షాకింగ్ న్యూస్.! ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్.!Bigg Boss 2 Telugu This Week Elimination | Bigg Boss Telugu2 28th Episode

  షాకింగ్ న్యూస్.! ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్.!

   బిగ్ బాస్ 4వ వారం కూడా విజయవంతంగా పూర్తి కావడానికి రెడీ అయ్యింది. ఈ శుక్రవారం ముగియగానే హోస్ట్ నాని వచ్చేస్తారు. శని, ఆదివారాల్లో ఎలిమినేషన్ మొదలవుతుంది. ఈ సందర్భంగా ఈ వారం  ఎవరూ   ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఈ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ రోజు ఉండే కంటెస్టెంట్  గా గీతామాధురి పేరు వినపడింది. ఎందుకంటే ఆమెనే హౌస్ లో ఎక్కువ తీసుకుంటున్న సెలబ్రెటీ. గీతామాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు గాను రూ.20 లక్షల పారితోషికం డిమాండ్ చేసిందట..

   బిగ్ బాస్ నడిచే కాలంలో అమెరికాలో  పలు ఈవెంట్లు ఆమె ఒప్పుకుందట.. ఆ నష్టం బిగ్ బాస్ టీం భరిస్తామని హామీ ఇవ్వడంతో  హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే 20 లక్షలు పెట్టి తీసుకున్న గీతామాధురి బిగ్ బాస్ హౌస్ లో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. కనీసం యాక్టివ్ గా ఉండడం లేదు. ఎంటర్ టైన్ మెంట్ చేయడం లేదు. పైగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. బిగ్ బాస్ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలిమినేషన్ గురించి చర్చిస్తూ బిగ్ బాస్ ఆగ్రహానికి గురైంది. ఈ మధ్యే జైల్లో కూడా పెట్టారు. అటు ఎంటర్ టైన్ ఇవ్వకుండా.. ఇటు చురుకుగా ఇంటిసభ్యులతో ఉండకుండా చిన్న పిల్ల చేష్టలతో అందరికి విసుగుతెప్పిస్తోంది.కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చివరి దశకు వచ్చింది.   

    అత్యధికంగా 8 మంది నామినేషన్ లోకి వచ్చారు. బాబుగోగినేని, దీప్తి నల్లమోతు, గణేష్, గీతామాధురి, కౌశల్, నందిని, శ్యామల, తేజస్విలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది. ఇందులో అందరికంటే కూడా గీతామాధురికి ఈసారి కత్తి వేలాడుతోందనే ప్రచారం జరుగుతోంది.అయితే అనూహ్యంగా ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ టీం రెడీ అయినట్టు తెలిసింది. అందులో గీతామాధురికి తక్కువ ఓట్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నందినికి తక్కువ వచ్చినట్టు సమాచారం. వీరిద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ ఎలిమినేట్ అయిపోవచ్చని తెలుస్తోంది.సామాన్యుడి కోటా లో గణేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక తేజస్వి, బాబు గోగినేని క్రేజ్ ఎక్కువ.. శ్యామల, దీప్తిలు కూడా వివాదరహితులు కావడంతో వారికి కూడా ఓట్లు పడ్డాయట.. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉంటున్న గీతామాధురి, నందినిలనే ఈ వారం ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది. ఈ శని, ఆదివారాలు కలిస్తే కానీ ఎవరు బయటకు వెళతారో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకూ ఎదురు చూడాల్సిందే..వీరిలో ఖచ్చితంగా నందిని ని ఎలిమినేట్ చేస్తారు ఎందుకంటే గీత మాధురి ని ఒకవేళ ఎలిమినేట్ చేస్తే షో లో పేరు వున్నా సెలబ్రిటీ  ఎవరు వుండరు ..ఇంత ఖర్చుపెట్టి తీసుకు వచ్చిన ఆమె ను 4 వ వరం లో కూడా షో యాజమాన్యం ఎల్మినాటే చేయరు అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు ..అయితే ఈ వారం నందిని ఎలిమినేట్ అవ్వడం వోటింగ్ ప్రకారం ఖాయం అనిపిస్తుంది ...

Comments