షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Waring To Shakalaka Shankar

 షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ |

  షకలక శంకర్.. ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ షో  ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్న మోస్ట్ పాపులర్ కమెడియన్. ఈ షో ద్వారా వచ్చిన ఫేం తో ప్రస్తుతం టాలీవుడ్ లో రైజింగ్ కమెడియన్గా ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా, పవన్ కల్యాణ్ ను దేవుడిగా ఆరాధించే షకలక శంకర్ ఆయన మీద తనకున్న భక్తిని ‘జబర్దస్త్’ లో  పలు స్కిట్లు వేసి మరీ చాటుకున్నాడు.జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ తర్వాత వెండితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు.  అదృష్టం కలిసి వచ్చి వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకున్నాడు.

  ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న తరుణంలో షకలక శంకర్ కూడా ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు.  అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు..ఒక  కార్యక్రమంలో త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజపై కూడా తనదైన స్టైల్ల కామెంట్ చేశాడు.  దాంతో ఇండస్ట్రీలో అదో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తాజాగా షకలక శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో తనపై పవన్ కళ్యాన్ సీరియస్ అయిన విషయంపై క్లారిటీ ఇచ్చారు.  జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాన్ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకున్న సమయంలో సర్ధార్ గబ్బర్ సింగ్ లో సినిమా చాన్స్ వచ్చింది.  నేను ఆ సినిమా ఒప్పుకున్నదే పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూడటానికి. ఏ సీన్ చెబుతున్నారని గానీ .. ఎలా చేయాలని గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.

 ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని .. అయినా తనివి తీరేది కాదు. ఆ సినిమాకి తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు..దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి  కో డైరెక్టర్ పై అరిచాను. ఈ విషయం కాస్త పవన్ కళ్యాన్ వద్దకు వెళ్లింది..దాంతో ఆయన నన్ను పిలిచి..'ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో' అన్నారు. కెరీర్లో ఎదగాలంటే ప్రవర్తన చాలా ముఖ్యమని.. అందుకే, ఇకపై  ఎక్స్ట్రాలు చేయకుండా హద్దుల్లో ఉండాలని గట్టిగా క్లాస్ పీకాడట! పవన్ సీరియస్గా క్లాస్ పీకిన తర్వాత షకలక శంకర్  లైన్లో పడ్డాడని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వర్గాలు అంటున్నాయి. ఆ రోజున జరిగింది ఇదే' అంటూ స్పష్టం చేశాడు.  

Comments