కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

Who's in the car .. Steering MIM in hand ..!

కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో గెలుపు ఎంఐఎందేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ. నాలుగేళ్లు ఏమీ చేయ‌నివారు కారు వేసుకుని వ‌స్తున్నార‌ని, దాని స్టీరింగ్ మాత్రం త‌మ చేతుల్లోనే ఉంద‌ని ప‌రోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చ‌రించారు. ఎంఐఎం ముక్త్ హైద‌రాబాద్ కాదు..  తెలంగాణ ముక్త్ బీజేపీ కావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ 

రాజేంద్ర న‌గ‌ర్‌లో ఎంఐఎం జెండా ఎగుర‌బోతుంద‌ని జోస్యం చెప్పారు నాయుడు కూట‌మి లాంటివి ఎన్ని వ‌చ్చిన త‌మ ముందు ప‌నిచేయ‌వ‌ని అన్నారు అస‌దుద్దీన్‌. ప్ర‌ధాని మోడీ పాల‌న‌లో దేశ ప్ర‌జ‌లు ఎంతో న‌ష్ట‌పోయార‌న్నారు. అలాగే, బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి పలు ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌ను బాధ‌ల్లోకి నెట్టాయ‌ని అన్నారు. అటువంటి బీజేపీ ముక్త్ భార‌త్ కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో అది జ‌ర‌గ‌నుంద‌ని అస‌దుద్దీన్ ఓవైసీ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. 

Comments