టాలీవుడ్ చీకటి దందాని బయటపెట్టిన కలర్స్ స్వాతి | Colors Swathi Shocking Comments On Cine Industry

   టాలీవుడ్ చీకటి దందాని బయటపెట్టిన కలర్స్ స్వాతి |

   కలర్స్ స్వాతి గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో. ప్రాయం నుంచే నటన మొదలు పెట్టిన ఈ అమ్మడు పలు విజయవంతమైన సినిమాల్లో   విభిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్గా సైతం నటించింది. అయితే, టాప్ హీరోల సరసన మాత్రం అవకాశాలు దక్కించుకోలేక పోయిన స్వాతి ఒకరిద్దరు చిన్న హీరోలతో చేసి హీరోయిన్గా తనకూ హిట్లు వస్తాయని నిరూపించింది. అంతటితో ఆగకుండా త్రిపురఅంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాతో పలకరించింది. అదికాస్త అమ్మడుకు హిట్ ఇవ్వకపోవడంతో దాదాపు చాప చుట్టేసింది.తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.

   ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, సాధారణంగా పవర్ స్ట్రగుల్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది. వర్క్ ప్లేస్‌లో ఎందుకు ఉండదు? ఎవరూ డైరెక్టుగా మాట్లాడరు. చాలా తెలివిగా, స్మూత్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని తెలిపింది. బేసికల్లీ... 'నో' చెబుతాం. అంతే... 'ఆ అమ్మాయితో వర్క్ చేయడం చాలా కష్టమండీ! ఆ అమ్మాయి అంత ఫ్రెండ్లీ కాదండీ!' అని వీళ్లు ఏదేదో చెబుతారు. హ్యూమన్ మెంటాలిటీ అది! మనం ఏం చేసినా మనుషులు మాట్లాడతారు. సాధారణంగా అమ్మాయి క్యాస్టింగ్ కౌచ్‌కి 'యస్' చెప్పినా... 'నో' చెప్పినా... ఆమె గురించి మాట్లాడటం మానరని చెప్పుకొచ్చింది.  అంతేకాకుండా, ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే సినీ ఇండస్ట్రీలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది కూడా క్యాస్ట్ ఫీలింగ్ టైపే.

    'నేను బ్రాహ్మిణ్ లేదా చౌదరి లేదా మరో క్యాస్ట్! మీది సేమ్ క్యాస్ట్ కదా. మీ సినిమాలోకి నన్నే తీసుకోండి' అన్నట్టుంది. అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసినవాళ్ల ఫ్రస్ట్రేషన్ అర్థం అవుతుంది. కానీ, ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదన్నారు. సినిమా అనేది సీరియస్ బిజినెస్. నిర్మాతలు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఆశిస్తారు. వాళ్లు నువ్వు తెలుగమ్మాయివో? మంచి అమ్మాయివో? అని అవకాశాలు ఇవ్వరు. ఒక పాత్ర తెలుగమ్మాయి మాత్రమే చేయగలదు, తెలుగమ్మాయి అయితేనే న్యాయం చేస్తుందని అంటే వేరే విషయం. కానీ, ప్రతి సినిమాలోనూ అవకాశం ఇవ్వాలని అనుకోవడం సరికాదని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అయినా అందులో హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం ఉంటుందన్నారు. ముఖ్యంగా హీరోయిన్లపై జనానికి ఉన్న అభిప్రాయం మారాలన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారని అవి తనను చాలా బాధించాయన్నారు. అష్టా చెమ్మా సినిమా టైంలో హీరో నానితో తనకు ఎఫైర్ ఉన్నట్లు చాలా రాతలు రాశారని.. అంతకు ముందు అల్లరి నరేష్‌తో రీసెంట్గా నిఖిల్‌తో ఎఫైర్ నడిపినట్లు రకరకాల వార్తలు రాశారని.. ఇలాంటి తప్పుడు రాతలు రాసేటప్పుడు ఆమెకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్లు బయట తిరగాలని ఆలోచించరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది స్వాతి.

Comments