ఎన్టీ ఆర్ పై కొడాలి నాని సంచలన కామెంట్స్ ! 

Nani Sensational Commentary!

      ఎన్టీ ఆర్ పై కొడాలి నాని సంచలన కామెంట్స్ ! 

            ఎన్టీఆర్.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. వరస విజయాలతో దూసుకొని పోతున్న తారక్ స్పీడ్ ని అందుకోవడం ఇప్పుడు ఎవ్వరికి సాధ్యం కావడం లేదు. టెంపర్ కి ముందు బాగా ప్లాప్స్ లో ఉన్న సమయంలోనే.. ఎప్పటికైనా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తా అని మాట ఇచ్చి.. ఇచ్చిన మాటని తూచా తప్పకుండా నిలబెట్టుకున్న గట్స్ ఉన్న హీరో తారక్. అయితే తారక్ కి ఇంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది అంటే నటన మీద అతనికి ఉన్న పట్టే దానికి కారణం. తెలుగులో ఎలాంటి పాత్ర అయినా చేయగల స్టామినా ఎన్టీఆర్ సొంతం. డైలాగ్స్, ఫైట్స్, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ , కామెడీ టైమింగ్ ఇలా ఒకటేంటే.. నటనలో అన్ని కోణాలు తెలిసిన హీరో తారక్. అయితే ఇంత తక్కువ సమయంలోనే తారక్ ఈ రేంజ్ హీరో అవ్వడానికి కారణం చిన్న వయసులో తీసుకున్న శిక్షణే.

        ఆ సమయంలో తారక్ ని హీరో చేయాలి అని అన్ని నేర్పించింది ఎన్టీఆర్ తల్లిగారే అయినా, అన్ని దగ్గర ఉండి చూసుకుంది మాత్రం కొడాలి నాని. హరికృష్ణ అనుచరుడిగా చాలా ఏళ్ళు వారికి విశ్వాసంగా ఉంటూ వచ్చిన నాని హరికృష్ణ కుటుంబంలో ఒకడిగా కలసి పోయాడు.  ఆ సమయంలో ఎన్టీఆర్ కి అన్ని దగ్గర ఉండి చూసుకుంది కూడా కొడాలి నానినే. తారక్ ఏమి నేర్చుకోవాలి..అన్న విషయాన్ని తారక్ అమ్మగారు డిసైడ్ చేస్తే.. తారక్ అవి నేర్చుకోడానికి అన్ని సమకూర్చే బాధ్యత నాని తీసుకునేవారు. ఇక ఎన్టీఆర్ హీరో అయ్యాక మొదట్లో చేసిన అన్ని సినిమాలు కూడా నాని సజెస్ట్ చేస్తే చేసినవే. ముఖ్యంగా తారక్ కెరీర్ ని మలుపు తిప్పిన ఆది సినిమాని ఒకే చేసింది కూడా నానినే. అందుకే ఎన్టీఆర్ స్టామినా ఏమిటో కొడాలి నానికి మొదటి నుండి తెలుసు.

            అప్పట్లో అవకాశం చిక్కినప్పుడల్లా.. తారక్ నువ్వు తోపు తురుము, భలే యాక్టింగ్ చేస్తున్నావు.. నువ్వు నెంబర్ వన్ హీరో అవుతావు అంటూ పొగడ్తల వర్షం కురిపించేవాడట నాని. అయితే తారక్ కి ఆ పొగడ్తలు అస్సలు నచ్చేవి కాదట. నాని అన్న నువ్వు అలా పొగుడుతుంటే నాకు నరకం కనిపిస్తుంది.. నాకు ఏదోలా ఉంది , అలా పొగడకు అని తారక్ బతిమిలాడేవాడట. అయినా కొడాలి నాని మాత్రం తారక్ మీద ఉండే అభిమానంతో  పొగడతానే ఉండేవాడట. అయితే ఒకరోజు ఎన్టీఆర్ అమ్మగారు ఇది చూసి.. నాని మీ స్నేహాన్ని నేను అర్ధం చేసుకోగలను.. కానీ నువ్వు వయసులో పెద్దవాడివి.. వాడిని అలా పొగడకూడదు.. ఇక అలా పొగడకు అని నచ్చచెప్పిందట. రీసెంట్ గా ఈ విషయాలను అన్ని  బయటపెట్టాడు కొడాలి నాని.. తారక్ కెరీర్ స్టార్టింగ్ లో అతనిని పొగుడుతూ నేను అతనికి నరకం చూపించేవాడిని.. అయితే ఒకరోజు తారక్ అమ్మగారు అడ్డుకోవడంతో ఇక ఎన్టీఆర్ ని పొగడటం ఆపేశాను.. అయినా నేను పొగిడినా పొగడకపోయినా.. ఎన్టీఆర్ ఆ తాతకి తగ్గ మనవడు అని నాని తన మనసులో మాటని మరోసారి బయటపెట్టాడు.

Comments