వైరల్ గా మారిన ఓభార్య తెలివి ఏం చేసిందో చూడండీ.?| Wife And Husband Relationship Problems Real Story

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ భార్య తెలివి.. భర్తకు ఎంత షాక్ ఇచ్చిందో చూడండి.?

  మన భారతదేశంలో అత్యంత ప్రాదన్యమైంది, పవిత్రమైన బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక వివాహ బంధమే.. అమ్మయికి పెళ్లీడు రాగానే ఒకమంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసి తమ బాద్యత దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు.. అందుకోసం ఎక్కువ మంది తెలిసిన బందువుల్లో తమ పిల్లను ఇస్తే ఎప్పుడు కళ్ళముందే ఉంటుంది కదా.. అని ఆశతో తెలిసిన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తుంటారు... ఇక మరికొందరు మాత్రం సదురు వ్యక్తి గుణగనాలు, తమ కూతురిని ఆనందంగా చూసుకుంటాడు అన్న నమ్మకం... ఫ్యామిలి బ్యాగ్రౌండ్ నచ్చితే చాలు సదురు వ్యక్తితో బంధుత్వం గురించి పెద్దగా ఆలోచించారు..

  ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలమంది మాత్రం తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదనలేకా.. వాళ్ళు ఏం చేసినా మనమంచికే కదా అని వారు చూపించిన బాటలోనే నడుస్తారు.. ఒక్కసారి మేడలో తాళి పడితే చాలు ఆక్షణం నుండి జీవితం మొత్తాన్ని తన భర్తకే అర్పిస్తుంది ఆడది.. అంత గొప్ప మనసున్న భార్య, భర్త ఏం చెప్పినా వింటుంది.. కాని ఏం చెప్పినా వింటుంది కదా అని... ఏదో ఇంట్లో పనిమనిషిలా పడుతుంది అంటే మాత్రం అస్సలు ఊరుకోదు.. అలాంటి ఘటననే ఈమధ్య హైదరాబాద్ నగరంలో జరిగింది.. దారితప్పి తప్పుడు మార్గంలో నడుస్తున్న తన భర్తకు అతడే ఊహించని షాక్ ఇచ్చి మనోడికి చెమటలు పట్టించింది.. పైగా తన భార్తకిచ్చిన షాక్ ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది..

   ఆమె చేసిన పని అందరికి నచ్చడంతో సూపర్ నందిని గారు అంటూ ఆమెపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు... దాంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది... వివరాల్లోకి వెళ్తే.. “మలక్ పెట్” ప్రాంతానికి చెందినా “నందిని” అనే అమ్మాయి “సాప్ట్ వేర్” ఉద్యోగం చేస్తుంది.. కొన్ని కారణాలవల్ల పేరు మర్చి చెబుతున్నాం.. “నందిని” నేటి కాలం అమ్మాయిల్లా కాదు.. ఇప్పటివరకు ఎంతమంది అబ్బాయిలు ప్రేమా ప్రేమా వెంటపడ్డ ఒక్కరికి కూడా YES చెప్పలేదు.. తన స్నేహితులు ఎవ్వరు అడిగినా “నాపెళ్లి నిర్ణయం నా తల్లిదండ్రులకే వదిలేసా” అని చెప్పేది.. ఉద్యోగం, స్నేహితులు, ఫోన్ తో ఎప్పుడు ఆనందంగా గడిపే నందినికి.. ఒకరోజు “నీకు పెళ్లి కొడుకును చూస్తున్నాం తల్లి” అని చెప్పారు ఆమె తల్లిదండ్రులు..

  పెళ్లి అనగానే ముందు కొంత భయపడినా జీవితంలో ఎలాగు పెళ్లి చేసుకోవాలి తప్పదు కాబట్టి సరే అనేసింది... దాంతో తెలిసిన బంధువుల్లో అలాగే మ్యాట్రిమోనిల్లో కుడా చూసారు.. చివరికి ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసారు.. నందినికి కుడా అతడు బాగా నచ్చాడు.. దాంతో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంగరంగా వైభవంగా పెళ్లి జరిగింది.. అనిమున్ కుడా అయిపొయింది.. అప్పుడే ఒకరోజు భర్త ఆమెతో నేను జాబ్ చేస్తున్నా కదా నువ్వు ఇంట్లోనే ఉండొచ్చుకదా ? అన్నాడు.. భర్త చెప్పడంతో సరే అనేసి జాబ్ రిజైన్ చేసింది.. ఆ తరువాత నీ ఫోన్ నంబర్ మార్చేయాలి అన్నాడు దానికి కుడా సరే అని నంబర్ మార్చేసింది.. అక్కడితో ఆగకుండా “సోషల్ మీడియా”లో చాటింగ్ లు, స్టైలిష్ డ్రెస్సులు, బ్యూటి పార్లర్ లు అన్ని వదిలేసి కేవలం ఇంటికే పరిమితం కావలి అన్నాడు.. ముందు కాస్త ఇబ్బంది పడ్డ భర్తకోసం అన్ని వదిలేసింది నందని..

   ఆఫీస్ పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండే ఆమె భర్త వారంలో రెండు లేదా మూడుసార్లు పార్టీల పేరుతో ఇంటికి చాల లేట్ గా వచ్చేవాడు.. అలా ఒకరోజు బాగాతాగేసి ఇంటికి వచ్చాడు.. ఏం చేస్తున్నాడో కుడా తెలియని పరిస్థితిలో ఉన్న అతడి వచ్చి రాగానే బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.. అప్పుడే అతడి ఫోన్ కి “వాట్స్ ఆప్” లో ఒక మెసేజ్ వచ్చింది.. “ఇప్పుడే ఇంటికి వెళ్ళాను... నువ్వు మంచిగా వెళ్ళవా..? హ్యాపీ గా పడుకో ఐ లవ్ యు” అని ఆ మెసేజ్ పెట్టింది ఒకమ్మాయి.. అది చూసినా నందనిని రాత్రంతా నిద్ర రాలేదు.. తన భర్త చెడుతిరుగుళ్ళు తిరుగుతున్నాడు అని కన్నీళ్ళు పెట్టుకుంది.. ఉదయం భర్త లేవగానే మెసేజ్ చూపించి “ఎవరీ అమ్మాయి” అని నిలదీసింది.. అందుకు అతడు ఏమాత్రం బయటపడకుండా ఆమె నా మాజీ లవర్.. నిజానికి ఆమెనే పెళ్లి చేసుకోవాల్సింది.. కాని కొన్ని కారణాలవల్ల నిన్ను చేసుకున్నా అంతే అనేసాడు.. దాంతో “సరే అయ్యిందేదో అయ్యింది. 

 ఈ క్షణం నుండి ఆ అమ్మాయిని మర్చిపో” అని భర్తకు నచ్చజేప్పే ప్రయత్నం చేసింది.. అయినా అతడు వినాలేదు.. నీకంటే నాకు ఆమె ముఖ్యం అనేసాడు.. దాంతో ఏం చేయాలో అర్ధం కాని నందిని బాగా ఆలోచించింది.. తన తల్లిదండ్రులకు చెబితే గోడవలవుతాయ్.. అవసరమైతే విడాకులు తీసుకోమంటారు అని బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.. మరుసటి రోజు నుండి జాబ్ కి వెళ్ళడం మొదలు పెట్టింది.. ఫోన్ లో మల్లిపాత నెంబరే వేసుకుంది.. సోషల్ మీడియాలో చాటింగ్ లు, స్టైలిష్ డ్రెస్సులు, బ్యూటి పార్లర్లు అన్ని మల్లి మొదలు పెట్టింది.. దాంతో అదేంటి వద్దన్నా పనులు మల్లి ఎందుకు చేస్తున్నావ్ అన్నాడు భర్త.. అందుకు ఆమె ఓకే ఒక్క సమాదానం చెప్పింది.. “నా జాబ్, నా లైఫ్ స్టైల్, మా అమ్మానాన్న, స్నేహితులు అందర్నీ వదులుకొని నీదగ్గరకు వచ్చాను..

  నీకోసం నేను ఇన్ని చేస్తే నాకోసం ఆ అమ్మాయిని మర్చిపొమ్మంటే.. మర్చిపోను అన్నావ్... అలాంటి నీకోసం నా ఆనందాలని ఎందుకు వదులుకోవాలి.. ? అందుకే ఈరోజునుండి నా స్టైల్లో నేను జీవించాలి అనుకుంటున్నాను... మరో విషయం నాకు కుడా ఒక మాజీ లవర్ ఉన్నాడు.. అతడితో మల్లి చాటింగ్ చేస్తున్నాను.. అవసరం అయితే పార్టీలకు కుడా వెళ్తాను” అని తన భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది నందిని.. దాంతో ఏం చేయాలో తెలియని అతడు ఆరోజునుండి తన భార్య ఎక్కడికి వెళ్తుంది.. ఎవరితో చాట్ చేస్తుంది.. అంటూ తన ప్రేయసిని పక్కన పెట్టిమరీ ఆమెనే ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు.. ఎంత ప్రయత్నించిన అతడికి ఏ ఒక్క ఆధారం కుడా దొరగలేదు.. అందుకంటే ఆమెకు అసలు మరో బాయ్ ఫ్రెండ్ ఉంటే కదా ? అలా రెండు నెలలు ఆమె వెంటా పిచ్చోడిలా తిరిగాడు.. కాని భార్యలో ఏ చిన్న మిస్టేక్ కుడా కనిపించలేదు.. అలా అతడికి తెలియకుండానే తన ప్రేయసిమీద ఉన్న ప్రేమ కాస్త తన భార్య మీదకు వచ్చేసింది..

  అలా భర్తలో మార్పు గమనించిన నందిని ఒకరోజు అసలు నిజం చెప్పింది.. నిజానికి నాకంటూ బాయ్ ప్రేన్స్ ఎవ్వరు లేరు.. మీరే నా బాయ్ ఫ్రెండ్ అండ్ అస్బెండ్.. మీరు తప్పనాకు మరో ప్రపంచం లేదు.. కేవలం నిన్ను మార్చాలనే ఇలా చేశా అని నవ్వుతు చెప్పింది.. దాంతో ఇంత ప్రేమించే భార్యను కాదని మరో అమ్మాయితో వెళ్ళడం తప్పని.. చివరికి అతడే తన ఫోన్ నంబర్ మార్చుకొని భార్యతో ఆనందంగా జీవిస్తున్నాడు.. ఈ విషయాన్నీ స్వయంగా ఆ అమ్మాయే తన “పేస్ బుక్” పేజీలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నందిని చేసిన ఆ మంచిపనికి నేటిజన్స్ ఆమెపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.. మరీ “నందిని” తన భర్తకు ఇచ్చిన షాక్ పై మీ అభిప్రాయం ఏంటి ? 

Comments