బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

Chandrababu aggression on formation of non-BJP alliance

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు స్పీడ్ పెంచిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతి స్టెప్ వేయ‌బోతున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను క‌లుపుకుని భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మ త‌మ రాష్ట్రాల్లో జాతీయ  స్థాయి నేత‌ల‌తో స‌భ‌లు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే నాటికి వీలైన‌న్ని పార్టీల‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.  

అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనే ఈ త‌ర‌హా స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తుండ‌టంతో స‌భ‌లు ఇప్పుడే ఉంటాయా..?  లేక  మ‌రింత ఆల‌స్య‌మ‌వుతాయా..? అన్న ఉత్కంఠ రేగుతోంది. గ‌త ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స‌హా 15 పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హించారు. గురువారం బెంగ‌ళూరుకు వెళ్లి క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వ‌మాఇ, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో మంత‌నాలు జ‌రిపారు. 

అలాగే, ఇవాళ చెన్నై ఫ్లైట్ ఎక్కి డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కాబోతున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా ఏ విధంగా పోరాటాన్ని ఉధృతం చేయాలి. జాతీయ స్థాయిలో సెక్యుల‌ర్ ఫోర్సెస్ అన్నీ ఒకేతాటిపైకి వ‌చ్చేందుకు ఏఏ అంశాల‌ను టేక‌ప్ చేయాల‌న్న‌దానిపై ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టారు చంద్ర‌బాబు. 

Comments