Skip to main content

మృత్యు తో గెలిచి పోరాడిన సెలెబ్రిటీలు |Top Celebrities Who are Suffer From Cancer |

  మృత్యు తో గెలిచి పోరాడిన సెలెబ్రిటీలు

   క్యాన్సర్ వ్యాధి ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం తాగే నీటి నుండి పీల్చుకునే గాలి వరకూ అన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలో మనం నిర్లక్ష్యం వహిస్తాం. చిన్న చిన్న లక్షణాలు రేపు పెద్దవిగా మారి ప్రాణాపాయం తలబెట్టే ప్రమాదం ఉంది. ఈ సహస్రాబ్దిలో మనిషిని అత్యధికంగా భయపెడుతోన్న వ్యాధి ఏదైనా ఉందీ అంటే అది నూటికి నూరు శాతం క్యాన్సరే. ఏటా దాదాపు 1.41 కోట్ల మంది దాని బారినపడుతున్నారు. 82 లక్షల మంది మరణిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ మీద పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.

    మరణం అనేది ఈ ప్రపంచంలో ఏ జీవికి శాశ్వతం కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే కానీ 100 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి ప్రాణాలు ఒక్కోసారి మధ్యలోనే పోతాయి అంటే వాయిదా వేసుకునేందుకు ప్రయత్నం చేస్తాము. ప్రమాదాలు రోగాలు ప్రాణాలకు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాయి కూడా . అయితే వాటిని జయించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత గొప్పవాడైనా కూడా చావుకు అతీతం కాదనే చెప్పాలి.

    సినీ తారలను ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి బయపెడుతూనే ఉంటుంది.ఇకపోతే సెలబ్రెటీలకు ఏ కష్టాలు ఉండవని అనుకోవడం ఒక్కోసారి పొరపాటే అనిపిస్తుందనే చెప్పాలి. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు వారికి సమస్యలు కూడా బాగా ఉంటాయి అని చెప్పాలి. క్యాన్సర్ బారిన పడినవారు మళ్లీ బ్రతకడం అంటే చాలా కష్టం అనే మన అందరకి తెలిసి౦దే కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యం సహకరిస్తే వాటి నుంచి విముక్తి పొందవచ్చు. తెలుగు సిని ఇండస్ట్రీ సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు దానిపై పోరాడాలని దైర్యంగా ఎదుక్కొన్నారనే చెప్పాలి. కానీ అందుకు వయసు సహకరించలేదు.

   మనం సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన చికిత్స చేయించుకున్నారు కూడా.ఇక నటి సీనియర్ నటి గౌతమి కూడా అప్పట్లో క్యాన్సర్ తో గట్టిగా పోరాటం చేసిందనే చెప్పాలి. కెరీర్ తో పాటు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ దైర్యంగా ముందుకు సాగి శభాష్ అనిపించుకున్నారు కూడా. ఇక మనీషా కొయిరాలా కూడా దాదాపు అలాంటి క్లిష్ట సమయంలోనే క్యాన్సర్ భయపెట్టినా కూడా ధీటుగా తట్టు కొని ఎదుర్కొన్నారనే చెప్పాలి.

    మమత మొహన్ దాస్ కి కూడా క్యాన్సర్ ఉన్నట్లు తెలియగానే కేడి సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోగా నాగార్జున ధైర్యాన్ని ఇచ్చినట్లు ఆమె చెబుతుంటారు కూడా…..అయితే ఇక రీసెంట్ గా సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు ఆలస్యంగా తెలిసి నప్పటికీ తను దైర్యంగా ఎదుర్కొంటాను ఆంటోంది. ప్రముఖ క్రికెట్ ప్లేయర్స్ ఇమ్రాన్ ఖాన్ – యువరాజ్ సింగ్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడినవారే. మళ్ళీ మనోధైర్యంతో పోరాడి జీవితాన్ని కొనసాగిస్తున్నారనే చెప్పాలి

Comments

మృత్యు తో గెలిచి పోరాడిన సెలెబ్రిటీలు |Top Celebrities Who are Suffer From Cancer |

posted onJuly 7, 2018
by sumantv

Tags

Top Celebrities Who are Suffer From Cancer sonali bendre cancer manisha koirala cancer