రాత్రిపూట అన్నం తింటున్నారా..? ఐతే ఇది తప్పక చూడండి | Does Eating (Wheat/ Rice) at Night.? | Sumantv

టైటిల్: అన్నంపై ఉండే అపోహలు..ఇవే...  

  అన్నమయములైనవన్ని జీవమ్ములు..కూడులేక జీవకోటి లేదు అంటారు పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి...  ఆయన చెప్పినమాటలు అక్షర సత్యాలు... ఆయన చెప్పినట్తుగా మన దేశపు ప్రజల్లో  70 నుంచి 80 శాతం మంది  వరి బియ్యంతో తయారు చేసే అన్నమే తింటున్నారు     ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన  కూరల్ని,రుచికరంగా  తయారు చేసుకుని,ఆ కూరల్ని  అన్నంలో కలుపుకుని తినడం చాలాకాలంగా వస్తోంది. ఎన్నిసార్లు టిఫిన్ తిన్నా,జ్యూస్ లు తాగినా అన్నం దారి అన్నానిదే.. వాటిదారి వాటిదే. శరీరానికి శక్తినిచ్చేది వరి అన్నమేనని భావించి చాలామంది ప్రజలు రెండుపూటలా అన్నం తినడానికే మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఈ అన్నం తినడంగురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేమిటో   తెలుసుకుందాం.

  సాధారణంగా మనలో చాలా మంది రాత్రిపూట  అన్నంతినడానికి  బదులు చపాతీ లేదా ఇతర  టిఫిన్స్  వంటివి తీసుకుంటుంటారు. అయితే రాత్రి పూట యిలాంటివి తినేకంటే, అన్నం తినడమే  ఆరోగ్యానికి  మంచిదని  వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే, అన్నం తినడం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ విడుదలయ్యి, చక్కగా నిద్ర పడుతుంది.దీనివల్ల శరీర రోగనిరోధక శక్తి పెరిగి,స్థూలకాయం,గుండె పోటు,షుగర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.  రాత్రిళ్లు టిఫిన్ తినేకంటే అన్నం తినడంవల్ల మన శరీరంలో శక్తి బాగా ఖర్చు అయ్యి,  మన బాడీలో కొవ్వు పేరుకుపోకుండా ఉటుంది. అంతేకాకుండా కడుపునిండి, ఆకలి వేయదు.కాబట్టి,రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.

    మనదేశంలో   ఎక్కడ చూసినా చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు.వీరంతా షుగర్ కంట్రోల్ అవ్వడంకోసమని చెప్పి,రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు తింటుంటారు.  నిజానికి మధుమేహం ఉన్న వారు అలా రొట్టెలు, చపాతీలు తిన్నంత మాత్రాన షుగర్ కంట్రోల్ అవ్వడం అనేది అపోహ మాత్రమే. అన్నం తినడం వల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ షుగర్ పెరగదు,కాబట్టి రాత్రిపూట నిర్భయంగా అన్నం తినవచ్చు.   అయితే రాత్రిపూట అన్నం  తినేవారు తక్కువ మోతాదులో తినాలి. 

    అలా అన్నం తినేటప్పుడు దానిలో పప్పులు, కూరగాయలతోవండిన కూరలు , నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుని తినాలి.అలాచేస్తే  భోజనం తిన్న  వెంటనే మీ బాడీలోని షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయనీ అంతేకాకుండా   శరీరంలో  చక్కెర నిల్వల స్థాయిని  అన్నం నియంత్రణలో  ఉంచుతుందనీ ఆ వైద్యులు చెబుతున్నారు.   రాత్రిళ్లు అన్నం తినడం వల్ల శరీరంలో ఎట్టిపరిస్థితుల్లోనూ  కొవ్వు చేరదు. అయితే కొందరు మాత్రం నిత్యం దొరికే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడంవల్లనే శరీరంలో కొవ్వు బాగా పెరుగిపోతుంది.  యిలా కొవ్వు పెరగకుండా ఉండాలంటే రాత్రిళ్లు  అన్నం తినడము,తగినంతగా వ్యాయామాలు చెయ్యడం   ఉత్తమమని వైద్య నిపుణులు సలహా యిస్తున్నారు.కాబట్టి ఎలాంటి అపోహలూ పెట్టుకోకుండా రాత్రిళ్లు అన్నం తినండి..కొద్దిసేపు వ్యాయామాలు చేసి,మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి...        

Comments