కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు

The prospective chief minister is only Rs 1200 / -

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు


యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతీ నాయకుడు అంటాడు, కానీ నిజానికి రానిస్తారా? రానివ్వరు. ఇప్పుడున్న నాయకుల్లో ఆ లోకేష్, జగన్ లాంటి సౌండ్ పార్టీలకి తప్ప సామాన్య యువతకి రాజకీయాల్లో చోటు లేదు. డబ్బుందా? వచ్చి స్యూట్ కేసు ఇచ్చి టికెట్ తీసుకెళ్లు, ఎలక్షన్స్ అయ్యాక ఎంత కావాలంటే అంత దోచుకెళ్లు. ఇదీ ఇవాల్టి రాజకీయాలు. రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ముందు కోట్లు ఖర్చుపెట్టాలి, ఆ తర్వాత ఖర్చుపెట్టినవన్నీ దక్కించుకోవాలి. ఈ ఫార్మాట్ లోనే నడుస్తున్నాయి రాజకీయాలు. 

మరి ఇలాంటి రాజకీయాల్లోకి సామాన్యులు రావడానికి ఆస్కారం ఉంటుందా? కానీ ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మహిళ మాత్రం ఎటువంటి ఆస్తులూ లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు. సర్పంచ్ గానో, జడ్పీటీసీగానో కాదు, ఏకంగా సిఎం అభ్యర్ధిగానే ఆమె పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె పేరు ప్రతిమా వాస్నిక్. వయసు 37 ఏళ్ళు. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీద పోటీకి నిలబడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్ధిగా రమణ్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ కోడలు కరుణా శుక్లాలు సీఎం సీటు కోసం పోటీ పడుతుండగా, ప్రతిమా వాస్నిక్ అనే నిరుపేద మహిళ కూడా పోటీపడుతున్నారు. 

నిరుపేద మహిళ అంటున్నారు. సర్పంచ్ గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు పెట్టాలి. అలాంటిది సీఎంగా నిలబడాలంటే తడిసిపోద్ది. సీఎంగా పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆమె నిరుపేద మహిళ అయి ఉండదు, ఆమె ఆస్తి వేల కోట్లు ఉండే ఉంటుంది అని అనుకుంటున్నారేమో కానీ నిజంగానే ఆమె నిరుపేద మహిళ. ఆమె భర్త ఒక హోటల్ లో వంట వాడిగా పనిచేస్తున్నారు. ఆమె ఇంట్లోనే ఉంటారు. ఒకటో తారీఖు వెళ్ళి ముప్పై ఒకటో తారీఖు వస్తే వాళ్ళ చేతిలో ఉండేది మహా ఐతే పది, పదిహేను వేలు అంతే. ఆ డబ్బులతోనే ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈమె నామినేషన్ పత్రంలో తన అధికారిక ఆస్తి విలువ 12 వందల రూపాయలుగా పేర్కొన్నారు. తన దగ్గర ఎన్నికల ఫండ్ 20 వేలకు మించి ఒక్క పైసా కూడా లేదని వెల్లడించారు.

 అది నిజమో కాదని నిర్ధారించక ఆమె ఆస్తి కేవలం 12 వందల రూపాయలే అని తేలింది. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే ఆమె ఎన్నికల బరిలో నిలిచినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి తగినంత నిధులు లేకపోవటంతో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపర్చాలన్న హామీలతో పాటు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు లభించాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆమె బరిలోకి నిలిచినట్లు చెబుతున్నారు. ఇక ఆమె సీఎంగా పోటీ చేసేందుకు గల ముఖ్య కారణాన్ని కూడా వెల్లడించారు. 

గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచిన బేజీపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆ తర్వాత తమ ఊరి గురించి పట్టించుకోలేదని, ఊరిని బాగుచేయమని అడిగితే చులకనగా మాట్లాడారని, అందుకే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. సామాన్యురాలు కూడా సీఎంగా నిలబడడానికి ప్రయత్నిస్తోంది అంటూ తెగ గింజుకుపోతున్నారు. "అంతగా సామాన్యులని రానివ్వకూడదనుకున్నప్పుడు, ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇలానే తిరుగుబాటు చేస్తారు. తప్పు చేసింది మీరు, పైగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పని మీరు చేస్తే మా పని మేము చేసుకుంటాం. మీ వాటిలో తలదూర్చం కదా" అంటూ సామాన్య నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Comments