గీత మాధురి గురించి బయటపడ్డ నమ్మలేలి నిజం | Facts About Singer Geetha Madhuri Habits | #BiggBoss2

 గీత మాధురి గురించి బయటపడ్డ నమ్మలేలి నిజం |

  గీతామాధురి హస్కీ వాయిస్ తో ఆమె పాడే పాటలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళతాయి. మ్యూజిక్ డైరక్టర్లు కూడా కొన్ని పాటలకు ప్రత్యేకించి గీతామాధురినే ఎంచుకుంటారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆమె కొన్ని వందల పాటలు పాడింది. సై సింగర్స్ చాలెంజ్ కార్యక్రమంలో ఫైనల్ కు చేరడం ద్వారా వెలుగులోకి వచ్చిన గీతామాధురి నచ్చావులే చిత్రంలోని నిన్నే నిన్నే పాటతో అందరిని ఆకట్టుకుంది. ఆ పాటకు గీతకు నంది అవార్డు రావడంతో ఆమె పేరు సినీ వర్గాల్లో మారుమోగిపోయింది.ప్రస్తుతం గీతామాధురి బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉంది. చాలాసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ప్రతిసారి ఫ్యాన్ సపోర్ట్ తో సేఫ్ జోన్ లోకి వచ్చేస్తోంది. ఇక గీతామాధురి పర్సనల్ విషయాలు చూస్తే

  ఆమెకు టాలీవుడ్ యువ నటుడు నందుతో వివాహం జరిగింది. ఓ షార్ట్ ఫిలిం చేస్తుండగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చివరికి ఇంట్లో అందరినీ ఒప్పించి లైఫ్ లో ఒక్కటయ్యారు. ఇప్పటివరకు చాలా పాటలు పాడిన గీతామాధురి ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆమె తరచుగా కాసినోలకు వెళుతుంటుంది. కాసినోలంటే మనందరికీ తెలిసిందే. అక్కడ రకరకాల జూద క్రీడలు ఆడుతుంటారు.అయితే గీతామాధురికి కాసినో అనేది ఓ వ్యసనంలా మారిపోయిందట. ఇలా కాసినోల్లో జూదం ఆడి చాలా లక్షలు పోగొట్టుకున్నానని స్వయంగా ఆమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత మరెప్పుడూ కాసినోలకు వెళ్లకూడదని ఒట్టు పెట్టుకున్నానని తెలిపింది. కానీ కాసినో చూస్తేనే చాలుతనకు అదోరకమైన ఉత్సాహం కలుగుతుందని, లక్షల్లో డబ్బులు పోతున్నా ఇంకా ఆడాలన్న ఫీలింగ్ కలుగుతుందని వివరించింది. అందుకే ఇంకెప్పుడు కాసినో జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని పేర్కొంది గీతామాధురి. భవిష్యత్తులో సినిమాలు లేకపోయినా రిసెప్షనిస్టుగా పనిచేసైనా డబ్బులు సంపాదించుకునే తెలివి ఉంది కానీ, డబ్బులు దాచుకోవడ తనకు చేతకాదని వాపోయింది.

Comments