కాస్టింగ్ కౌచ్ గురుంచినిజాలుచెప్పినయాంకర్ శ్యామల|AnchorShyamala Comments On Casting Couch| BiggBoss2

  కాస్టింగ్ కౌచ్ గురుంచినిజాలుచెప్పినయాంకర్ శ్యామల|

  బిగ్ బాస్ 2 ఎలిమినేషన్ లో బయటికి వచ్చిన యాంకర్ శ్యామల రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేసింది. ఏడాది వయసు కూడా నిండని తన కొడుకు మొదటి పుట్టిన రోజుకు  ఫైనల్ గా అనుకున్న సమయం కంటే ముందే చేరుకుంది. సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన శ్యామల అభిమానులతో గంటకు పైగా ముచ్చటించడం విశేషం. మిలియన్నర ఫాలోయర్స్ ఉన్న శ్యామల నెటిజన్ల ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.యాంకర్ శ్యామలా బిగ్ బాస్ సీజన్ -2 నుండి నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్‌లోకి వెళ్లక ముందు ఆమె పలు టీవీ షోలకి యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  శ్యామల కూడా అమెరికాలో ఈవెంట్స్ కోసం వెళ్తుంటుంది. ఓ టీవీ చానెల్లో పాల్గొన్న శ్యామలాకు అమెరికా సెక్స్ రాకెట్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సెక్స్ రాకెట్ కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..? అని సదరు యాంకర్ శ్యామలాని ప్రశ్నించింది.దీనిపై శ్యామల చాలా కూల్ గా సమాధానాలు చెప్పుకొచ్చింది. ”నేను అమెరికా వెళ్లినప్పుడు అందరితో కలిసి హోటల్స్ లో ఉండడం కంటే మా చుట్టాల ఇళ్లల్లో ఎక్కువగా గడుపుతుంటాను. నేను ఫోన్ అసలు వాడను కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి కాల్స్ కూడా రాలేదు.

  నేను పాల్గొనే ఈవెంట్స్ అన్నీ కూడా పెద్ద ఆర్గనైజేషన్స్ కు సంబంధించినవి కావడంతో నాకు అలాంటివి ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. తనతో వచ్చిన వాళ్ల గురించి తనకు తెలియదని ఈ ప్రశ్నను వాళ్లనే అడగాలని తెలిపింది.నాకు అమెరికాలో ఏదైనా షోలు చేసే అవకాశం వస్తే ఆర్గనైజేషన్ గురించి ముందు కనుక్కుంటాను. అక్కడ లోకల్‌గా ఉండే మా వాళ్లతో ఎంక్వయిరీ చేసుకున్న తర్వాతే నేను షోలు చేయడానికి వెళతాను. అదే సమయంలో నేను ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు. సంవత్సరంలో ఉగాది సమయంలో మాత్రమే వెళతాను. మూడు షోలు చేసుకుని వచ్చేస్తాను. అది కూడా చుట్టాల ఇళ్లలో ఉంటాను. ఫ్రీక్వెంటుగా వెళ్లే వారికి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా తెలుస్తుందేమో? నాకైతే అలాంటివి తెలియవు.సినిమాల్లో, టీవీల్లో చేసే వారిపై ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలాంటిది ఇపుడు కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్‌తో టాలీవుడ్ వారికి లింక్స్ ఉన్నాయని ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఒకసారి ఇలాంటి న్యూస్ వస్తే వీటి ఇంపాక్ట్ అందరిపైనా ఉంటుంది. దీని వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అనే ప్రశ్నకు శ్యామల స్పందిస్తూ... దేవుడి దయవల్ల నా బౌండరీ దాటి నా వద్దకు అలాంటి సమస్యలు రాలేదు. అది రాదు అని అనుకుంటున్నాను అని శ్యామల తెలిపారు.

Comments