Skip to main content

జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న హైపర్ ఆది | Jabardasth Hyper Aadi Out From Jabardasth Show

   జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న హైపర్ ఆది |

   తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్.   ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు.  ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది.  మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు.  కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.   అప్పుడుప్పుడు కాంట్ర వర్సీలు కూడా జరుగుతున్నాయి.

    జబ్బర్దస్త్ ప్రోగ్రాం కు ఎంత క్రేజ్ ఉందనేది మనందరికీ తెలుసు. బుల్లి తెర పై ఎన్ని ప్రోగ్రాములు వచ్చినా ఈ షో కి వచ్చే ఆదరణ  ఇంకా  ఏ ప్రోగ్రాము కి లేదు ..అందుకే మొదట్లో జబర్దస్త్ ఒక్క గురువారమే ప్రసారం అయ్యేది ..ఈ షో కి వచ్చే ఆదరణ తో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరు తో రెండు రోజులు ప్రసారం చేస్తున్నారు ..అందుకు కారణం జబర్దస్త్ హైపర్ ఆది కోసం ,ఎక్స్ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసం చూసే ప్రేక్షకులు లక్షల్లో వున్నారు ...

   ఈ ప్రోగ్రాం లో నటించిన అందరికి పేరు బాగా వచ్చింది. పేరుతో పాటు రేమ్యునిరేషన్స్, అవకాశాలు అన్నీ బాగా పొందారు. ఇందులో నటీనటులకు అభిమానులు కూడా ఏర్పడ్డారు.ఇప్పుడు ఈ ప్రోగ్రాం నుంచి హైపర్ ఆది వెళ్లి పోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆదికి ప్రేకషకుల ఆదరణ బాగానే ఉంది. అటువంటి ఆది ఎందుకు ఈ ప్రోగ్రాం వదిలి వెళ్ళిపోతున్నాడు అనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.అయితే ఆది ప్రోగ్రాం కి గుడ్ బాయ్ చెప్పడానికి అసలు కారణాలు అంటూ కొన్ని బయటకు వస్తున్నాయి. ఆది స్కిట్స్ ను గమనించినట్లయితే చాల సార్లు ప్రెమెంట్స్ పై పలు సెట్టైర్లు వేయడం వైన్ ఉంటాము .

   ఈ మధ్య ఒక స్కిట్ లో ప్రెమెంట్స్ పై ఒక పంచ్ వేసాడు ...అప్పటి ప్రెమెంట్స్ వేరు ,అప్పటి గృహ ప్రవేశాలు వేరు అని ఇంతకుముందు టీం లీడర్స్ రెమ్యూనరేషన్ గురుంచి మాట్లాడేవాడు ..అయితే ఆది కి ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోవడం లేదు అని ,కొంచం పెంచమని అడిగినట్టు సమాచారం ..దానికి కారణం కూడా లేకపోలేదు ..ఎందుకంటే హైపర్ ఆది స్కిట్ లో పార్టిసిపంట్స్ ఎక్కువగా ఉండడమే కారణం అని తెలుస్తుంది ...అయితే ఇందుకు షో నిర్వాహకుల నుండి ఎటువంటి రెస్పాన్ లేకపోవడం తో జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్టు సమాచారం ..ఆది లేక పోతే షో నడవం చాలా కష్టం అని ప్రొడక్షన్ వారికి కూడా తెలుసు ..కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి మరి ..మీరు హైపర్ ఆది స్కిట్స్ కి ఫాన్స్ అయినా ,ఆది జబర్దస్త్ లో కొనసాగాలి అనుకుంటూ ఉంటే YES అని లేకపోతే NO అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయండి.

Comments

జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న హైపర్ ఆది | Jabardasth Hyper Aadi Out From Jabardasth Show

posted onJuly 10, 2018
by sumantv

Tags

Jabardasth Hyper Aad Jabardasth Hyper Aadi Out From Jabardasth Show Jabardasth Hyper Aadi Skits