ఒకే ఒక్క - కార్డుతో సిటీ మొతం చుట్టేయొచ్చు || Combo Travel Card in Telangana State ||

 హైదరాబాద్ నగరవాసులకి కళ్లు చెదిరే శుభవార్త..అన్ని అవసరాలకీ కలిపి ఒకే ఒక కార్డు తీసుకురానున్న ప్రభుత్వం... 

హైదరాబాద్ నగరవాసులకి తెలంగాణా ప్రభుత్వం  త్వరలో ఒక శుభవార్తని అందించబోతోంది.ఇకపై అన్ని అవసరాలకూ సరిపడే విధంగా ప్రభుత్వం ఒకే కార్డు విధానాన్ని తీసుకురానుంది.ఇంతకీ ఆ కార్డు ఏమిటీ... ఆ కార్డు ఏ ఏ అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం....   

మన హైదరాబాద్ నగరంలో  మెట్రో రైల్ కూతకూయడం మొదలుపెట్టి చాలాకాలం అవుతున్నా,దాని టికెట్  ధర సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా లేకపోవడంతో మెట్రో ట్రైనులో ప్రయాణించడానికి చాలామంది భయపడిపోతున్నారు.ప్రభుత్వం ఎన్ని స్కీములు ప్రవేశపెట్తినా,దానిపై ప్రయాణించేవారు అతి తక్కువమందే ఉన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల రద్దీని పెంచే ఉద్ధేశ్యంతో బాగా ఆలోచించి,అన్ని అవసరాలకీ సరిపడే విధంగా ఒకే కార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది.

  అన్ని అవసరాలకీ ఒకే కార్డు విధానం అంటే మెట్రో ట్రైనులో ప్రయాణించడానికీ,సిటీబస్సులో ప్రయాణించడానికీ,థియేటర్లో సినిమా చూడ్డానికీ,మీకు నచ్చిన హోటల్లో నచ్చిన భోజనం తినడానికీ,షాపింగ్ చెయ్యడానికీ యిలా అన్ని అవసరాలకీ సరిపడే విధంగా క్యాష్ లెస్ సేవలు పొందడానికి వీలుగా అన్నిటికీ కలిపీ ఒకే ఒక సరికొత్త కార్డు విధానాన్ని హైదరాబాద్ వాసులకోసం తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తోంది.  త్వరలో హైదరాబాద్ వాసులు  ఒకే ఒక్క  కార్డుతో అనేక రకాల సేవల్ని పొందనున్నారు.ఈ కార్డుకి సంబంధించిన విధివిధానల రూపకల్పనకై త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. యిలా ఒకే కార్డుతో మెట్రోలోనూ,బస్సుల్లోనూ ప్రయాణించే సౌకర్యం ఇప్పటిదాకా ఒక్క  ఢిల్లీలో మాత్రమే ఉంది.

 జనవరి 2018లో ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.ఇప్పుడు ఈ ఒకే కార్డు విధానాన్ని మన హైదరాబాద్ కి కూడా తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా కృషిచేస్తోంది.ఒకే కార్దుతో,హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులోనూ అలాగే ఎమ్మెంటీ ఎస్ లోనూ ప్రయాణించేలా గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా,అవి అమల్లోకి రాలేదు.కానీ ఒకే కార్డుతో  అటు మెట్రోలోనూ,ఇటు ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించడమేకాకుండా యిష్టమొచ్చిన సినిమాకి వెళ్లగలిగేలా,మనకి నచ్చిన హోటల్లో యిష్టమైన ఫుడ్డు తినగలిగేలా..యిలా అనేక అవసరాలకి కలిపి ఒకేకార్డు విధానాన్ని తీసుకొస్తే నగరవాసులు యిక ప్రతిరోజూ పండగచేసుకోవచ్చు.ఇలా అన్ని అవసరాలకీ ఒకే కార్డు విధానం త్వరలోనే రావాలని మనమందరం కోరుకుందాం..అప్పుడైనా వాహనదారులకి విపరీతమైన పెట్రోల్ భారం తగ్గి,వారంతా చక్కగా మెట్రో ట్రైన్స్ లోనూ,ఆర్టీసీ బస్సుల్లోనూ హాయిగా ప్రయాణం చెయ్యవచ్చు...  ఇది కార్య రూపం దాల్చితే నిజంగా హైదరాబాద్ నగరవాసులకి తీపికబురే.

Comments