పవన్ కళ్యాణ్ కోసం ఆది ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు|

  పవన్ కళ్యాణ్ కోసం ఆది ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు|

  హైపర్ ఆది.. ఇప్పుడిది పేరు కాదు.. ఇదొక బ్రాండ్. కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌లతోనే జబర్దస్త్‌కు ప్రేక్షకుల ఆదరణ పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఒకానొక సమయంలో జబర్దస్త్ షో మొత్తం హైపర్ ఆది స్కిట్ మీదే నడుస్తుందన్న వార్తలు షికారు చేశాయి. అయితే, స్కిట్.. స్కిట్‌కు తన పంచ్‌ల పంథాను మారుస్తూ..పంచ్లలో పసను పెంచేందుకు హైపర్ ఆది తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఇందుకు నిదర్శనం కత్తి మహేష్ టార్గెట్‌గా హైపర్ ఆది వేసిన పంచ్ డైలాగ్‌లే!ఇంతకాలం ప్రేక్షకులను నవ్వించేందుకు జబర్డస్త్ షో లో స్క్రిప్ట్ రాసిన హైపర్ ఆది..త్వరలో ప్రజల కోసం స్క్రిప్ట్ రాయబోతున్నాడా..అంటే అవుననే తెలుస్తుంది.

  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు పలికిన జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ , ఈసారి మాత్రం ఒంటరిగా 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మధ్యనే పూర్తిగా రాజకీయాల్లోకి దిగి ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రజల కష్టాలు తెలుసుకొనే పని పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ యాత్ర కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రజల స్పందన చూసి పవన్ కూడా రెచ్చిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఫై , అలాగే చంద్రబాబు ఫై నిప్పులు చెరుగుతూ ప్రజలను బాగానే ఆకట్టుకున్నాడు.ఈ నేపథ్యం లో పవన్ కు సపోర్ట్ గా ఆయన అభిమాని జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది, వచ్చే ఎన్నికల కోసం తన అభిమానాన్ని చాటుకోబోతున్నాడు.

  జబర్ధస్త్‌లో అద్భుతమైన పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ హైపర్ ఆది పవన్ కల్యాణ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. కత్తి మహేశ్ వివాదం సమయంలో పవన్ అభిమానుల వైపు మాట్లాడి సంచలనం సృష్టించాడు. అలాంటి హైపర్ ఆది వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయబోతున్నాడట.ఇటీవల పవన్‌ను కలిసిన హైపర్ ఆది తనకు జనసేన పార్టీలో చేరాలని ఉందని, అయితే తన కెరీర్ దృష్ట్యా కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, అందుకోసం వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారానికి వస్తానని పవన్‌తో అన్నాడట. దీనికి పవన్ ''మీకు ఓకే అయితే నాకు అభ్యంతరం లేదు'' అన్నాడట. దీంతో హైపర్ ఆది ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ఆది పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ రాసే పని పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆ డైలాగ్స్ తో ప్రజల మనసును అలాగే పవన్ మనసును గెలుచుకోవాలని చూస్తున్నాడు. చూద్దాం ఆది ఎలాంటి డైలాగ్స్ రాస్తాడో.

Comments