Skip to main content

Breaking News : కత్తి మహేష్ అరెస్ట్ మూడేళ్లు జైలు శిక్ష అసలు కారణాలు ఇవే | Kathi Mahesh Arrested

 Breaking News : కత్తి మహేష్ అరెస్ట్ మూడేళ్లు జైలు శిక్ష అసలు కారణాలు ఇవే 

   సినిమాలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే కత్తి.శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్ చర్చ వేదికలో సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీ ఛానెల్ ముందు ఆందోళన విషయం తెలిసిందే. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.ఈ వ్యవహారంపై రాష్ట్రీయ హిందూ సేన(RHS) వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు.

  శ్రీరాముడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న స్వామిజీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాలకు 24గంటల సమయం ఇచ్చారు. ఆలోపు ప్రభుత్వాలు స్పందించి కత్తి మహేష్ పై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. హిందూవులపై గానీ, హిందూ దేవతలపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై వదిలిపెట్టేది లేదన్నారు. కత్తి మహేష్ విషయంలో ఎంతటికైనా తెగిస్తామన్నారు.హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని ఆనంద్ బంజారా కాలనీ, ప్లాట్ నంబర్ 29లో కత్తి మహేష్ నివాసం ఉంటుండగా, ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు, నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి, తమవెంట తీసుకెళ్లారు.

  ఈ నోటీసును సీఆర్పీసీ 41 (ఏ) కింద జారీ చేసిన పోలీసులు, ఆయనపై గత నెల 30న కేసు నంబర్ ఎఫ్ఐఆర్ / సీఆర్ నంబర్. 002/2018ను రిజిస్టర్ చేశారు. ఐపీసీలోని 205 (ఏ), 505 (2) కింద అభియోగాలను నమోదు చేసినట్టు తెలిపారు. ఇక గత రాత్రి స్టేషన్ లో ఉంచిన ఆయన్ను, దేవుడి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేశారు? గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? వంటి ప్రశ్నలు సంధించి, కత్తి చెప్పిన సమాధానాలను సరిపోల్చుకున్నట్టు సమాచారం. నేడు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.అయితే పవన్ ఫాన్స్ మాత్రం కత్తి మహేష్ అరెస్ట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ...కత్తి కి వురి శిక్ష వేయాలని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు ...పవన్ కళ్యాణ్ నిజం గా దేవుడు కాబట్టి తన పై ఎన్ని కామెంట్స్ చేసినా ఊరుకున్నాడు .

  .అలాంటిది ఆ దేవుడిపై శ్రీ రాముడిపై కామెంట్స్ చేస్తే ఆయన భక్తులు ఊరుకుంటారా ?కత్తి మహెష్ కి కఠిన శిక్ష వెయ్యాలి అని కోరుతున్నారు ...రాముడిని, సీతని నమ్మలేని వాడు ఇక తన కన్న తల్లి తండ్రులని ,కట్టుకున్న భార్యని ఎలా నమ్ముతాడు ,ఇలాంటి వాడికి సంఘం లో బతికే అర్హత లేదని నెటీజన్లు కోరుతున్నారు ...శ్రీ రాముడు పవన్ కళ్యాణ్ అంత మంచోడు కాదు ...తగిన శిక్ష వేస్తాడు ..అని పవన్ ఫాన్స్ సంతోషపడుతున్నారు ...కత్తి మహేష్ శ్రీ రాముడిపై చేసిన వ్యాఖ్యల పై మీ అభిప్రాయాన్ని ,అతనికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయండి ...

Comments

Breaking News : కత్తి మహేష్ అరెస్ట్ మూడేళ్లు జైలు శిక్ష అసలు కారణాలు ఇవే | Kathi Mahesh Arrested

posted onJuly 3, 2018
by sumantv

Tags

Kathi Mahesh Arrested