పవన్ రేణుదేశాయ్ ఫోటో పోస్ట్ చేసి మరోవివాదం రేపిన కత్తి మహేష్ | Kathi Mahesh Comments On Pawan Kalyan

  పవన్ రేణుదేశాయ్ ఫోటో పోస్ట్ చేసి మరోవివాదం రేపిన కత్తి మహేష్ |

   శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన కత్తి మహే్షపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు, అతను మాట్లాడిన విధానం.. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, అహంకార పూరితంగా ఉన్నాయని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కత్తి మహేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతని తీరును అన్ని పార్టీలు, మతాలు, వర్గాలు ముక్తకంఠంతో నిరసించాలని కోరారు.పవర్స్టార్ పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకొని సినీ విమర్శకుడు మహేష్ కత్తి వివాదాస్పద పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత కొద్దికాలంగా సద్దుమణిగిందనుకొన్న పవన్, కత్తి వివాదం మళ్లీ రాజుకొన్నట్టు కనిపిస్తుంది.

   హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం ఓ కేసులో కత్తి ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్ను పోస్టు చేసి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తున్నది. నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఓ ప్రణాళిక బద్దంగా హిందూ మతాన్ని డామేజ్ చేయడానికి కుట్ర జరుగుతున్నది. అలాంటి వారిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం రేపింది. నాగబాబు వీడియో పోస్టు నేపథ్యంలో మహేష్ కత్తి తీవ్రంగా స్పందించారు. రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్ను పోస్టు చేయడం వివాదంగా మారింది. ఇట్స్ హై టైమ్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

   నా జోలికి వస్తే మీ హీరో అంతు చూస్తా అని ఉండటం వివాదానికి కేంద్ర బిందువైంది. అయితే రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. అయితే రెండో పెళ్లి చేసుకోవడంపై పవన్ ఫ్యాన్స్లోని కొందరు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కాస్త ఘాటుగానే రేణు స్పందించారు. కానీ మహేష్ కత్తి పోస్టు చేసిన ఇమేజ్ ఎక్కడిది? ఏదైనా పేపర్లో వచ్చిందా? అనే విషయాలపై క్లారిటీ లేదు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే మహేష్ కత్తి ఈ చర్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు మళ్లీ రెచ్చిపోతారా లేక సహనం పాటిస్తారా అనేది వేచి చూడాల్సిందే. 

   శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్, హిందువుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడుతున్న ఓవైసీ తీరుపై ప్రతిపక్షాల వైఖరి వెల్లడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కత్తి మహేష్, ఓవైసీలను జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

  . శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు నాగబాబు డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని హెచ్చరించారు.

Comments