లోకేష్ స్పీచ్ చూసి తెలుగు నేర్పిన టీచర్ చెప్పేది వింటే షాక్ అవుతారు

లోకేష్ కు తెలుగు నేర్పుతున్న టీచర్ చెప్పేది వింటే అయ్యో పాపం అంటారు.

 తెలుగు ప్రజలకు లోకేష్ పేరు వినిపించగానే ముందు నవ్వొస్తుంది.. ఆ తరువాత పాపం అని జాలేస్తుంది.. ఒక మంత్రి గురించి అలా మాట్లాడడం తప్పే కాని మన మంత్రిగారు ఎన్ని రోజులు ఎంత ట్రైనింగ్ తీసుకున్న తెలుగు మాత్రం స్పష్టంగా మాట్లాడలేక పోతున్నాడు.. విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఇంగ్లీష్ కుడా తప్పులు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అందుకే అతడి పేరు వింటేనే ముందు అందరు నవ్వుకుంటున్నారు.. తేట తెలుగులో తేనెలొలికేలా మాట్లాడేందుకు చాలా కష్టపడుతున్నా కానీ ఎందుకో ఏమో కాలం కలిసిరాక అభాసుపాలవుతున్నాడు. మాట్లాడుతుండగా ఏదో పెద్ద తప్పుడు మాట బయటకు రావడం.. దాన్ని సోషల్ మీడియా, మీడియా రచ్చ రచ్చ చేయడం జరుగుతూనే ఉంది.. అది చూసి బాబుకి ఏం చేయాలో అర్ధం కావడం లేదు..

 పోనీ మీడియామీద కేసులు వేద్దామా ? అంటే అది అసాద్యం.. మీడియాతో పెట్టుకుంటే ఉన్న పరువుకాస్త బజారున పడుతుంది.. అందుకే లోకేష్ విషయంలో సైలెంట్ గా ఉన్న బాబు అతడికి తెలుగులో స్పెషల్ క్లాసులు ఇప్పిస్తున్నాడు.. రీసెర్చ్ స్కాలర్, టీవీ సీరియర్ రైటర్ అయిన “పెద్ది రామారావు”ను లోకేష్ కు వ్యక్తిగత తెలుగు భాష నేర్పే టీచర్ గా నియమించాడు బాబు..  ఇందుకోసం “పెద్ది రామారావు”కు నెలకు ఏకంగా లక్ష రూపాయల జీతంతో పాటు... ప్రభుత్వం ద్వారా సకల సదుపాయాలు కల్పించాడు. అంతేకాదు అతడికోసం ముగ్గురు సహాయక సిబ్బందిని నియమించి తెలుగులో లోకేష్ బాబును తీర్చిదిద్దాలని ఆదేశించాడు. కానీ ఇవేవీ లోకేష్ పై పనిచేయలేదు.. తాజాగా లోకేష్ బాబు కాకినాడలో పర్యటించిన సంగతి తెలిసిందే... అక్కడ చేసిన ప్రసంగంలో మళ్లీ బోలెడు తప్పులు బయటపడడం అందరం చూసాం.. విన్నాం కుడా.. దాంతో లోకేష్ ప్రసంగం సోషల్ మీడియాలో మల్లి తెగ వైరల్ గా మారింది.

  దాంతో చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట.. అంతమంచి టీచర్ ను పెట్టి లక్షల జీతాలు ఇచ్చినా కొడుకు లోకేష్ లో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేకపోవడం చూసి అయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందుకే టీచర్ రామారావును ఇంటికి పిలిచి మీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పూర్తి చేయలేదని.. లోకేష్ లో ఏమాత్రం పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం... ఈ సందర్భంగా బాబుతో మాట్లాడినా లోకేష్ తెలుగు టీచర్ “పెద్ది రామారావు”... “సార్ లోకేష్ చిన్నతనం నుండి తెలుగు నేర్చుకోలేదు.. అమెరికాలోనే పెరిగాడు.. అందుకే తెలుగుపై అవగాహనా లేదు.. పైగా మనోడికి కొన్ని పదాలు ఎంత ప్రయత్నించిన అస్సలు తిరగడం లేదు.. చాల కష్టం కుడా.. రాత్రి పగలు నిద్రలేకుండా చెప్పినా కుడా నేర్చుకోలేక పోతున్నాడు.. నేనేం చేయను సార్..

  మీ ఇష్టం కావాలంటే మరొకరిని పెట్టుకోండి” అని బాబుగారి మొహం మీదే చెప్పెసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకేష్ పై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు నేటిజన్స్.. వారిలో కొందరు ఎన్ని లక్షలు ఖర్చుపెట్టిన లాభం లేదని... లోకేష్ కు తెలుగు మాట్లాడం ఈ జన్మలో రాదనీ.. అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటే బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.. మరీ లోకేష్ టీచర్ పడుతున్న బాద ఎలా, ఉండి ఉంటుందో

Comments