ఢీ10 రాజు టైటిల్ విన్నర్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Helped Raju In Dhee 10 Finale

ఢీ10 రాజు టైటిల్ విన్నర్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ |

   ఈటివిలో క్రేజీ డ్యాన్స్ షో ఢీ పదో సీజన్ గ్రాండ్ ఫైనల్స్ కు చేరుకుంది.సరదాగా సాగిపోతున్న ఢీ10 అంతే అల్లరితో ఫన్నీ టాస్కులతో ఫైనలకి చేరుకోబోతుంది..ఎన్నో ఎలిమినేషన్స్,అద్భుతమైన డాన్సులు జడ్జీల సజిషన్ల తో సాగిన ఈ డాన్స్ ప్రొగ్రమ్ అప్పుడే అయిపోయిందా అనేలా ఫైనల్ ముగింపుకు చేరుకుంది శేఖర్ మాస్టర్, ప్రియమణి, అని మాస్టర్ జడ్జులుగా వ్యవహరించే ఈ డ్యాన్స్ షోలో సుధీర్, రష్మిలు కంటెస్టంట్స్ కు మెంటర్స్ గా చేస్తున్నారు. ప్రదీప్ యాంకరింగ్ లో ఓ పక్క డ్యాన్స్ మజా.. మరోపక్క కామెడీ కిక్ అందిస్తున్న ఢీ-10 కూడా ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది.

   ఇక ఈ షో ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. బుల్లి తెర పై కూడా స్టార్ హీరో లు సత్తా చాటగలరని వైపుంగ్ టైగర్ ఎన్టీఆర్ నిరూపించారు. స్టార్ మా మొదటి బిగ్ బాస్ సీజన్ లో అందరిని మెప్పించి ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఈ ప్రోమో బాగా కట్ చేశారు. సింహాల మధ్య సింహాద్రిగా యంగ్ టైగర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్.టి.ఆర్ రాకతో ఢీ-10 కలర్ ఫుల్ గా మారింది. ఇక ఈమధ్య మిగతా స్టార్స్ తో కలివిడిగా ఉంటున్న తారక్ ఢీ-10 వేదిక మీద చరణ్, మహేష్ లతో తారక్ దిగిన పిక్ చూపించి అలరించారు.

  స్టార్ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అన్న ఆలోచన మానిపించి అందరిని అందరు అభిమానించేలా స్టార్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఢీ-10 ఫైనల్ విన్నర్ కు ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వనున్నారు. ఫైనల్స్ లో రాజు, ప్రదీప్, ఐశ్వర్య, ముకుల్ పాల్గొంటున్నారు.వీరిలో ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారో చూడాలి. ఆల్రెడీ షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ నుండి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం చిట్టి మాస్టర్ కంటెస్టంట్ రాజు ఈసారి టైటిల్ కొట్టినట్టు తెలుస్తుంది. సో రాజు ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా ఢీ-10 టైటిల్ తీసుకోబోతున్నాడు.అయితే రాజు విన్ అవ్వడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక లింక్ వుంది అని చెప్పచు ..అది ఏంటంటే రాజు సెమి ఫైనల్ నుంచి తాను చేసిన ప్రతీ పెర్ఫార్మన్స్ లోను పాన్ కళ్యాణ్ సాంగ్స్ ఉండేలా చూసుకున్నాడు ..పవన్ కళ్యాణ్ మేనరిజం తో షో లో ప్రతీ ఒక్కరిని మెప్పించాడు ..అందుకు తగ్గట్టు డాన్స్ కూడా పవర్ ప్యాక్ గా ఉండడం తో అతడిని ఢీ 10 విజేతగా నిలిపాయి ..మొత్తానికి పవన్ కళ్యాణ్ ఢీ 10 లో రాజు విన్ అయ్యేలా కారణం అయ్యాడు ...మొత్తానికి పవన్ కళ్యాణ్ విజయం సాధించడానికి ,ఎన్టీఆర్ విజయాన్ని అందివ్వడానికి వచ్చినందుకు రాజు అదృష్టవంతుడే ...

Comments