గురువారంరోజు పెళ్లికానీ అమ్మాయిలు పాలతోఇలాచేస్తే ఆర్థికఇబ్బందులు పోయి ఆఇంట్లో డబ్బేడబ్బు| MoneyMoney

  గురువారంరోజు పెళ్లికానీ అమ్మాయిలు పాలతోఇలాచేస్తే ఆర్థికఇబ్బందులు పోయి ఆఇంట్లో డబ్బేడబ్బు|

 మానవ జీవితం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి మనిషి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ పెళ్లి. ఆ పెళ్లి కోసం అమ్మయిలు, అబ్బాయిలు ఎన్నో ఊహించికుంటూ, మరెన్నో కళలు కంటూ ఉంటారు. ఇక ఆడపిల్ల పెళ్లి గురించి తల్లి తండ్రులు ఆమె పుట్టిన దగ్గర నుంచి ఎన్నో కళలు కంటూ ప్లానింగ్ వేస్తూ ఉంటారు. అయితే కళ్యాణం స్వర్గంలో నిర్ణయించబడతుందని అంటారు కదా. కొందరికి ఎన్ని సంబందాలు చూసినా, ఎదో ఒక కారణం వలన పెళ్లి తొందరగా కుదరదు. దానికి కారణం కూడా ఉండక పోవచ్చు ..కానీ వాటికి పరిష్కారం మాత్రం తప్పక ఉంటుంది ...

  ఈ రోజుల్లో  పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు.అలాంటి వాటిలో వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి దేవుడికి వాళ్ల పేరుమీద వ్రతం చేసినట్టే ఒక్కో వారం ఒక్కో వ్రతానికి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లికాని వారికి అడ్డంకులు తొలగిపోయేలా గురువారం వ్రతం పురాణ కాలం నుంచి ఉందని వేదపండితులు చెబుతున్నారు.దేవతల గురువు అయిన బృహస్పతిని పూజించడం ద్వారా పెళ్లికి అడ్డంకులు వీడిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని సూచిస్తున్నారు. ఇక బృహస్పతిని ప్రసన్నం చేసుకునేందుకు గురువారం వ్రతం ఎలా చేయాలంటే… ఏదైనా ఒక మాసంలో వచ్చే శుక్లపక్ష గురువారం ఎంచుకుని వ్రతం మొదలుపెట్టాలి. అలా 4 వారాల పాటు ఈ వ్రతం ఆచరించాలి.

  గురువారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా అభ్యంగనస్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించడమే గాకుండా పసుపు రంగు పూలు, పసుపు రంగు మిఠాయిలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండి బృహస్పతికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. అయితే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉపవాసం ఉండలేనివారు ఉప్పులేని ఆహారం తీసుకోవచ్చు. పూజ తర్వాత పేదలకు అన్నదానం చేయాలి.అంతేకాదు ఉదయం పూజ పూర్తిచేసి సాయంత్రం పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఇలా నిష్టగా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా, ఎన్నో ఏళ్లుగా పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఈ వ్రతం చేస్తే అవరోధాలన్నీ తొలగిపోయి కల్యాణ ప్రాప్తి కలుగుతుంది.

Comments