ఢీ10 స్టేజ్ పై కామిడి టైమింగ్ తో ఎన్టీఆర్ ని కడుపుబ్బా నవ్వించిన సుధీర్ || Sudheer Comedy with NTR

   ఢీ10 స్టేజ్ పై తన కామిడి టైమింగ్ తో ఎన్టీఆర్ ని కడుపుబ్బా నవ్వించిన సుధీర్..

  జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్ళిన “ఢీ10 గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా ? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని మల్లి బుల్లితెరపై చూస్తామ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.. మరోపక్క “డీ” అభిమానుల్లో అయితే ఎన్టీఆర్ ని చూడడంతో పాటు.. ఈ ఏడాది టైటిల్ గెలిచేది ఎవరు ?... ట్రోపి సాదించే జెట్టు ఏది అంటూ అందరిలో ఉత్కంట మొదలైది.. ఆ ఉత్కంటకు ఊపునిచ్చేలా “డీ” యాజమాన్యం ఇప్పటికే “గ్రాండ్ ఫినాలే” లో ఎన్టీఆర్ ఎంట్రికి సంపందించిన ఒక వీడియో రిలీజ్ చేసింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.. ఆ ప్రోమో చూసినా ఎన్టీఆర్ అభిమానులు... మా దేవుణ్ణి డీ స్టేజ్ పై చూడాలంటే వారంరోజులు ఆగాల మావల్ల కాదు అంటూ.. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..

   ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది.. ఈ బుధవారమే టెలికాస్ట్ అయ్యే డీ పైనల్ ఎపిసోడ్ కి సంబంధించి మరో ప్రోమోను కొన్ని గంటల ముందే రిలీజ్ చేసింది “డీ” యాజమాన్యం దాంతో “డీ10 గ్రాండ్ పినాలే” పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.. ఈ ప్రోమోను చూస్తుంటే టీమ్ లీడర్ గా ఉన్న “సుడిగాలి సుదీర్” గ్రాండ్ ఫినాలే లో అందరికంటే హైలెట్ అయ్యాడని తెలుస్తుంది.. ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమ”తో డ్రెస్ లో పన్నిగా వచ్చిన సుదీర్.. ఎన్టీఆర్ దృష్టిలో పడాలని నానా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు.. అతన్ని గమనించిన ఎన్టీఆర్ “అతడెవరు పాపం కొంచం ముందుకు రమ్మనండి” అనగానే అమాయకంగా స్టేజ్ పైకి వచ్చిన సుదీర్ తారక్ ని కడుపుబ్బా నవ్వించాడు..

   సుదీర్ ని చూడాగానే “మీ కాస్టుమ్ బాగుందండి” అని పంచ్ వేసాడు.. దాంతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.. తరువాత “అద్దాలు లేకున్న.. అవి కళ్ళద్దాలు ఎలా అయ్యయో అర్ధం కావడం లేదు.. అంటే మీ ఉద్యేశం ఏంటి ?” అనగానే యాంకర్ సుదీర్ మద్యలోకి వచ్చి “అద్దాలు ఉంటే ఎవరికైనా కన్నుకోడితే వారికీ కనిపించడం లేదు సార్.. అందుకే” అని వివరణ ఇచ్చాడు.. ఆ తరువాత ప్రభుదేవా మాస్టర్ కి కుడా డ్యాన్స్ నేర్పింది ఇతడే అని శేఖర్ మాస్టర్ చెప్పడం.. ఎన్టీఆర్ కోరిక మేరకు సుదీర్ “మైకేల్ జాక్సన్” స్టెప్ వేయడం ఎన్టీఆర్ ని అడుపుబ్బ నవ్వించాయి.... ఇక ఈ ప్రోమోను చూస్తుంటే “డీ10 గ్రాండ్ ఫినాలే”కు వెళ్ళిన ఎన్టీఆర్ ఎంత ఆనందంగా గడిపాడో స్పష్టంగా అర్ధం అవుతుంది.. మరీ ఎన్టీఆర్ ఈ ఆనందాన్ని పూర్తిగా చూడాలి అన్నా.. అలాగే డీ10 టైటిల్ విన్నర్ ఎవరు ? అనేది తెలియాలి అన్నా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే.. మరీ “డీ10 గ్రాండ్ ఫినాలే” టైటిల్ విన్నర్ ఎవరు అని మీ అభిప్రాయం ? బయట వినిపిస్తున్న పుకార్లు నిజమే అని మీరు నమ్ముతున్నారా ? 

Comments