శ‌బ‌రిమ‌ల ఆందోళ‌న‌కారుల‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌..!

Bail denial of Sabarimala protesters

శ‌బ‌రిమ‌ల ఆందోళ‌న‌కారుల‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌..!

శ‌బ‌రిమ‌ల‌లో సుప్రీం కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఏ మాత్రం కూడా ఆమోద‌యోగ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది కేర‌ళ హైకోర్టు. నిర‌స‌న‌లో పాల్గొన్న ఓ వ్య‌క్తి దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన కేర‌ళ హై కోర్టు సేవ్ శ‌బ‌రిమ‌ల ఉద్య‌మకారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌రో వైపు మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని వ్య‌తిరేకిస్తూ  కాంగ్రెస్‌, బీజేపీలు ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేశాయి.  బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ర‌థ‌యాత్ర చేప‌డితే.. కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర‌ను చేప‌ట్టింది. 

సుప్రీం కోర్టు తీర్పు అమ‌లు కాకుండా ఎలా అడ్డుప‌డ‌తార‌ని ప్ర‌శ్నించిన న్యాయ స్థానం  కొన్ని వారాలుగా శ‌బ‌రిమ‌ల‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ త‌ర‌హా ఆందోళ‌న‌ల‌ను తాము ఏ మాత్రం ఆమోదించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేసిన వారిలో  3500 మందిని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు.  540 మందిపై కేసులు పెట్టారు. వీరిలో వంద మందికిపైగా ఇంకా జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలోనే ఉన్నారు. 

Comments