారతి సమయంలో ఆ  ఆలయంలోమాత్రమే కనిపిస్తాయి.అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. అంతేకాదు,హారతి పూర్తి అవ్వగానే ఆ ఎలుగుబంట్లు అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తాయో,ఏమైపోతాయో ఎవ్వరూ చూడలేదు.మరుసటిరోజు సాయంత్రము మాత్రం  హారతి సమయానికి ఆ ఆలయానికి ఠంఛనుగా వచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా చూస్తుంటే  అవి మామూలు ఎలుగుబంట్లు కావనీ దేవతా ఎలుగుబంట్లు అనీ,అవి సాక్షాతూ ఆ చండీస్వరూపాలే అనీ అక్కడి వారు భావిస్తున్నారు.ఏదేమైనా రాత్రి హారతి సమయానికి కరెక్టుగా హాజరయ్యే ఈ ఎలుగుబంట్లని చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందికదూ...  ఏదేమైనా ఆ ఎలుగుబంట్లని ప్రతిరోజూ ప్రత్యక్షంగా చూసి,వాటికి స్వయంగా ప్రసాదాన్ని  పెట్టే ఆ పూజారీ మరియూ ఆ గ్రామస్థులూ ఎంతటి ధన్యజీవులోకదా... మీరు కూడా ఆ దేవతా ఎలుగుబంట్లని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఛత్తిస్ ఘడ్ లోని  మహాసమూన్  గుచ్చాపాలికి వెళ్లాల్సిందే.

Comments