విజయనగరంలో బయటపడ్డ భారీ ఓడ.. లక్షల కోట్ల నిధి మనదే || Treasury Found In Ship Under Ocean || Sumantv

టైటిల్: సముద్రంలో లక్షల కోట్ల నిధితో టైటానిక్ ను మించిన ఓడ...​.. 

  వందేళ్ల క్రితం టైటానిక్ అనే పేరుగల ఓడ   వేలమంది ప్రయాణికులతో సముద్రంలో ప్రయాణిస్తూ, ఆ నౌక ఓ మంచు ఫలకాన్ని ఢీకొని  సముద్రంలో మునిగిపోయిన సంగతి మనం విన్నాం... నాటి ఆ దుర్ఘటనలో వేయి మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారనే సంగతి గురించి మనందరికీ తెలిసిందే.  అయితే టైటానిక్ కంటే ముందు, ఆ తర్వాత కూడా ఎన్నో  భారీ ఓడలు సముద్రంలో మునిగిపోయి,భారీగా ప్రాణ నష్టం జరిగిన  సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని నౌకల్లో భారీగా నిధినిక్షేపాలు ఉన్నాయని, అవన్నీ సముద్ర గర్భంలో చిక్కుకుపోయాయనే వార్తలు ఇప్పటికీ   ప్రచారంలో ఉన్నాయి.  రీసెంటుగా మన బంగాళాఖాతంలో కూడా ఓ భారీ నౌకకి సంబంధించిన  శిథిలాలు బయటపడ్డాయని తెలుస్తోంది.

  ​శిథిలాలను పరీక్షించిన తర్వాత,కొందరు శాస్త్రవేత్తలు,ఈ నౌక వందేళ్ల క్రితమే సముద్రంలో మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే,  విశాఖపట్టణానికి  చెందిన ఒక  అడ్వెంచర్ సంస్థ గతకొంతకాలంగా సాగర జలాల్లో అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఆ అన్వేషణలో భాగంగా ఆ సంస్థ  సముద్రంలో జీవజాతులను సులభంగా  గుర్తించడంకోసం  స్కూబా డైవింగ్ ద్వారా  అన్వేషిస్తుండగా,  ఆ అడ్వెంచరిస్టులకు విజయనగరం జిల్లా చింతపల్లి తీరానికి కొద్ది దూరంలో, సముద్రంలో బాగా లోతున ఒక  భారీ ఓడకి  సంబంధించిన  శిథిలాలు కనిపించాయి.

    ఆ ఓడ నాటి   టైటానిక్ ను తలదన్నేలా ఉందని ఆ అడ్వెంచరిస్టులు చెబుతున్నారు. దీనిని వారు బాగా పరిశీలించిన తర్వాత,ఈ ఓడ  దాదాపు 150 ఏళ్ల క్రితం తుపాను కారణంగా ఇక్కడ మునిగిపోయి ఉంటుందని వీళ్లు  అంచనా వేస్తున్నారు.ఇంకా లోతుగా ఆ ఓడని పరిశీలించిన ఆ అడ్వెంచరిస్టు లు, అప్పట్లో బ్రిటీష్ వాళ్లు గుంటూరు జిల్లాలో లభ్యమైన అత్యంత అరుదైన వజ్రాలను ఈ ఓడలోనే తరలించడానికి ప్రయత్నించి ఉంటారనీ,అలా  ఇంగ్లాండ్ తరలించే ప్రయత్నంలో  తుపాను సంభవించగా,వాళ్లు ఆ  ఓడను తిరిగి తీరం వైపునకు మళ్లించే ప్రయత్నంలో ఇది మునిగిపోయి ఉంటుందని అడ్వెంచరిస్టులు భావిస్తున్నారు.  అయితే నాటి బ్రిటీషుకాలంలో సముద్రంలో మునిగిపోయిన ఈ ఓడలో విలువైన ఎన్నో వజ్రాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.వాటి ఖరీదు నేడు  లక్షల కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

   విశేషం ఏమిటంటే,ఆ ఓడ మునిగిపోయిన ప్రాంతంలో రాత్రి వేళల్లో సమద్రంనుంచి  జిగేల్మనిపించేలా కాంతులు వెదజల్లుతుంటాయట.కొందరైతే   ఆ కాంతులు ఓడలో ఉన్న అతి పెద్ద వజ్రాల నుంచి వస్తున్నవేననీ, అవి పెద్ద బండరాళ్లంత సైజులో  ఉన్న మేలిమిజాతి వజ్రాలు అయ్యుండొచ్చనిఅంటున్నారు.ఏదేమైనా బ్రిటీషువారు ఆ నాడు ఇంగ్లాండుకి తరలించుకుపోవాలనుకున్న లక్షలకోట్లుచేసే వజ్రాలు తిరిగి మనకే చెందడం ఆనందించదగ్గ విషయం... అయితే ఆ వజ్రాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళకుండా  ప్రభుత్వం చర్యలుతీసుకొని, మన జాతి సంపద అయిన ఆ వజ్రాల్ని ప్రజా సంక్షేమంకోసం వెచ్చిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు... సముద్రంలో బాగా లోతుగా వెతికితే ఇలాంటివి ఇంకెన్నో  ఉంటాయనీ,ఆ దిశగా ప్రభుతం  ప్రయత్నాలు మొదలుపెడితే మంచిదనీ,ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే,మనదేశం అతివేగంగా అభివృద్ధిచెందిన దేశాల జాబితాలోకి చేరుకుంటుందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు... దీన్నిబట్టి చూస్తే నాటి బ్రిటీష్ వాళ్లు మనదేశంనుంచి ఎన్ని లక్షలకోట్ల విలువచేసే సంపదను తరలించుకొని వెళ్లిపోయారో అర్థమవుతోంది.ఆ సంపద మన దగ్గరే ఉండుంటే మనదేశం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి...

Comments