నాగబాబు చేసిన వాఖ్యల పై రెచ్చిపోయిన కత్తి మహేష్ |

 నాగబాబు చేసిన వాఖ్యల పై రెచ్చిపోయిన కత్తి మహేష్ |

   హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్పై పలు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కూడా కత్తి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. దీంతో నాగబాబుపై, మెగా ఫ్యామిలీపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రూపొందించిన వీడియోను కత్తి మహేష్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.నాకు వాక్ స్వాతంత్య్రం ఉంది. నేను నా హక్కుల కోసం పోరాడుతున్నా. నా వాక్ స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పే కత్తి మహేశ్.. తనకు తోచినట్లుగా మాటలు అనేయటం తెలిసిందే. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఫోన్ ఇన్ లో శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.                                                                                                            Image removed.

   శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని చేసి కేసు ఎదుర్కొంటున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెగా బ్రదర్ నాగబాబు ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్ ను ఉద్దేశించి నీచుడన్న మాటను వాడారు. దీనిపై కత్తి మహేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నన్నునీచుడంటారా? అంటూ నాగబాబుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగబాబుపై నిప్పులు చెరిగిన కత్తి మహేశ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో కత్తి మహేశ్చేసిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.`నా పేరు కూడా ప్రస్తావించకుండా నన్ను నీచుడిగా అభివర్ణిస్తూ నాగబాబు మాట్లాడిన వీడియోను నేను చూశాను. నాకు చాలా జాలి వేసింది. నేను నీచుడినా? అంత నీచమైన పని నేనేమి చేశాను. ఒక అన్నకు తమ్ముడిగా..                                                                                                             Image removed.

    ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలను దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకోవడం, `జబర్దస్త్`లాంటి షోలో కూర్చుని వెకిలి నవ్వులు నవడం.. ఇవీ మీరు సమాజానికి చేస్తున్న సేవ.హిందువులైన మీరు రాముడి ఆదర్శం గురించి ఎంత పట్టుదలగా ఉంటారో మాకందరికీ తెలుసు. మీ కుటుంబం, అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీకు తట్టుకోవడం కష్టం. మీ సినీ, రాజకీయ జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు కచ్చితంగా వస్తుంది. మీ పతానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. సాధారణంగా నేను వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడేవాణ్ని కాదు. అలాంటి నన్ను, ఓ దళితుణ్ని నీచుడు అంటూ సంబోధించారు. ఎంత అహంకారముంటే అలా చేస్తారో అర్థమవుతోంది. దళితులు మీద దాడి జరుగుతున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు.

   ముస్లింపై దాడి జరుగుతున్నప్పుడే మీరంతా ఏమి చేస్తున్నారు. నా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను` మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరు.. ఆర్ ఎస్ ఎస్.. వీహెచ్ పీ..బీజేపీ.. పరిపూర్ణనంద స్వామిలు బాధ్యత వహిస్తారు""నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ సామాజిక పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. మీరు మీ హద్దుల్లోఉంటే మంచిది" అని కత్తి మహేష్ ఆ వీడియోలో పేర్కొన్నారు...నాగబాబు గారు జబర్దస్త్ లో జడ్జిగాకన్నా .                                                                       Image removed.

   పార్టిసిపెంట్ గా ఉంటే ఇంకా బాగుండేదని ఈరోజు ఒక వీడియో చూసి తెలుసుకున్నానుటీవీల్లోకి వచ్చి ప్రతిఒక్కరూ బెదిరిస్తారు ఏమిటి స్వామీ!! తిరగనివ్వము. తీవ్రపరిణామాలు ఉంటాయి.చూసుకుంటాము. మేము తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలీదు. స్వాములు. భక్తులు. ఈ రేంజి రౌడీలని నాకు తెలీదు. తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక బూతులు లైవ్ డిబేట్స్ లో తిని, ఇప్పటికి కూడా ఒక్క బూతు వాడని మనిషిని నేను.(ఎస్... దగుల్బాజీ బూతు కాదు). అయినా సరే, మూడు రోజుల నుంచి నేను ఒక నీచుడిని. మానసిక రోగిని.పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాడిని. సభ్యసమాజంలో ఉండటానికి అనర్హుడిని.టెర్రరిస్టుని అని ఎందరో మహానుభావులు వాక్రుచ్చుచున్నారు. వీళ్ళని చూస్తోంటే నాకు జాలి వేస్తోంది. రేపటి నుంచీ నేను కొంచెం మారాలి ఏమో అనిపిస్తోంది'' అంటూ కామెంట్స్ చేశాడు. అలానే ఓ సినిమాలో వీడియో పోస్ట్ చేసి కేవలం అగ్ర కులాలకే దేవుడ్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా..? దళితులకు ఆ హక్కు లేదా..? అంటూ ప్రశ్నించారు.

 

Comments