కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. TRSలోకి మెగాస్టార్ చిరంజీవి..!

Congress resigns .. Megaser Chiranjeevi into TRS ..!

TRS కండువా కప్పుకోనున్న చిరంజీవి..!

స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. 2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి తన సేవలను కొనసాగించారు. ఐతే, 2014 ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలని విడదీసిన కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రా ప్రజలంతా తమ కడుపు మంటను వెలగక్కారు. దీంతో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. కానీ చిరు మాత్రం ఆ పార్టీని వదిలిపెట్టలేదు. ఒక పక్క తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శిస్తున్నా కూడా చిరంజీవి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే పని చేయలేదు. 

ఐతే, ఆ మధ్య కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా కూడా ఆయన దాన్ని పునరిద్ధరించుకోకపోవడమే. దీంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఐతే ఆ వార్తలను నిజం చేస్తూ చిరంజీవి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. దీనికి కారణం, మొన్నా మధ్య జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడిన మాటలే. కేసీఆర్ పాలన తీరును ప్రశంసిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం అని కొనియాడారు. ఆయన మాటల మనిషి కాదని, చేతల మనిషి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కేసీఆర్ తనను కలిసిన ప్రతీసారి సినీ పరిశ్రమ కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడేవారని, కళాకారులకు గుర్తింపు తెచ్చేందుకు మరింత కృషి చేయాలని తనతో అనేవారని చిరు అన్నారు. 

ఈ మాటలతో చిరు కేసీఆర్ కే సపోర్ట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. ఈ వార్తలకి బలం చేకూరుస్తూ మొన్నా మధ్య చిరు కోడలు ఉపాసన టీఆర్ఎస్ కి మద్ధతుగా ట్వీట్ చేశారు. అంతేకాదు, కేసీఆర్ ముద్దుబిడ్డ ఎంపీ కవితతో కలిసి హరితహారం సహా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అల్లు అర్జున్ కూడా హరితహారంలో మొక్కలు నాటారు. ఇక రాంచరణ్ ఐతే మంత్రి తలసాని సహా పలువురు టీఆర్ఎస్ మంత్రులతో కలిసి అప్పుడప్పుడు పలు సభలు, సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా తెలంగాణా పాలిటిక్స్ లో వేలు పెట్టకుండా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చేసిన తప్పులనే ఎండగడుతూ ఆంధ్రా పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. పైగా సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ ని, ఆయన పాలనని పొగుడుతుంటారు. కేటీఆర్ తో కూడా ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. ఈ కారణాల వల్ల మెగాఫ్యామిలి మొత్తం టీఆర్ఎస్ కే ఓటేసేలా ఉన్నారన్న వార్తలు బలపడుతున్నాయి. 

ఇక చిరు కేసీఆర్ పాలన గురించి పాజిటివ్ గా మాట్లాడడంతో టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా తెలంగాణలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ కి ఇవ్వబోతున్నారని సమాచారం. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన కారణంగానే చిరంజీవి ఈ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. టీడీపీలో చేరదాం అంతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. పైగా టీడీపీ మీద కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మిగిలింది వైఎస్సార్సీపీ, జనసేన. వైఎస్సార్సీపీలో జాయినయితే పవన్ కల్యాణ్ కి ఎదురెళ్లినట్టు ఉంటుంది. అలా అని జనసేనలో జాయినయితే ప్రజారాజ్యం పార్టీ అని నిందలు వేస్తారు. అందుకే ఏపీ పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. కేవలం తెలంగాణలో మాత్రమే పోటీ చేస్తారని అంటున్నారు. పైగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న రాష్ట్రం కాబట్టి రాజకీయాల్లో పోగొట్టుకున్న పేరు తిరిగి మళ్ళీ సంపాదించవచ్చుననే ఉద్దేశంతో టీఆర్ఎస్ లో చేరబోతున్నారని సమాచారం. 

అదే కనుక జరిగితే, రాజకీయాల కారణంగా తాను కోల్పోయిన పేరు, ప్రఖ్యాతలను తిరిగి తెలంగాణ రాజకీయాల ద్వారా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న పేరుకే తప్ప ఆయన పెద్ద యాక్టివ్ గా లేరు. ఉత్సాహంగా కూడా లేరు. టీఆర్ఎస్ లో చేరితే ఈ పార్టీకి మద్ధతు ఇచ్చినట్టు ఉంటుంది, అదనపు ఆకర్షణ ఉంటుంది, పైగా చిరుకి కూడా పొలిటికల్ గా మంచి మైలేజ్ ఉంటుంది. ఎలాగూ పవన్ కూడా టీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారు కాబట్టి కేసీఆర్ కి తిరుగుండదు. మళ్ళీ ఆయనే సీఏం అవుతారు. ఒకవేళ జనసేన తరపున పవన్ కల్యాణ్ పోటీ చేసినా, కేసీఆర్ కు అనుభవం ఉంది కాబట్టి తన అభ్యర్ధులను టీఆర్ఎస్ తో కలిసి పనిచేసేలా చేస్తారు. 

ఎందుకంటే పవన్ కి కావాల్సింది పవర్ కాదు, ప్రజాసమస్యలను పరిష్కరించడమే కాబట్టి. ప్రజాసమస్యలని తీర్చడంలో తెలంగాణలో కేసీఆర్ ని మించిన నాయకుడున్నారా? లేరు కాబట్టే చిరు కూడా ఈయనకే మద్ధతిచ్చారు. మొత్తానికి చిరు, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన ఇలా మెగా ఫ్యామిలి మొత్తం టీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారుగా. మెగా ఫ్యామిలి చేసింది అంటే, టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది ముందుకొస్తారు. అదే జరిగితే టీఆర్ఎస్ కి భారీ విజయం దక్కడం ఖాయం. మరి, టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలిపై, అలానే టీఆర్ఎస్ లో చేరనున్న చిరంజీవిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి.

Comments