బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

Chandrababu meeting with non-BJP parties

బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు   కాసేప‌టి క్రితం బెంగ‌ళూరుకు చేరుకున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో దేవెగౌడ‌, కుమార‌స్వామితో భేటీ కానున్నారు. ప‌ద్మ‌నాభ న‌గ‌ర్ంలోని దేవెగౌడ నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల వ‌రుస భేటీల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే ఈ వారంలోనే డీఎంకే నేత‌ల‌తో కూడా ఆయ‌న భేటీ అవుతారు. ఇప్ప‌టికే ఢిల్లీలో కూడా బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు బెంగ‌ళూరులో త‌న మిత్ర ప‌క్షాల‌తో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగానే చంద్ర‌బాబు క‌ర్ణాట‌క‌లోఇ బీజేపీయేత‌ర ప‌క్షాల‌తోనూ భేటీ కానున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో అలాగే, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేత‌లతో చంద్ర‌బాబు భేటీల‌ను కొన‌సాగిస్తున్నారు. 
 
 

Comments