సముద్రంలో దారి తప్పిపోయాడు.. 76 రోజుల తరువాత? | Forgot the way in the ocean After 76 Days? | Sumantv

టైటిల్: సముద్రంలో తప్పిపోయి, దీవులకు చేరుకున్న 76రోజులపాటు నరకయాతన అనుభవించి చివరికి యింటికిచేరుకున్నాడు...

  ఆయనో ప్రముఖ రచయిత,జర్నలిస్ట్ మరియు ఫిలాసఫర్ ...వీటన్నింటికీ మించి నావల్ ఆర్కిటెక్చర్ విద్యని అభ్యసించిన గ్రేట్ పర్సన్.పడవలు తయారు చెయ్యడమంటే ఆయనకు చాలా యిష్టం. అంతేకాదు పడవల తయారీలో నిపుణుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కూడా .అలాంటి ఆ వ్యక్తి స్పెయిన్ లో జరిగే పడవల పోటీలో పాల్గొనాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా,తన పడవతో కలిసి సముద్రంలోకి చేరుకున్నాడు.పోటీ మంచి, రసవత్తరంగా సాగుతుండగా అకస్మాత్తుగా వచ్చిన తుఫానులో చిక్కుకున్నాడు. పడవ దెబ్బతినడంతో సముద్రం మధ్యలోనే యిరుక్కుపోయాడు. అక్కడనుంచి ఒకదీవికి వెళ్లి చిక్కుకుపోయి, కొన్నాళ్లపాటు  నరకయాతనని అనుభవించి ప్రాణాలు నిలబెట్తుకొని, చివరికి అక్కడ్నుంచి బయటకు రాగలిగాడు.ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా...? అతనే  స్టీవెన్   కల్ హాన్.

  అమెరికాకు చెందిన కల్ హాన్ కి పడవపోటీలంటే చాలా యిష్టంకావడంతో స్పెయిన్ లో జరిగే పడవపోటీల్లో ఎలాగైనా సరే పాల్గొనాలని భావించాడు.వెంటనే తనపడవిని తీసుకొని  సముద్రంలోకిచేరుకున్నాడు.పడవపోటీలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.సెయిలర్లు నువ్వానేనా అన్నట్టుగా ఒకరుకొకరుపోటీపడి పడవ పోటీల్లో పాల్గొంటున్నారు.సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో  ఉరుములు,మిలలమిలా మెరుపులు.ఆ మెరుపులనుంచి చిరు జల్లులు. ఆ జల్లులుకాస్తా పెద్దపెద్ద చినుకులుగా మారి చూస్తుండగానే పెనుతుఫానుగా మారి పడవపోటీదారులందరినీ కకావికలం చేసేసి, వారందరినీ తలోదిక్కుకీ నెట్టేసింది.ఆ తుఫాను దాటికి  ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది శవాలై నీటిమీద తేలియాడారు. కల్ హాన్ పడవమొత్తం డ్యామేజీ అయిపోయింది.కానీ నీటిపై తేలియాడుతున్న కల్ హాన్ ఆ పడవని మాత్రం వదిలిపెట్టలేదు.అతనికి కొద్దిగ ఈత తెలిసి ఉండడంతో పడవపట్తుకొని,అలా ఈదుకొంటూ ప్రయాణిస్తూ వెళ్తున్నాడు.ఎటువెళ్తున్నాడో  తెలియదు.

   భయంకరమైన అలల దాటికి అతను ఎటువెళ్తున్నాడో తెలియదు.కానీ ప్రాణాలు   బిగబట్టి, భయం వెన్నులోకి రానీయకుండా మొక్కవోనిధైర్యంతో ఆ అలలు ఎటువైపుకి తీసుకెళ్తుంటే అటువైపుకి వెళ్తూ,చివరికి ఆఫ్రికాలోని మొరాకోకి దగ్గరలో ఉన్న ఒక  దీవికి చేరుకున్నాడు. మెల్లగా ఒడ్డుకి చేరుకొని,మొరాకో దీవులకివెళ్లాడు.అది నిర్మానుష్య ప్రదేశం.ఆ సమయంలో అతనికి తినడానికి తిండిలేదు.అయినా సరే మనసులో మాత్రం బ్రతికి తీరాలనే ఆశ.సాయంచేసే దిక్కు లేదు..అయినా ప్రాణాలతో తిరిగి వెళ్లగలననే ధైర్యం మాత్రం గుండెల్లో అలాగే నిలిచి ఉంది.ఆ దీవి మొత్తం వెదికాడు.ఎక్కడా కనీసం తినడానికి తిండిగానీ పండ్లుగానీ దొరకలేదు.తాగడానికి గుక్కెడు నీరు కూడా లేవు.

   ఆ  సమయంలో చెట్లపైనున్న ఆకులే అతనికి ఆహారం. వాటితోనే పొట్తనింపుకొనేవాడు. సముద్రపునీరు తాగడానికి పనిచెయ్యవు కాబట్టి తాగడానికి  నీళ్లులేక  నీళ్ళు తాగకుండా రోజుల తరబడి పస్తులుండేవాడు.వర్షం వచ్చినప్పుడు  ఆ నీటిని  పట్టుకొని,భద్రపరచుకొని  ఆ నీటినే   తాగేవాడు. అప్పుడప్పుడూ సముద్రపు చేపల్నీ,పక్షుల్నీ పట్టుకొని, తింటూ ఉండేవాడు.అలా ఎన్నో కష్టనష్టాలకోర్చి,76 రోజులపాటు ఆ దీవిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు.అలా జీవించిన క్రమంలో పాడైపోయిన తనపడవని బాగుచేసుకొని,ఇక  అక్కడ ఉండలేక ఆ పడవని తీసుకొని  సముద్రములో ప్రయాణం మొదలుపెట్టి, అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ, వెస్టిండీస్ దీవులకి చేరుకున్నాడు కల్ హాన్.ఆ దీవుల్లో ఉన్న అతన్ని  చూసిన కొందరు జాలర్లు అతన్ని రక్షించి తీసుకెళ్లగా,అక్కడ్నుంచి అతను అమెరికా చేరుకున్నాడు.

   కల్ హాన్ స్వతహాగా రచయిత అయినందువల్ల, అలా తాను సముద్రంలో తప్పిపోయి,76 రోజులపాటు  మొరాకో దీవుల్లో అనుభవిన దుర్భర పరిస్థితిని వివరిస్తూ 76  రోజులపాటు  తాను అనుభవించిన కష్టాల్నీ,భయానక పరిస్థితుల్నీ  తెలీయజేస్తూ  అడ్రిఫ్ట్ అనే పేరుతో ఒక నవలని రాశాడు.2012లో హాలీవుడ్ లో వచ్చిన లైఫ్ ఆఫ్ ఫై అనే సినిమాని కల్ హాన్ రాసిన నవల ఆధారంగానే నిర్మించినట్టుగా తెలుస్తోంది.ఈ నవలలోని కొన్ని సన్నివేశాల్ని ఆ చిత్రంలో ఉన్నవి ఉన్నట్టుగా తెరకెక్కించడం జరిగింది. అనుభవం ఎన్నో పాఠాల్ని నేర్పుతుందనే నానుడిని నిజంచేస్తూ,ఎన్నో కష్టాల్ని అనుభవించిన కల్ హాన్ చివరికి అమెరికా చేరుకొని,తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.ఇదంతా చూస్తుంటే కల్ హాన్ ని ఒక పోరాట యోధునిగానూ,కష్టాల్ని సైతం ఎదురించి చూపించిన ధీరుడిగానూ చెప్పవచ్చు. కల్ హాన్.. నిజంగా నీ జీవితం ఎంతోమందికి ఆదర్శం...కష్టాల్లో ఉన్నవారు నీ గురించి తెలుసుకుంటే ఆ కష్టాల్ని యిష్టంతో దాటేస్తారు.... తినడానికి తిండి.తాగడానికి నీళ్లు,కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా,బ్రతకడమెలాగో నేర్పించి చూపించిన ధీరుడివి నీవు...నీ బాటలో పయనిస్తే జీవితంలో ఫెయిల్ అయ్యేవాళ్లు ఎవ్వరూ ఉండరు...  హ్యాట్సాఫ్ కల్ హాన్ ...

Comments