Skip to main content

ఒక్కపుడు స్టార్ హీరోయిన్ జయచిత్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా| Actress Jayachitra Personal Life

 ఒక్కపుడు స్టార్ హీరోయిన్ జయచిత్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా|

 మనకి బాగా గుర్తున్న అబ్బాయిగారు సినిమాలో పొగరున్న అత్తగారు పాత్ర లోకి వెళ్తే, ఠక్కున జయచిత్ర స్ఫురిస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఈమె ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో వుందో తెలిస్తే, ఆశ్చర్య పోవడం ఖాయం. చిల్లరకొట్టు చిట్టెమ్మ, రిక్షారాజా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జయచిత్ర తెలుగులో సోగ్గాడు మూవీతో శోభన్ బాబు సరసన నటిస్తూ ఎంట్రీ ఇచ్చింది. చాలాకాలం అగ్ర హీరోయిన్ గా కొనసాగి, తెలుగు,తమిళ భాషల్లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జయచిత్ర కాకినాడకు చెందినవారు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా ప్రాధాన్యం గల పాత్రలను ఎంచుకుని అందరినీ అలరించింది.జయచిత్ర తండ్రి మహేంద్ర వెటర్నరీ వైద్యులు. ఇక తల్లి జయశ్రీ తమిళ నటి.

  అసలు జయచిత్ర అసలు పేరు లక్ష్మీ కృష్ణవేణి. ఆరేళ్ళ వయస్సులోనే భక్తపోతన మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన ఈమె కోరతి మగంఅనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. దాదాపు 200 చిత్రాల్లో నటించిన జయచిత్ర హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ ని పెళ్ళాడి లైఫ్ లో సెటిల్ అయింది.జయచిత్రకు అమరేష్ అనే కొడుకున్నాడు. అతడిని హీరోగా నిలబెట్టాలన్న ఉద్దేశ్యంతో తానే నిర్మాతగా మారడమే కాదు,స్వయంగా దర్శకత్వం వహించి,అతని కెరీర్ కోసం జయచిత్ర ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే నేటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇలాంటి పరిణామాల్లో జయచిత్ర ఆర్ధికంగా బాగా నష్టపోవడమే కాదు,మానసికంగా కుంగిపోయింది.

  ఇక ఇటీవల ఓ ఘటన ఆమెను మరింత దెబ్బతీసింది.కొన్నేళ్ల క్రితం చెన్నై రంగరాజపురం లోని తన ఇంటిని ఇలాం మురుగన్, మీనా దంపతులకు అద్దెకు ఇచ్చింది. అయితే 12ఏళ్లుగా అద్దె చెల్లించకుండా తనను మోసం చేసారని, తన ఇంటిని కాజెయ్యడానికి చేతబడి చేయించారని జయచిత్ర మీడియా ముందు ఆరోపించింది. ఈ ఘటనపై పిర్యాదు చేయడంతో కొంత సొమ్ము చెల్లించి ఇంకా 7లక్షలు బాకీ పడ్డారని చెప్పింది.కోర్టుని కూడా మోసం చేసి, చివరకు ఇంటికి చేతబడి చేయించి,ఆ ఇంట్లోకి తాను అడుగుపెట్టకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందింది. ఇప్పటికే డబ్బులన్నీ పోగొట్టుకుని కష్టాల్లో కూరుకుపోయానని,ఇక ఉన్న ఇల్లు కూడా పొతే తనకు ఆధారం ఉండదని ఆందోళన వ్యక్తంచేసింది.

ఇక ఒకప్పుడు రిచ్ గా బతికిన జయచిత్ర పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. అరవై ఏళ్ల వయస్సులో ఎవరైనా క్యారక్టర్ రోల్స్ ఇస్తే బావుణ్ణు అని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అర్జున రెడ్డి ఫెమ్ షాలిని పాండే తమిళ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదల్ చిత్రంలో ఓ చిన్న రోల్ వేస్తోంది.నిజానికి ఆమె చివరిసారిగా 2013లో భానుయుద్ధం అనే తమిళ చిత్రంలో నటించి, మళ్ళీ ఇన్నాళ్లకు తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి రావడం చిత్ర వర్గాల ప్రముఖులను ఆశ్చర్యంలో ముంచేసింది.

Comments

ఒక్కపుడు స్టార్ హీరోయిన్ జయచిత్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా| Actress Jayachitra Personal Life

posted onJuly 11, 2018
by sumantv