నన్ను ముఖ్యమత్రిని చేయండంటూ కోర్ట్ కెక్కిన సామాన్యుడు || Shocking Incident In karnataka High Court

నన్ను CMను చేయండి అంటూ కోర్ట్ కెక్కిన సామాన్యుడు..

   అప్పుడప్పుడు మన కళ్ళముందు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయ్.. వాటిని విన్నా.. ఒకవేలా కళ్ళారా చూసినా నోరుతేరవడం తప్ప ఏం చేయలేం.. కారణం అలాంటి ఆలోచన ఇప్పటివరకు ఎవ్వరికీ వచ్చి ఉండదు.. అలాంటి వార్త వింటే ముందు షాక్ అవుతాం తరువాత తల పట్టుకుంటాం.. అలాంటి విచిత్రమే ఈమధ్య కర్ణాటకలో జరిగింది.. ఒక సామాన్యుడు కోర్ట్ లో ఓ పిటిషన్ వేసాడు.. దాని సారాంశం ఏంటంటే “కర్ణాటక రాష్ట్రానికి నన్ను CMను చేయండి.. నన్ను ముఖ్యమత్రిని చేస్తే ఇదిగో ఈ “మేన్యుపెస్టివాల్” ల్లో ఉన్న పనులు అన్ని చేస్తే.. లేదంటే ఈ కోర్ట్ సాక్షిగా నన్ను ఉరి తీయండి అంటూ లికితపుర్వకంగా ఒక పత్రాన్ని జేడ్జ్ చేతిలో పెట్టాడు.. అడిచుసినా జేడ్జ్ వెంటనే షాక్ లోకి వెళ్ళిపోయాడు..

   “ఇదేం కేసు” అంటూ సదురు వ్యక్తిని మందలించే ప్రయత్నం చేసాడు.. కాని సదురు వ్యక్తి “అది నా హక్కు ..అందుకే అడిగా చేస్తారా ? చేయరా ? అన్నది తరువాత విషయం.. కాని నాకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటా అంటూ భిస్మించుకు కూర్చున్నాడు.. దాంతో ఇప్పుడు ఈ సామాన్యుడు పెద్ద సెలబ్రేటి అయిపోయాడు.. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని తీర్థహళ్లికి చెందిన “హరిశ్చంద్ర గౌడ్” తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు... ఆ పిటిషన్ లో ఆ సామాన్యుడు కోరిన డిమాండ్ ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తికరంగా మారింది. నిజానికి అతడు ఒక రాజకీయ నాయకుడు కాదు.. కనీసం ఒక వార్డ్ మెంబర్ కుడా కాదు.. కాని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని తనను తాను పరిచయం చేసుకొని..

   నన్ను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలంటూ కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అతడి వెనకా ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేదు.. పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడా అతడు ఎవరో మాకు తెలియదు.. ఎప్పుడు అతన్ని చూడలేదు.. ఏదో పబ్లిసిటి కోసం అలా చేస్తున్నాడు అంతే.. అతనో పిచ్చోడు అంటూ కొట్టిపడేశారు.. కాని అతడు మాట్లాడేది వింటుంటే మాత్రం కోర్ట్ లో ఉన్న లాయర్ లదే కాదు.. జేడ్జ్ గారి మైండ్ కూడా బ్లాక్ అయ్యింది.. ఎక్కడా చిన్న మిస్టేక్ మాట్లాడకుండా... అన్ని చట్టపరిదిలోనే మాట్లాడుతూన్నాడు.. అందుకే చట్టప్రకారం సదురు వ్యక్తికి ఏ శిక్ష వేయలేని పరిస్థితి.. అలాగని అతడి డిమాండ్ సాద్యం.. అసాద్యం అని చెప్పడం కుడా కోర్ట్ చేతిలో లేదు.. దాంతో ఏం చేయాలో తెలియాకా అతడు ఏంచెబితే అది వింటూ “సరే.. సరే” అనడం తప్ప.. చివరికి “హై కోర్ట్” జేడ్జ్ కుడా ఏం చేయలేకపోతున్నాడు..

   నిజానికి ఇలాంటి విచిత్రమైన కేసులు వస్తే.. కోర్ట్ సమయం వృదా చేసారని కోర్ట్ వారిని మందలిస్తుంది.. కాని ఇక్కడా మాత్రం విచిత్రంగా సదురు వ్యక్తే కోర్ట్ ను మందలించే పరిస్థితి వచ్చింది.. ఒక్కరంటే ఒక్క MLA మద్దత్తు లేకున్నా తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ కోర్టుకు ఎక్కటం ఒక ఎత్తు అయితే.. తనను ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలో వివరణ ఇస్తూ... ఏకంగా ఒక “మేన్యుపెస్టివాలే” తయారు చేయాడు.. అందులో ముఖ్యంగా ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి “కుమారస్వామి”కి స్విస్ బ్యాంకులో వేలాది కోట్ల రూపాయిలు ఉన్నాయని.. తనను కానీ సీఎంను చేస్తే స్విస్ బ్యాంకులో ఉన్న ఆ మొత్తాన్ని రెండే రెండు నెలల్లో వెనక్కి తీసుకొచ్చి రాష్ట్రంలోని రైతులందరి రుణాల్ని మాపీ చేస్తానని హామీ ఇచ్చాడు. అదే కాక ప్రస్తుత ముఖ్యమత్రిలు చేస్తున్న ఏ ఒక్క తప్పు చేయనని..

    CM పదవిని కేవలం ప్రజల బాగుకోసమే ఉపయోగిస్తానని.. నేను కాని.. నాబందువులు కాని చట్టవిరుద్ధంగా ఒక్కరూపాయి సంపాదిస్తే నన్ను ఈ కోర్ట్ సమకశంలోనే ప్రజలందరూ ఉరి తీయాలని.. ఇదిగో అందుకు సంబందించిన అగ్రిమెంట్ అంటూ ఒక లెటర్ కుడా ఇచ్చాడు.. నిజానికి కోర్ట్ ని ఆశ్రయించకముందు మరో విచిత్రం కుడా చేసాడు “హరిశ్చంద్ర గౌడ్”.. ఏకంగా రాష్ట్ర గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకొని “నన్ను సీఎంను చేయాలని విన్నవించుకున్నాడట..” కాని అతడుకుడా మనలాగే పాపం పిచ్చోడు అనుకోని పట్టించుకోలేదట... ఆ కారణంగానే ఇప్పుడు కోర్ట్ ని ఆశ్రయించనని తన వాదనను వినిపించాడు “హరిశ్చంద్ర గౌడ్”.... అతగాడి వాదన విన్న న్యాయమూర్తి ఏం చేయాలో అర్ధం కాక కేసు విచారణను వాయిదా వేశారు. ఇప్పుడు చెప్పండి ఈ విచిత్రమైన, పైగా అసాద్యం కాని ఇతడి డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటి ? సదురు వ్యక్తి ఎందుకు ఇలా కోర్ట్ ని ఆశ్రయించాడని మీరనుకుంటున్నారు.. ఇతడి వాదన వెనకున్న అసలు విషయాన్నీ.. అలాగే నేటి మన రాజకీయాలపై మీకున్న అవగాహనను కుడా కామెంట్ చేయండి..

Comments