త‌మ‌న్నా .. బాగా బిజీ..!

Tamanna .. well busy!

త‌మ‌న్నా .. బాగా బిజీ..!

త‌మ‌న్నా న‌టించిన రెండు సినిమాలు ఆ మ‌ధ్య ఆగిపోయాయి. ఇక అవి విడుద‌ల కావ‌ని అంద‌రూ అనుకున్నారు. అలా ఆగిపోయిన సినిమాల‌ను ఇప్పుడు విడుద‌ల చేసేందుకు త‌మ‌న్నా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. దీంతో త‌మ‌న్నా టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోంది. ఇప్ప‌టికే ఆమె చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆగిపోయిన సినిమాల‌ను కూడా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిస్తోంది. వాటిని విడుద‌ల చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆగిపోయిన రెండు సినిమాలు  మ‌ళ్లీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 

త‌మ‌న్నా గ‌తేడాది రెండు సినిమాల‌ను ప్రారంభించింది. ఒక‌టి క్వీన్ రీమేక్‌. మ‌రొక‌టి సందీప్ కిష‌న్‌తో. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు గ‌తేడాది మొద‌ల‌య్యాయి. మ‌ధ్య‌లో ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని రివైన్ చేసింది. ఏడాద‌న్న‌ర క్రితం త‌మ‌న్నా, సందీప్ కిష‌న్‌తో ఒక సినిమాను మొద‌లు పెట్టింది. ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ విడుద‌ల‌కు రెడీ అవుతోంది.  ఆ సినిమాకు నెక్స్ట్ ఏంటి అనే పేరును పెట్టారు. 

అలాగే, క్వీన్ సినిమా రీమేక్ కూడా అంతే. అనేక‌సార్లు షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయిన ఆ సినిమా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీగా రానుంది.  ఇలా ఆగిపోయిన సినిమాల‌ను రివైల్ చేస్తుంది త‌మ‌న్నా. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. 

Comments