పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బ్యాగ్ లో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు | Pawan Kalyan Secrets In His Bag

  పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బ్యాగ్ లో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు |

  మెగాస్టార్ తమ్ముడిగా చిత్ర రంగానికి పరిచయమై ఆ తర్వాత సునామీ రేంజ్ లో ఎదిగిపోయిన హీరో పవన్ కల్యాణ్. పవర్ స్టార్ గా తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవన్ అజ్ఞాతవాసి చిత్రంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. సినిమాలకు దూరమైనందుకు బాధపడినా, రాజకీయాల్లోకి రావడం ద్వారా నిత్యం తమ మధ్యే ఉంటాడని అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉద్యమాలకు పుట్టిల్లయిన శ్రీకాకుళం నుంచి యాత్ర చేపడుతున్నారు. అందుకోసం చాలా నిరాడంబర రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు పవన్.

 ఓ పాత బ్యాగ్ లో తనకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలను ఉంచుకుని వైజాగ్ చేరుకున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ దగ్గర ఉన్న బ్యాగ్ పైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ బ్యాగ్ ను ఖుషీ చిత్రం నుంచి పవన్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికి ఆ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి 17 ఏళ్లయింది. అప్పట్నించి పవన్ కు ఆ బ్యాగ్ సెంటిమెంట్ అయిపోయింది. పవన్ వెళ్లేది ఎక్కడికైనా గానీ ఆ బ్యాగ్ వెంట ఉండాల్సిందే. తనకు అవసరమైన కొన్ని అత్యవసర వస్తువులను తనకు అచ్చొచ్చిన బ్యాగ్ లో సర్దుకున్న పవన్ వైజాగ్ లో అత్యంత సామాన్యుడిలా అంబేద్కర్ భవన్ లో బస చేస్తున్నారు.స్టార్ హోటల్స్ లో అకామడేషన్ ను నిరాకరించిన ఆయన నిరాడంబరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అయితే తన వెంటే ఉండే ఆ బ్యాగ్ పాతది అయినా, దాన్ని మార్చుకునేందుకు పవన్ ఇష్టపడడం లేదని సమాచారం. తనకు ఖుషీ టైమ్ నుంచి కలిసొస్తున్న బ్యాగ్ గా దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు విశాఖ పర్యటనలో ఊహించని అనుభవం ఎదురైంది..

  విశాఖ గంగవరంలో పర్యటించిన పవన్ కళ్యాన్ ఓ మహిళ ప్రశ్నించింది. అది అలా ఇలా కాదు.. రాజకీయ నాయకుడిగా మారాక పవన్ కళ్యాన్ ఇది తొలి అనుభవం.. ఎప్పుడూ తన అభిమానుల కేరింత మధ్య సీఎం సీఎం అంటూ నినాదాలతో కదిలే పవన్ ఈ అనుకోని ప్రశ్నతో అక్కడే కాసేపు ఆగారు. మహిళ ప్రశ్నకు కోపగించుకోకుండా ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నే తన ప్రశ్నతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఆ మహిళ ఏమందో తెలుసా.?గంగవరంలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన ఓ మహిళ సీరియస్ గా ప్రశ్నించింది.. ‘బీజేపీ, టీడీపీలు తమ కిడ్నీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశాయని మిమ్మల్ని ఎలా నమ్మాలని’ పవన్ ను ప్రశ్నించింది. కిడ్నీ బాధిత మహిళ ఇలా అందరి ముందు ప్రశ్నించే సరికి పవన్ కళ్యాన్ కాసేపు తటపటాయించారు. బాధిత మహిళ ప్రశ్నకు పవన్ కళ్యాన్ సమాధానమిచ్చారు. ‘తాను కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించేందుకే వచ్చానని.. మీ తరఫున పోరాడేందుకు తాను వచ్చినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించిన తర్వాతే తనకు ఓటు వేయాలని స్పష్టం చేయడంతో ఆ మహిళ శాంతించింది.

Comments