మూత్రం ఆపుకుంటున్నారా..? ఏమవుతుందో తెలుసా..? || What happens When You Hold Your Urine || Sumantv

టైటిల్: మూత్రం ఎక్కువ సేపు ఆపి ఉంచితే ప్రాణాలు పోతాయా...?

 మనిషి  ఏది ఆపుకున్నా...మూత్రంవచ్చినప్పుడు ఆపుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.ఎందుకంటే మూత్రం అనేది,మనశరీరంలో  రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. అది మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి అక్కడినుంచి,బయటకు పోతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే మన ఒంటిలోని చెత్తని ద్రవ పదార్థం రూపంలో బయటకి పంపడాన్నే మూత్ర విసర్జన అంటాం... కొన్ని రకాల జంతువులతోపాటు మనుషులు కూడా ఈ మూత్రాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉండాలి.అలా విసర్జించకపోయినట్లైతే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.ఈ క్రమంలో అసలు మూతరాన్ని విసర్జించకపోయినట్లైతే ఎలాంటి  అనర్థాలు సంభవిస్తాయో తెలుసుకుందాం....  

 మనలో చాలామంది ఏదైనా పనిలో ఉన్నప్పుడుగానీ,సినిమా చూస్తున్నప్పుడు గానీ మూత్రం వచ్చినా,దాన్ని అలాగే ఆపుకుంటారు తప్ప మూత్రవిసర్జన చెయ్యరు. అలాగే నిద్రలో కూడా మూత్రం వచ్చినా బద్ధకంగా దాన్ని అలాగే తెల్లారే వరకూ ఆపుకుంటారు.కానీ అలా చెయ్యడంవల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయని నిపుణులైన వైద్యులు చెబుతున్నారు.నిజానికి మూత్రం అంతా మన బ్లాడర్ లోకి వచ్చి ఉండిపోతుంది.దాన్ని ఎప్పటికప్పుడు విసర్జించకుండా ఉన్నట్లైతే,బ్లాడర్ మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది.ఎందుకంటే మన బాడీలోని ట్యాక్సిన్స్ క్లీన్ చేసేదే మూత్రం.ఇది కిడ్నీల్లోనుంచి బ్లాడర్ లోకి వచ్చి చేరుతుంది.అలా వచ్చి చేరినప్పుడు అది బాగానిండితేనే మనకి మూత్రానికి వెళ్లాలనిపించి,అప్పుడే  మూత్రానికి వెళ్తాం.అలా నిండినప్పుడే మూత్రం బయటకి వస్తుంది.అలా మూత్రం వస్తుందని అనిపించగానే బ్లాడర్ నిండిపోయిందని  అర్థంచేసుకొని,మూత్రానికి వెళ్లాలి.

  జనరల్ గా మనుషుల బ్లాడర్ 400 నుంచి 600 మిల్లీ లీటర్ల వరకూ మూత్రాన్ని ఉంచుకొనే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎక్కువ మూత్రం బ్లాడర్ లోకి చేరితే బ్లాడర్ మీద ఒత్తిడిపెరుగుతుంది. అప్పటినుంచి మీరు ఎంతసేపు ఆపుకున్నా, అంతసేపూ మీ బ్లాడర్ ఒత్తిడికి గురి అవుతూనే ఉంటుంది.కాబట్టి బ్లాడర్ మీద ఒత్తిడిపెంచే పనులు చెయ్యకుండా ఎప్పటికప్పుడు మూత్రాన్ని విసర్జిస్తూ ఉండాలి.ఒక వేళ అలా మూత్రానికి వెళ్లకపోయినట్లైతే ఎటువంటు అనర్థాలు సంవిస్తాయంటే, మన బ్లాడర్ నిండిపోయిందనే సంకేతాన్ని బ్లాడరే మన మెదడుకు పంపిస్తుంది.అలా పంపిన వెంటనే మూత్రానికి వెళ్లి,బ్లాడర్ ని ఖాలీ చెయ్యాలి.అలా చెయ్యకపోతే మలినాలు అలాగే మీశరీరంలో ఉండిపోయి,బ్లాడర్ పై ఒత్తిడి పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అంటే బ్లాడర్ లో మూత్రం ఎక్కువసేపు నిల్వ ఉంచడంవల్ల ఆ మూత్రం క్రమంగా రాళ్లుగా మారి,అవి కిడ్నీలో ఉండిపోతాయి.వాటినే  కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డంగా చెబుతారు.

  ఈ  సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే మహిళలు ఎక్కడబడితే అక్కడ మూత్రవిసర్జన చెయ్యడానికి వీలుపడదుకాబట్టి,మహిళల్లోనే అలాంటి సమస్యలు  ఎక్కువగా తలెత్తుతాయి.ఇక స్త్రీపురుషులిద్దరిలోనూ అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డం వల్ల,నడుంనొప్పి,మూత్రంలో మంటగా అనిపించడం,మూత్రంలో రక్తం పడ్డం,జ్వరం రావడం,పురుషుల్లో అయితే అంగం  నొప్పిగా అనిపించడంవంటి సమస్యలు సంభవిస్తాయి.మెల్లమెల్లగా కిడ్నీ పాడైపోయి,పనిచెయ్యకుండా  పోతుంది. అలా కిడ్నీ పూర్తిగా పాడైపోయినట్లైతే మీరు చావుకి దగ్గరగా వెళ్లినట్టే లెక్క.మరో ముఖ్య  విషయం ఏమిటంటే మీరు మూత్రాన్ని ఎంత ఎక్కువసేపు బ్లాడర్ లో ఆపి ఉంచితే అన్ని బ్యాక్టీరియాలు బ్లాడర్ లో ఉత్పత్తి అవుతాయి.అవి క్రమ క్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. బ్యాక్టీరియాలు పెరిగేకొద్దీ యూరినరీ ఇన్ ఫెక్షన్స్ అంత ఎక్కువగా పెరిగి,మూత్ర విసర్జన సమయంలో మంట మరియు దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కమాటలో  చెప్పాలంటే మూత్రాన్ని ఎక్కువసేపు ఉంచినట్లైతే మీచేతులారా మీ కిడ్నీనిమీరే పాడైపోయేలా చేసుకొని మీచావుని మీరే కొని తెచ్చుకున్నట్టు లెక్క.కాబట్తి ఎట్తిపరిస్థితుల్లోనూ మూత్రంవచ్చినప్పుడు ఆపుకోకుండా మూత్రానికి వెళ్లడం అన్ని విధాలా శ్రేయస్కరమని   డాక్టర్లు సలహా యిస్తున్నారు.కాబట్తి గుర్తుంచుకోండి..

Comments