కలలో వేంకటేశ్వరస్వామి కనిపించాడు : మంజు భార్గవి

Venkateswara Swamy appeared in the dream: Manju Bhargavi

కలలో వేంకటేశ్వరస్వామి కనిపించాడు : మంజు భార్గవి

యాక్టర్ గా, డ్యాన్సర్ గా తెలుగు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగారు క్లాసికల్ డ్యాన్సర్ మంజు భార్గవి...మేకప్ అవసరం లేకుండా కేవలం హావభావాలతో ‘శంకరాభరణం’లో ఆమె అభినయించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. యమలీల లో తల్లిగా లాలించినా, నిన్నే పెళ్లాడతా లో మోడ్రన్ మదర్గా అలరించినా, ‘పౌర్ణమి’తో నెగెటివ్ పాత్రలో మెప్పించినా ఆమెకు ఆమె సాటి....తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు...

చిన్నప్పటి నుంచి కూడా తనకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టమని. దేవుడి తో తనకు కలిగిన ఒక అనుభవాన్ని ఆమె చెప్పుకొచ్చింది... మా ఇంట్లో నేను పడుకుని .. ఎదురుగా గోడకి వున్న వేంకటేశ్వరస్వామి ఫోటోను చూశాను. స్వామివారి ఒక చేయి వంపు తిరిగి నడుము మీదకి ఉంటుంది.  దాన్ని చూసి ఆ స్వామితో, ఎప్పుడూ చేయి పక్కకు పెట్టుకుంటావు. నీకు నొప్పిగా అనిపించదా? అని దేవుడిని అడిగా. ఆ రోజు రాత్రి నా కలలోకి ఆయన వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చాడు.  నాకు 11 ఏళ్ల వయసులో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్పండి నేను ఆయన భక్తురాలినా .. కాదా?" అంటూ నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ttdవాళ్లు ‘శ్రీనివాస కల్యాణం’ చేయమని ప్రాజెక్టు అప్పగించారు. కొండకు నడిచి వచ్చి, అంగ ప్రదక్షిణ చేసి, ప్రోగ్రాం చేస్తానని మొక్కుకున్నా.

అలా సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి దర్శనం నాకు కలిగింది..నా జన్మ ధన్యమైంది అని చెప్పుకొచ్చారు మంజుభార్గవి...నిజానికి అంతటి గొప్ప సినిమా చేసిన ఆమె, ఆతరువాత తన కెరియర్లో అనవసరమైన సినిమాలు చేసి కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు అనే పుకారు లేకపోలేదు...అంత గొప్ప సినిమాలో చేసిన ఆమె కొన్ని సినిమా లలో వ్యాంప్ కారెక్టర్లు వేయడం లాంటివి నాటితరం ప్రేక్షకులకు నచ్చలేదు....ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో ప్రత్యెక స్థానాన్ని సంపాదించుకున్నారు...

యమలీలా సినిమా విశేషాలు చెప్తూ  నేను చేసే పాత్రను గురించి ఒకటికి రెండు సార్లు విని .. బాగుంది అనుకుంటేనే చేసేదానిని. అలాంటిది ఒక రోజున కృష్ణారెడ్డిగారు మా ఇంటికి వచ్చారు. కథ చెప్పకుండానే ‘యమలీల’ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నేను నటిస్తేనే బాగుంటుందని అన్నారు. కథ విన్న తరువాత నాకు బాగా నచ్చేసింది. ఒక కొడుకు కోసం తల్లిపడే వేదన .. ఒక తల్లి కోసం కొడుకుపడే తాపత్రయం నచ్చడం వల్లనే ఆ సినిమా చేయడానికి అంగీకరించాను. అది నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు.

Comments