నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి | Night Shifts Are Damaging Your Brain | Sumantv

టైటిల్: నైట్ షిఫ్ట్ చేసేవారికి  అనారోగ్యాలు రాకుండా ముఖ్యమైన హెల్త్ టిప్స్

 ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట... ఉద్యోగాల్లో స్త్రీలు, పురుషులతో పోటీపడి పనిచేస్తున్నారనేది నేటి వాస్తవం. స్త్రీలు వంటింటి కుందేళ్లుగా ఉన్న రోజులుపోయి,ఉద్యోగాల్లో పురుషులనే ఛాలెంజ్ చేసే రోజులు వచ్చాయి.ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా పొటీ పడుతూ ఎందులోనూ మేము తక్కువ కాము అన్నట్టు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది శుభపరిణామమే.ఈ మధ్యకాలంలో నైట్ షిప్టులు చేయడానికి కూడా మహిళలు భయపడకుండా ధైర్యంగా ముందుకొస్తున్నారు.ఇదంతా బాగానే ఉన్నా,ఇలాంటి నైట్ షిఫ్ట్ ల మూలంగా కేవలం  అమ్మాయిలే కాదు,  అబ్బాయిల  ఆరోగ్యంపై కూడా      చెడు ప్రభావమే చూపిస్తుందని అంటున్నారు పరిశోధకులు.  ఈ క్రమంలో నైటు షిఫ్టులు పనిచేసే మహిళలకీ, పురుషులకీ   ఆరోగ్యపరంగా వచ్చే అనర్థాలు ఏమిటో తెలుసుకుందాం....

నేటి కాలంలో  అనేక నగరాల్లో   కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా పెరగడంతో ఆ కంపెనీల్లో డే అండ్ నైట్ పనిచేసే వారి సంఖ్య కూడా బాగా పెరింగింది.  ముఖ్యంగా కాల్ సెంటర్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగులు రాత్రి సమయాల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అనేక రాత్రుళ్లు   వారు రాత్రి మొత్తం అలా పనిచేయడం అంటే అంత సులభమైన పని కాదు.అలా  నైట్ షిఫ్ట్ లు చేయడం అంటే కోరి రోగాల్ని కొనితెచ్చుకోవడమే అంటున్నారు వైద్య  నిపుణులు. నైట్ షిప్టులు పనిచెసేవారు ఎక్కువగా డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, నిద్రలేమి, ఒత్తిడివంటి అనేక వ్యాధుల బారినపడుతున్నారని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్ళు డ్యూటి చేసే ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా  ఎక్కువగా ఉన్నాయట. ఎందుకంటే రాత్రి డ్యూటీలు చేసేవారు నిద్రపోకుండా పనిచేయడంవల్ల వారి  శరీరంలోని మెలటోనిన్‌, వారి బాడీలో ఉండే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.

 అందువల్లే అలాంటివారు   క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులబారినపడుతున్నారని పలు అధ్యయనాల ద్వారా తెలిసింది.ఇదే విషయాన్ని పలువురు పరిశోధకులు కూడా  స్పష్టంగా  చెబుతున్నారు. సాధారణంగా మన బాడీలో ఉండే  ఈ మెలటోనిన్‌ రక్తంలో ఈస్ట్రోజన్‌ను తగ్గిస్తుంది.అంతేకాకుండా అది  క్యాన్సర్‌ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది.  ఇలాంటి ఈ మెలటోనిన్‌ను   మన మెదడు ఎక్కువగా మధ్యరాత్రి వేళల్లో , చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది.  అందుకే ప్రతి ఒక్కరూ రాత్రివేళ్లల్లో నిద్రపోవడం తప్పనిసరి.సృష్టి జరిగిన నాటినుండీ అది అలాగే  కొనసాగుతూ వస్తోంది.అయితే ఈ నైట్ షిప్టులపేరుతో రాత్రిళ్లు కూడా ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు మెలటోనిన్ ఉత్పత్తి అయ్యే సమయంలో నిద్రపోకుండా ఉండి,సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేస్తుంటారు. అందువల్ల వారి  మెదడులో  మెలటోనిన్‌ విడుదల  ఆగిపోతుంది.  దీనికారణంగా వారి ఆరోగ్యం దెబ్బతిని మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌  పురుషులు అయితే   పలురకాల అనారోగ్యాలకి గురి అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవారికి  టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.   డే షిఫ్ట్ జాబ్ చేసే వారితో పోలిస్తే నైట్ షిఫ్ట్ జాబ్ చేసే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 44 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని  వైద్యులు వెల్లడిస్తున్నారు.  నైట్ షిఫ్టులు పనిచేసే ఉద్యోగులు కొన్ని టిప్స్ ని పాటిస్తే,అనారోగ్యాలబారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం..

  రాత్రి సమయాల్లో పనిచేసేవారు ఒక కప్పు కాఫీ తాగాలి.అలా చెయ్యడంవల్ల  ఆకాఫీలో  ఉండె కెఫేన్,7నుంచి 8 గంటలపాటు  నిద్రరాకుండా ఆపుతుంది. నీరు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ,శరీరాన్ని తేమగా ఉంచుతుంది. చాలామందికి రాత్రుళ్లు  పనిచేయడం వల్ల ఎనర్జీ తగ్గడంతోపాటు  వారి శరీరంలో నీటిశాతం కూడా తగ్గుతుంది. కాబట్టి, శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి మరియు అలసటను తొలగించుకోవడానికి రాత్రిపూట పనిచేసే సమయంలో నీరు  ఎక్కువగా తాగాలి. సాధ్యమైనంతవరకూ ఆయిల్ ఫుడ్స్ ని ఎవాయిడ్ చేసి,వాకింగ్ ఎక్కువగా చెయ్యాలి.అంటే మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తీసుకొని,ఆఫీసులో అటూ యిటూ నడుస్తూ ఉండాలి.దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి,అలసట తగ్గి,మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది. హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. వీలైతే పని మధ్యలో కొద్దిసేపు నిద్రపోవాలి.నైట్ షిప్టులు పనిచేసేవారు తప్పనిసరిగా ఈ టిప్స్ ని పాటిస్తే   ఎలాంటి అనారోగ్యాలు మీ దరిచేరే అవాకాశాలు ఉండవు.కాబట్టి గుర్తుంచుకోండి. ఈ టిప్స్ పాటిస్తూ మీ ఉద్యోగ జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోండి.

Comments