అల్లు అర్జున్ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు | Allu Arjun Personal Life Details | Sneha Reddy

 అల్లు అర్జున్ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు |

  అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు.స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత  అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు.

  హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలికగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎర్పరచుకోవటంలో అల్లు అర్జున్ కృషిని అభినందిచవలసిందే.

  గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా  యువత మనసులో స్థానం సంపాయించాడు. ఆర్య తో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తరవాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్ తో హట్రిక్ పూర్తిచేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడనుంచి  చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక  ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇజ్ తో, డాన్సులో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. 'పరుగు' లో కృష్ణ గా చక్కని నటనతో ఆకట్టుకుని, 'వేదం' తో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని  సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత  అల్లుఅర్జున్ ది.

  టాలీవుడ్ లో ఉన్న అగ్రహీరోల్లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. కుటుంబ సభ్యుల నుంచి అభిమానుల వరకు అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. ఇప్పుడున్న అగ్రహీరోల్లో డ్యాన్సింగ్ స్టార్ గా అల్లు అర్జున్ కు పేరుంది. ఎంత కష్టమైన మూవ్ మెంట్ అయినా చిటికెలో చేసేస్తాడని బన్నీ గురించి చెప్పుకుంటారు టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోనే అయినా కొద్దికాలంలోనే తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో బన్నీని అనుసరించేవాళ్లు లక్షల్లో ఉంటారు.బన్నీ నుంచి ఇటీవల వచ్చిన చిత్రం నా పేరు సూర్య విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి సినిమాకు హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్ పెట్టే అల్లు అర్జున్ తో ప్రతి దర్శకుడు సినిమా చేయాలని కోరుకోవడంలో అతిశయోక్తిలేదు. గంగోత్రి చిత్రంతో హీరోగా ప్రస్థానం ఆరంభించిన ఈ అల్లు వారబ్బాయి ఆర్య చిత్రంతో స్టార్ డమ్ అందుకున్నాడు. బన్నీ, హ్యాపీ, దేశముదురు, వేదం… ఇలా ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న ఈ యువ హీరో పక్కా ఫ్యామిలీ టైప్ అని చెప్పుకోవాలి.

  ఒకప్పుడు పబ్ కల్చర్ లో మునిగితేలిన బన్నీ పెళ్లయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.బన్నీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ పార్టీలో కలిసిన స్నేహారెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. ఇక బన్నీ మనసు దోచిన స్నేహారెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆమె తండ్రి కేసీఎస్ రెడ్డి తెలంగాణలో ప్రముఖ విద్యావేత్త మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కూడా. ఒక దశలో ఆయన పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయగా, రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన సమయంలో వాటిని అమ్మి వేల కోట్లు సంపాదించాడు. 20 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉన్న స్నేహారెడ్డి కుటుంబం ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తింది. దాంతో కేసీఎస్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కాలేజ్ లు, ఫార్మసీ కాలేజ్ లు స్థాపించి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సెటిలయ్యాడు.ఇక, బన్నీతో తన కుమార్తె పెళ్లికి ఆయన రూ.100 కోట్ల వరకు కట్నం రూపంలో సమర్పించుకున్నట్టు సమాచారం. వీటికితోడు సిటీలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న విలువైన స్తిరాస్థులను కూడా కుమార్తె పెళ్లికి రాసిచ్చాడట. అప్పట్లో అల్లు అర్జున్ తన పెళ్లిని రూ.10 కోట్ల ఖర్చుతో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. సినీ సెట్టింగ్ లతో దేవలోకాన్ని తలపించేలా పెళ్లి వేదికపై బన్నీ, స్నేహారెడ్డి గంధర్వుల్లా మెరిసిపోయారు. ప్రస్తుతం బన్నీ, స్నేహారెడ్డి దంపతులకు అయాన్, అర్హ అనే పిల్లలున్నారు. సినిమా షూటింగ్ లేకపోతే బన్నీకి కుటుంబమే లోకం. వాళ్లతో కలిసి ఫారెన్ ట్రిప్ లు, సైట్ సీయింగ్ లు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాడు. అన్నట్టు… బన్నీ తన పెళ్లి తర్వాత సిటీలో చాలా వ్యాపారాలు మొదలుపెట్టాడు. వాటిలో ముఖ్యంగా ఓ రెస్టారెంట్, కొల్లాజ్ ఆర్ట్ స్టూడియో ఉన్నట్టు తెలుస్తోంది.
 

Comments